By: Haritha | Updated at : 05 Feb 2023 12:18 PM (IST)
(Image credit: Pixabay)
థైరాయిడ్ అనేది మెడలో ఉండే ఒక చిన్న గ్రంధి. ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. శరీర జీవక్రియలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ గ్రంధి సరిగా పనిచేయకపోతే బరువు పెరిగిపోవడం, శక్తిహీనంగా మారడం, మానసిక స్థితిలో మార్పులు రావడం వంటివి జరుగుతాయి. థైరాయిడ్ సమస్య వచ్చాక కచ్చితంగా మందులు వేసుకోవాలి. రోజూ ఒక టాబ్లెట్ వేసుకోమని సూచిస్తారు వైద్యులు. దీన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రమాదకరంగా మారుతుంది. పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు థైరాయిడ్ గ్రంధి సమస్యను సూచిస్తాయి.
పాదాల నొప్పి
థైరాయిడ్ వచ్చాక అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి పాదాలలో నొప్పి. థైరాయిడ్ గ్రంధి శరీర జీవక్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి ఉత్పత్తి చేయనప్పుడు పాదాలలో కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంతో పాటు అనేక పరిస్థితులకు దారితీస్తాయి. పాదాల నొప్పి వస్తుంటే అది థైరాయిడ్ సమస్యకే కాదు, థైరాయిడ్ క్యాన్సర్‌కు సంబంధించింది కూడా కాబట్టి. పాదాల నొప్పిని తేలిక తీసుకోకుండా, ఎక్కువ కాలం పాటు వేధిస్తుంటే వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం.
దురద
హైపోథైరాయిడిజంలో పాదాల అడుగున దురద రావడం జరుగుతుంది. ఇది పాదాలతోనే ఆగిపోదు. అక్కడ నుంచి కాళ్లకు, జననేంద్రియాలు కూడా సోకుతుంది. థైరాయిడ్ గ్రంధి ఉత్పత్తి తగ్గినప్పుడు నూనెలు, చెమట వంటి స్రావాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం పొడిగా మారుతుంది. అలా పొడిగా మారడం వల్ల దురద అనిపిస్తుంది. కాబట్టి పాదాల అధికంగా దురద వేస్తుంటే, ఒకసారి థైరాయిడ్ పనితీరును చెక్ చేసుకోవాలి.
చల్లటి పాదాలు
థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయనప్పుడు పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో పాదాలు చల్లగా మారిపోతాయి. ఇలా మీకు ఎక్కువ కాలం పాటు చల్లని పాదాల సమస్య ఉంటే దానికి కారణం థైరాయిడ్ అయి ఉండొచ్చు.
పగిలిన పాదాలు
పాదాల పగుళ్లను చాలా తేలికగా తీసుకుంటారు. థైరాయిడ్ గ్రంధి చర్మానికి కావాల్సినంత తేమను, చెమటను ఉత్పత్తి చేయనప్పుడు ఇలా పాదాలు పగిలి బాధాకరంగా మారుతాయి.
పాదాల వాపు
పాదాలు కాళ్లల్లో వాపు, నొప్పి రావడం హైపోథైరాయిడిజం వల్ల కూడా అవుతుంది. కిడ్నీ పనిచేయకపోవడం, మధుమేహం, చర్మవ్యాధులు, గుండె జబ్బులు ఉన్న వారిలో కూడా ఇలా పాదాల నొప్పులు, వాపు కనిపిస్తాయి.
థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం సమస్యలు వస్తాయి. ఈ సమస్యల బారిన పడిన వాళ్ళు పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Also read: మూడేళ్లు దాటిన పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం - వెంటనే వైద్యుల్ని కలవండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవాలంటే రోజూ ఆ పదార్ధం తినాల్సిందే
Kids: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం
World Autism Awareness Day: ఆటిజం అంటే ఏమిటి? పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
నాకూ, నా భర్తకు మధ్యలో మా అత్తగారు - ఆవిడ ప్రవర్తన నాకు నచ్చడం లేదు
Summer Foods: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
SRH Vs RR: టాస్ రైజర్స్దే - బౌలింగ్కు మొగ్గు చూపిన భువీ!
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం