By: Haritha | Updated at : 29 Jun 2023 09:49 AM (IST)
(Image credit: Representative image/Pixabay)
ప్రశ్న: మాది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లికి ముందు ఒకరికి ఒకరితో పరిచయం లేదు. కేవలం పెళ్లి చూపుల్లోనే నేను ఆయన్ని చూసాను. పెద్దలకు నచ్చడంతో ఇద్దరమూ పెళ్లి చేసుకున్నాము. ప్రస్తుతం పెళ్లయి మూడేళ్లు అవుతుంది. ఒక పాప కూడా ఉంది. పెళ్లయిన కొత్తలో ఆయన నాతో సరిగా ఉండేవారు కాదు. మూడీగా ఉండేవారు. ఎందుకలా ఉంటున్నారో నాకు అర్థం కాలేదు. నాకు కూడా పెళ్లి జీవితం కొత్త కావడంతో ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నాను. ఆ తరువాత ఆయన మెల్లగా మాతో చక్కగా కలిసిపోయారు. ఈ మధ్యన మా ఇల్లును శుభ్రం చేసినప్పుడు నాకు కొన్ని ఫోటోలు దొరికాయి. ఆ ఫోటోలో నా భర్త వేరే అమ్మాయితో చాలా క్లోజ్‌గా ఉన్నాడు. అవి పెళ్లికి ముందు ఫోటోలని అర్థం అవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినట్టు తెలుస్తోంది. ఆ ఫోటోలు చూసినప్పుడు నుంచి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఆయన్ను అడగాలనిపిస్తుంది, అడిగితే ఎలాంటి గొడవలు అవుతాయో అని భయం వేస్తుంది. పెళ్లయ్యాక కూడా ఆ ఫోటోలను ఆయన దాయడంలో అవసరం ఏముందని అనిపిస్తుంది. ఫోటోలతో పాటు కొన్ని ప్రేమలేఖలు కూడా బయటపడ్డాయి. దాంతో నేను అవన్నీ చదివేశాను. వాళ్ళది గాఢమైన ప్రేమ అని అర్థం అయింది. అలాగే అమ్మాయితప్పుకోవడం వల్ల వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని ఆ లేఖల ద్వారా తెలుస్తోంది. అవి చదివినప్పటి నుంచి నాకు ప్రశాంతంగా లేదు. మా ఆయన జీవితంలో మరొక మహిళ ఉండేదని భరించడం కష్టంగా ఉంది. ఆ జ్ఞాపకాలు ఇంకా ఆయన దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ విషయం ఆయన్ని అడగాలా? వద్దా? అనే సందేహంలో ఉన్నాను. ఏం చేయమంటారో చెప్పండి.
జవాబు: మీకు పెళ్లయి మూడేళ్లు అవుతుంది. మీ భర్త మీకు మాత్రమే సొంతం అనుకుని ఈ మూడేళ్లు మీరు హాయిగా జీవించారు. ఇప్పుడు వేరొకరితో ఆయన ఉన్న ఫోటోలు చూడడం మీకు చాలా బాధ కలిగిస్తుంది. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి... ప్రతి ఒక్కరికి ఏదో ఒక గతం ఉంటుంది. ఆ గతం నుంచి తేరుకొని ముందుకు అడుగు వేసి భవిష్యత్తును వెతుక్కోవడమే జీవితం. మీ భర్త కూడా అదే చేశాడని అనుకోవచ్చు కదా. ప్రస్తుతం ఆయన మీతో చాలా చక్కగా ఉంటున్నారు. ఆమెతో ఎలాంటి కాంటాక్ట్స్ లేవని అర్థం అవుతోంది. అలాంటప్పుడు మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోలు, ప్రేమలేఖలు మీ భర్త జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల వల్ల మిమ్మల్ని మీ పాపని ఆయన నిర్లక్ష్యం చేయడం లేదు. ఒక విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే అంతా మంచిగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు నెగిటివ్‌గా ఆలోచించడం మొదలు పెడతారో అన్ని తప్పులే కనిపిస్తాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. అది కేవలం మీ ఇల్లే కాదు, అతని ఇల్లు కూడా. కాబట్టి ఆ ఇంట్లో అతని జ్ఞాపకాలు ఉండే హక్కు ఉంది. ఎక్కడో పాతబడిపోయినా బ్యాగులోంచి బయటపడిన ఫోటోలను ఆధారంగా చేసుకుని మీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవడం అవసరమా? ఈ మూడేళ్లు ఆయన మీకే కట్టుబడి ఉన్నాడు. మీ ఆలనా పాలనలోనే జీవిస్తున్నాడు. అలాంటప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ విషయంలో ఎంత ఓపెన్‌గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు.
ఆ జ్ఞాపకాలను అతనికి చూపించి మళ్లీ అతని మనసును కల్లోలం చేయడం అవసరమా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఆ జ్ఞాపకాలను జ్ఞాపకాలు లాగే వదిలేయండి. అతను మనసులోకి, మెదడులోకి మళ్ళీ వచ్చేలా చేయకండి. ఆ ఫోటోలో ఉన్న ఇద్దరూ... వారి వారి జీవితాల్లో బిజీగా ఉన్నారు. మధ్యలో మీరు మాత్రం మళ్లీ ఆ విషయాలను కదిలించడం ఎంతవరకు సమంజసం? మీకు అసూయ రావడానికి ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. మీరు మీ భర్త జీవితంలోకి రాకముందు ఆమె ఉండేది. అలానే వెళ్ళిపోయింది. ప్రస్తుతం మీ భర్తకు మీరు, మీ పాప లోకమని చెబుతున్నారు. అలాంటప్పుడు అతడికి ఈ ఫోటోలు, ప్రేమలేఖలు చూపించి మానసిక ఒత్తిడిలోకి తోయడం కరెక్ట్ కాదు. వాటిని మంచి మనసుతో జ్ఞాపకాలుగా వదిలేయాలనుకుంటే అలా వదిలేయండి. లేదా అతని కంట పడకుండా చేయాలి అనుకుంటే కాల్చి బూడిద చేసేయండి. మీ ఇద్దరి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీ అనుబంధం మరింతగా బలపడేలా చేయండి. అంతేగాని పాత జ్ఞాపకాలను ఆయన ముందు పెట్టి మీ భర్తలోని బాధను పెంచకండి.
Also read: గాలిలో తేలుకుంటూ వచ్చి పిజ్జా డెలివరీ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి
Also read: ప్రోటీన్ షేక్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న టీనేజర్, దాని వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్
Weight Loss In Winter : చలికాలంలో బరువెందుకు పెరుగుతారు? ఈ సీజన్లో వెయిట్ తగ్గలాంటే ఈ డైట్ పాటించాల్సిందే
Saint Nicholas Day: శాంట క్లాజ్ తాత ఎవరో తెలుసా? తన బాధను మరిచి, పేదల కన్నీళ్లు తుడిచి - గుండె బరువెక్కించే నికోలస్ కథ ఇది!
Improve Memory with Beer : బీర్ తాగితే బొజ్జ కాదు, బుద్ది పెరుగుతుందట - కానీ, చిన్నట్విస్ట్!
Christmas Special Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ డార్క్ చాక్లెట్ హాజెల్ నట్ కేక్.. టేస్టీ రెసిపీ ఇదే
How to travel Goa in low budget? : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?
Michaung Cyclone Effect In AP: మిగ్జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
/body>