Early Aging: ఈ ఆరు అలవాట్లు వదలకపోతే, త్వరగా ముసలివాళ్లవ్వడం ఖాయం
కొన్ని అలవాట్లు శరీరాన్ని త్వరగా కుంగిపోయేలా చేస్తాయి. అలాంటి అలవాట్లే ఇవన్నీ.
వృద్ధాప్యం అనేది ప్రతి జీవిలో కలిగే ప్రక్రియే. ఈ ప్రక్రియను ఆపడం ఎవరితరం కాదు. కానీ కొందరు మాత్రం చిన్న వయసులోనే పెద్ద వయసు వారిలా కనిపిస్తారు. వారి వయసుకు తగ్గట్టు కాకుండా చర్మం ముసలిదైపోయినట్టు కనిపిస్తుంది. దీనికి కారణం వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలే. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలకు ఎక్కువగా గురికావడం వల్ల కూడా యవ్వనవంతమైన చర్మాన్ని వారు కోల్పోతారు. కాబట్టి చర్మం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కింద చెప్పిన ఆరు అలవాట్లు ఉన్నవారిలో త్వరగా వృద్ధాప్య సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. మీకూ ఈ అలవాట్లు ఉంటే వాటిని వదలుకోవడ లేదా తగ్గించడం చాలా అవసరం.
మద్యపానం
ఆల్కహాల్ అధికంగా తాగే వారిలో వృద్ధాప్య కారకాలు వేగంగా పనిచేస్తాయని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అధిక మద్యానికి బానిసలైతే శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. శరీరంలో నీరు ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు చర్మం వృద్ధాప్య లక్షణాలను చూపించడం ప్రారంభిస్తుంది. మద్యం శరీరంలోని ముఖ్యమైన పోషకాలను కరిగించి కణాల పునరుత్పత్తిని ఆపుతుంది. దీని వల్ల మీరు వయసుకు మించి పెద్దవారిగా కనిపిస్తారు.
చక్కెర పానీయాలు
కూల్ డ్రింకులు, చక్కెర నిండిన కాక్ టెయిల్స్ చాలా ప్రమాదకరమైనవి. చర్మం ఆరోగ్యాన్ని కాపాడే కొల్లాజెన్‌ను నాశనం చేస్తుంది. చక్కెర పానీయాల వల్ల శరీరంలో డీహైడ్రేషన్ అధికమవుతుంది. దీంతో చర్మంపై గీతలు, ముడతలు వచ్చేస్తాయి.
సాల్టీ ఆహారం
ఉప్పులో ఉండే అయోడిన్ కండరాల నిర్మాణానికి చాలా అవసరం. వంట చేసేటప్పడు ఉప్పును వేయండి, ఒకవేళ తినేటప్పుడు ఆ ఉప్పు సరిపోయినట్టు అనిపించకపోతే అలాగే తినేయండి. కానీ పచ్చి ఉప్పును వేసుకుని తినవద్దు. ఇది త్వరగా ముసలి ఛాయలను పెంచుతుంది. శరీరంలో ఉప్పుడు అతిగా చేరితే డీహైడ్రేషన్ సమస్య మొదలవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది, కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.
ప్రాసెస్ చేసిన మాంసాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందులోనూ ప్రాసెస్ చేసిన మాంసం వెరైటీలు తినడం ఇంకా చెడు చేస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఉప్పును జోడిస్తారు. ఇతర రసాయనాలు కూడా కలుపుతారు. వీటిని దీర్ఘకాలంగా తినడం వల్ల శరీరంలో వృద్ధాప్యం సంకేతాలు వేగంగా కనిపిస్తాయి.
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్
వేయించిన ఆహారాలు చాలా కేలరీలను, కొవ్వును కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మొటిమల సమస్య కూడా పెరుగుతుంది. చర్మంలో తేమ కూడా ఎండిపోతుంది. దీనివల్ల చర్మం పొడి బారిపోతుంది.
స్పైసీ ఫుడ్స్
కారంగా ఉండే ఆహారాలంటే చాలా మంది ఇష్టపడతారు. రుచి గురించి చూసుకుంటే చర్మం త్వరగా ముసలిదైపోతుంది. నలభై ఏళ్లు దాటిన వారు కారంగా ఉండే ఆహారాలను తగ్గించాలి. చర్మంపై ముడతలు, మచ్చలు త్వరగా రాకుండా ఉంటాయి.
Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి
Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు