అన్వేషించండి

Telugu Recipes: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి

Telugu Recipes: పాలపొడితో చేసే వంటకాలు టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు నచ్చుతాయి.

Telugu Recipes: సాయంత్రం అయితే చాలు పిల్లలకు ఏం పెట్టాలని ఆలోచించే తల్లులు ఎంతోమంది. అలాంటి వారికి ఆరోగ్యకరమైన రెసిపీ ఈ పాలపొడి బర్ఫీ. పాలపొడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితో బర్ఫీ చేసి ఇవ్వడం వల్ల ఆ పోషకాలన్నీ శరీరంలో చేరుతాయి. అంతేకాదు ఈ బర్ఫీలో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వంటివి కలుపుతాము... కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ లోని పోషకాలు కూడా వారికి అందుతాయి. దీని తయారు చేయడం చాలా సులువు. ఎలాగో ఒకసారి చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
పాలపొడి - రెండు కప్పులు 
చక్కెర - ఒక కప్పు 
జీడిపప్పు - గుప్పెడు 
బాదం పలుకులు - గుప్పెడు 
పిస్తా - గుప్పెడు 
కిస్మిస్ - పది 
యాలకులు - మూడు 
నెయ్యి - రెండు స్పూన్లు

తయారీ ఇలా
ఇక్కడ తీసుకున్న డ్రైఫ్రూట్స్ అన్నింటిని చిన్నచిన్నగా తరుగుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి అందులో పంచదార, కప్పు నీళ్లు పోయాలి. తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. తీగపాకం వచ్చినాక మంటను తగ్గించి పాలపొడిని వేసి మెల్లగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అందులో బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి అన్ని వేసి కలపాలి. ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ప్లేట్ అంతా పరుచుకునేలా వేయాలి. పైన పిస్తా, బాదం, జీడిపప్పులతో గార్నిష్ చేస్తే బాగుంటుంది. చల్లారాక వీటిని ముక్కలుగా కోసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇవి ఫ్రెష్ గా ఉంటాయి. పిల్లలకు చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి.

పాలను పొడిగా మార్చడం ద్వారా ఈ పాల పొడిని తయారు చేస్తారు. చాక్లెట్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. పాలలో ఉండే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.  అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అలాగే కాస్త కొవ్వు కూడా ఉంటుంది. అందుకే దీన్ని అధికంగా తినకూడదు. ఇక ఇందులో వాడే బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా వంటి వాటిలో పోషకాలు చాలా ఎక్కువ. వాటిని అధికంగానే వేసాము కాబట్టి పిల్లలు ఆ నట్స్ ని తింటారు. ఆ నట్స్ ఇచ్చే పోషకాలు అన్ని వారికి అందుతాయి. మానసికంగా, శారీరకంగా ఈ నట్స్ తినడం చాలా ఆరోగ్యకరం. బాదంపప్పుల్లో మన శరీరానికి అవసరమైన అమైనా ఆమ్లాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే లక్షణం వీటికి ఉంటుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా కాపాడుతాయి. ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, క్యాల్షియం, మాంగనీస్, పోలేట్ వంటివన్నీ కూడా ఇందులో అధికంగా ఉంటాయి. నట్స్ తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా బర్ఫీలుగా తయారు చేసి వాటిని అందిస్తే మంచిది. ఈ నట్స్ తినడం వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో పెరగకుండా అడ్డుకోవచ్చు.

Also read: మీరు ఆల్కహాల్ తాగకపోయినా ఈ అలవాట్లతో కాలేయ సమస్యలు వచ్చే అవకాశం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
IPL 2024: కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chandrababu naidu Casted Vote | ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు | ABP DesamChiranjeevi Casted Vote With Family | కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి |ABP DesamCM Jagan Casted his Vote With Family | పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ | ABP DesamAllu Arjun on Nandyal Issue | నంద్యాల వైసీపీ అభ్యర్థి తరపు ప్రచారంపై అల్లు అర్జున్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
IPL 2024: కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
Amazon: అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
Relationship Tips : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
Palnadu News: రెంటచింతలలో వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు- వాహనాలు ధ్వంసం, ఉద్రిక్తత
రెంటచింతలలో వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు- వాహనాలు ధ్వంసం, ఉద్రిక్తత
Arundhati Child Artist: 'అరుంధతి'లోని ఈ చిన్నారి జేజమ్మ ఇప్పుడెలా ఉందో చూశారా? - ప్రస్తుతం ఏం చేస్తుందంటే!
'అరుంధతి'లోని ఈ చిన్నారి జేజమ్మ ఇప్పుడెలా ఉందో చూశారా? - ప్రస్తుతం ఏం చేస్తుందంటే!
Embed widget