Viral: గాలిలో తేలుకుంటూ వచ్చి పిజ్జా డెలివరీ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జెట్ సూట్ డెలివరీని ప్రయత్నించింది డొమినోస్.
పిజ్జా డెలివరీలో చరిత్ర సృష్టించింది డోమినోస్. యూకేలో తొలిసారిగా జెట్ సూట్ డెలివరీ బాయ్‌ని ప్రవేశపెట్టింది. ఎక్కడో కొండలపై సేదదీరుతున్న కస్టమర్‌కి జెట్ సూట్ వేసుకున్న డెలివరీ బాయ్, పిజ్జాను అందించి వచ్చాడు. అది కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పిజ్జా ఫీట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి నచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఫుడ్ డెలివరీలు పెరుగుతాయని ఆశిస్తున్నారు కస్టమర్లు. జెడ్ సూట్ వేసుకొని రావడం వల్ల ట్రాఫిక్ ఏమీ ఉండదని, తక్కువ సమయంలోనే డెలివరీ అవుతుందని వారు భావిస్తున్నారు. డొమినోస్ ఈ జెడ్ సూట్ డెలివరీ కోసం గ్రావిటీ ఇండస్ట్రీస్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదురుచుకుంది. వారే ఈ జెట్ సూట్లను డెలివరీ బాయ్ లకు అందించారు. వాటి సాయంతో గాలిలో తేలుతూ వెళుతున్నారు డెలివరీ బాయ్‌లు.
అయితే జెట్ సూట్ డెలివరీ రంగంలోకి అప్పుడే వచ్చే అవకాశం లేదు. కేవలం ఒక ప్రయోగంగా ఇలా ఒక డెలివరీని నిర్వహించారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. డెలివరీ ప్రక్రియలో సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇలాంటి డెలివరీలు చేయడానికి ముందు భద్రతా నిబంధనలు, పైలెట్ శిక్షణ, లాజిస్టికల్ సవాళ్లు వంటివి క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో డోమినోస్ మిగతా దేశాల్లో కూడా ఇలా జెట్ సూట్ డెలివరీ బాయ్స్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం యూకే లో ప్రయోగ దశలో ఉన్న ఈ పని అక్కడ పూర్తిగా విజయవంతం అయితేనే మిగతా చోట్ల కూడా ఇలాంటి డెలివరీలు అయ్యే అవకాశం ఉంది. అయితే సాధారణ ఫుడ్ డెలివరీతో పోలిస్తే ఇలా జెట్ సూట్ వేసుకొని డెలివరీ చేసేందుకు అధిక మొత్తంలో డెలివరీ చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. ఇది అందుబాటులోకి రావాలని బ్రిటన్ ప్రజలు కోరుకుంటున్నారు. ట్రాఫిక్ రద్దీ ఆకాశంలో ఉండదు కాబట్టి, ఆహారం త్వరగా వచ్చేస్తుందని, కాబట్టి జెట్ సూట్ డెలివరీ తమకు కావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
View this post on Instagram
Also read: ప్రోటీన్ షేక్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న టీనేజర్, దాని వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్
Also read: నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుందా? దానికి ఇవి కారణాలు కావచ్చు