Weight Loss In Winter : చలికాలంలో బరువెందుకు పెరుగుతారు? ఈ సీజన్‌లో వెయిట్ తగ్గలాంటే ఈ డైట్ పాటించాల్సిందే
Weight Loss In Winter : చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన తగ్గరు. అలాంటివారు ఒక వారం పాటు ఈ డైట్ ఫాలో అవుతే ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Weight Loss In Winter : బరువు తగ్గి.. నాజుగ్గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఇందుకు కఠిన వ్యాయామాలు చేయడానికి వెనకాడట్లేదు. అయితే చాలికాలంలో మాత్రం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ సీజన్‌లో జీవక్రియ పనితీరు నెమ్మదిగా ఉంటుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు చాలా సమయం పడుతుంది. అలాగని బరువు తగ్గమేమో అని దిగులు వద్దు. జీవక్రియల పనితీరును మెరుగుపరిచే ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు మన వంటింట్లో ఉండే మసాలాలను మించిన మంచి ఔషధం మరొకటి లేదంటున్నారు. ఈ శీతాకాలంలో శరీరంలోని జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గించేందుకు సహకరించే పదార్థాలేంటో చూద్దాం. చలికాలంలో వారం రోజులు పాటు ఈ డైట్ పాటిస్తే మీరు తప్పకుండా బరువు తగ్గుతారు.
1. డిటాక్స్ డ్రింక్స్ తో రోజును ప్రారంభించండి:
మీ డైట్ చార్ట్ తప్పనిసరిగా డిటాక్స్ డ్రింక్స్ ను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. నీటితోపాటు ఆరోగ్యకరమైన మూలికలతో తయారు చేసిన డ్రింక్స్ ప్రతిరోజూ తీసుకోవాలి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, టాక్సిన్స్ ను బయటకు పంపడంలో కీలకంగా వ్యవహారిస్తాయి. తద్వారా జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. డిటాక్స్ డ్రింక్స్ లో భాగంగా నిమ్మరసం, పుదీనా, ఆపిల్, ద్రాక్ష, కీరదోస, ఆరెంజ్ వంటి వాటిని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. అంతేకాదు డిటాక్స్ డ్రింక్స్ కు కాస్త సుగంధ ద్రవ్యాలను జోడించి తీసుకోవచ్చు.
2. బ్రేక్ ఫాస్ట్:
బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. ఎందుకంటే శీతాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. పిండిపదార్థాలు, ప్రాసెస్ ఫుడ్, కొవ్వులు సమృద్ధిగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో గ్లైసెమిక్ సూచిక ఉండటంతో ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.
3. నీరు ఎక్కువగా తాగడం:
బరువు తగ్గి శరీరం లైట్ గా ఉండాలని భావించేవాళ్లు భోజనం చేయడానికి ముందు గుర్తుంచుకోవల్సిన ముఖ్యంమైన విషయం నీళ్లు తాగడం. ఆకలిగా అనిపించినప్పుడు నీళ్లుతాగడం మంచిదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. నీళ్లు ఆకలిని తగ్గిస్తాయి. చలికాలంలో చాలా మంది వాతావరణం చల్లగా ఉందని నీళ్లు తాగడం తగ్గిస్తారు. ఫలితంగా డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. కాబటి ఈ కాలమే కాదు ఏకాలంలో అయినా సరే శరీరానికి కావాల్సినంత నీరు అందించడం చాలా ముఖ్యం.
4. డిజర్ట్ లకు బదులుగా ఇవి తినండి:
చలికాలంలో చాలా మందికి స్వీట్స్ తినాలనే కోరిక కలుగుతుంది. కానీ వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అయితే ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం తింటే ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో హల్వా, లడ్డులను తినవచ్చి సూచిస్తున్నారు. డిజర్టులకు బదులుగా సాయంత్రం వీటిని స్నాక్స్ గా తీసుకోవచ్చని అంటున్నారు. నువ్వుల లడ్డులు, హల్వా, డ్రైఫ్రూట్స్ లడ్డూ, గులాబ్ జామున్, చిక్కీ, వంటివి తీసుకోవచ్చని చెబుతున్నారు.
5. తక్కువగా ఆల్కాహాల్ తీసుకోవడం:
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. కానీ పరిమితంగా తీసుకుంటే కూడా మంచిదని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. చలికాలంలో చాలా మంది అధికంగా ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహల్ వినియోగం నిద్రకు భంగం కలిగించడంతోపాటు శరీరంలో అదనపు కేలరీను చేర్చుతుంది. శీతాకాలంలో బరువు తగ్గడానికి పాటించే డైట్ చిట్కా ఏంటంటే.. ఖాళీ కడుపుతో పార్టీలకు వెళ్లకూడదు. పార్టీకి వెళ్లే ముందు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఆల్కాహాల్ వినియోగం కూడా పరిమితంగా ఉండాలి.
6. శీతాకాలంలో లభించే సూపర్ ఫుడ్స్ తినండి:
కాలానుగుణ ఉత్పత్తులను మన ఆహారంలో చేర్చుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఒక సీజన్‌లో పండే పండ్లు కూరగాయలు,మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ప్రతి పోషకాన్ని అందిస్తాయి. కానీ మనం వాటిని విస్మరిస్తుంటాం. చలికాలంలో, బరువు తగ్గించే ప్రక్రియను మరింత పెంచి, మిమ్మల్ని వెచ్చగా బలంగా ఉంచుకోవడానికి తగినంత నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నట్స్ మొదలైనవి తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.