News
News
X

ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే

రోగనిరోధక వ్యవస్థ సవ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేది.

FOLLOW US: 

కరోనా వైరస్, టమోటా ఫ్లూ, మంకీ పాక్స్... ఇలా ప్రపంచంపై అనేక వైరస్‌లు దాడి చేస్తున్నాయి. మరో పక్క వానాకాలం, శీతాకాలం వచ్చిందటే సీజనల్ వ్యాధులు రావడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రోగనిరోధక శక్తి తగ్గితే ఏ వైరస్, బ్యాక్టిరియాలైనా మనపై సులువుగా దాడి చేస్తాయి. మన శరీరంలోకి చొచ్చుకుని వెళ్లి అవయవాలను దెబ్బతీస్తాయి. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే అంత ఆరోగ్యం కానీ రోగనిరోధక శక్తి చాలా మందిలో తగ్గుతూ వస్తోంది. ఇలా తగ్గినప్పుడల్లా అది కొన్ని సంకేతాలను, లక్షణలను చూపిస్తుంది. ఆ లక్షణాలు కనిపించినప్పుడు అలసత్వం వహించకుండా వెంటనే బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి. 

లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. ఎల్లప్పుడూ అలసటగా ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. 
2. తిన్న తరువాత కూడా నీరసంగా ఉంటుంది. 
3. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. బద్దకంగా అనిపిస్తుంది. 
4. దగ్గు, జలువు, జ్వరం వచ్చి పోతుంటాయి. 
5. ఆహారం సరిగా జీర్ణమవుతున్నట్టు అనిపించదు. 
6. ఒత్తిడి అధికంగా ఉంటుంది. 
7. చిన్న చిన్న దెబ్బలు కూడా త్వరగా మానవు. 

పైన చెప్పినవన్నీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నాయని చెప్పే లక్షణాలు. ఇవి కనిపిస్తే మీరు ముందే జాగ్రత్త పడాలి. లేకుంటే పెద్ద అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. ఆహార పరంగా, నిద్ర పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి నిండా నిద్ర తక్కువైనా కూడా రోగనిరోధక శక్తి మందగిస్తుంది. 

ఏం తినాలి?
1. ఆహారంలో మిరియాలు, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి మసాలా దినుసులను భాగం చేసుకోవాలి.  ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటాయి. 
2. చికెన్, చేపలు, గుడ్లు రెండు రోజులకోసారి తినాలి. మూడింట్లో ఏదో ఒకటి రెండు రోజులకోసారి తిన్నా చాలు. వీలైతే గుడ్డు రోజూ తింటే మంచిది. 
3. గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, జీడిపప్పులు, బాదంపప్పులు, మొలకెత్తిన గింజలు, అవిసె గింజలు వంటివి స్నాక్స్ లా రోజులో ఓసారైనా తినాలి. 
4. ఇక పాలకూర, తోటకూర, చుక్కకూర వంటి ఆకు కూరలు రోజులో ఒక పూటైనా తినాలి. 
5. పాలు, పెరుగు రోజుకు ఒక పూట కచ్చితంగా తినాలి. 
6. నూనె అధికంగా వేసిన వంటలు, డీప్ ఫ్రైలు తగ్గించాలి. 
7. చిలగడ దుంపలు ఉడకబెట్టుకుని తింటుండాలి. 
8. విటమిన్ డి సక్రమంగా అందేలా కనీసం ఎండలో అరగంటైనా నిల్చోవాలి. 
9. శరీరంలో ఎలాంటి పోషకాహారలోపం లేకుండా చూసుకోవాలి. 

Also read: జున్నుపాలు అవసరమే లేని జున్ను రెసిపీ, కుక్కర్లో ఇలా వండేయచ్చు

Also read: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 18 Aug 2022 05:31 PM (IST) Tags: Immunity power How to Increase Immunity power What to eat for Immunity power

సంబంధిత కథనాలు

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Viral Video: పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించలే-ఏపనైనా ఒంటి చేత్తోనే, సాధువు వీడియో వైరల్!

Viral Video: పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించలే-ఏపనైనా ఒంటి చేత్తోనే, సాధువు వీడియో వైరల్!

Microwave Oven: బేకింగ్ చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు!

Microwave Oven: బేకింగ్ చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు!

Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!

Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam