By: Haritha | Updated at : 11 May 2023 10:30 AM (IST)
(Image credit: Pixabay)
ప్రశ్న: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త చాలా మంచివారు. పెళ్లి అయిన కొద్ది రోజులకే మా ఇద్దరం ప్రేమలో పడ్డాము. అతనిలో చెప్పడానికి పెద్ద సమస్యలేవీ లేవు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కాకపోతే అతనికి ఉన్న ఒక్క అలవాటు మా జీవితాన్ని నాశనం చేస్తోంది. మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. నా భర్తకు రాత్రిపూట నగ్నంగా నిద్రించే అలవాటు ఉంది . అది నాకు చాలా వింతగా అనిపిస్తోంది. పొద్దున్నే పనిమనిషి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి పనిమనిషి గదిలోపలకు వెళ్లి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసింది. ఆ రోజు నేను చాలా కుంగిపోయాను. ఆమె మా ఇంట్లో పని చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ విషయాన్ని నేను ఆయనకి చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. దుస్తులు వేసుకొని నిద్రపొమ్మని చెప్పాను. ఆయన దానికి ఒప్పుకోవడం లేదు. తనకు బట్టలు వేసుకుంటే నిద్ర పట్టదని చెబుతున్నాడు. ఇలాంటి వింత సమస్యను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. మనసులోనే మధన పడుతున్నాను. స్నేహితులకు, కుటుంబీకులకు చెబితే ఎక్కడ నవ్వులపాలవుతామేనని భయం. ఏం చేయాలో తెలియడం లేదు. మా మధ్య దూరం పెరిగిపోతోంది గొడవలు ఎక్కువైపోతున్నాయి. అతని చేత ఆ అలవాటు ఎలా మానిపించాలో చెప్పండి?
పరిష్కారం: రాత్రంతా నగ్నంగా నిద్రపోవడం వల్ల శరీరం సేద తీరుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అంతేకాదు సైన్స్ ప్రకారం నగ్నంగా నిద్రపోవడం అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఎంతోమంది ఇలానే నిద్రపోతారు. కానీ మన దేశంలో ఈ అలవాటు ఉన్నవారిని చాలా వింతగా చూస్తారు. అది ఒక పెద్ద సమస్యగా భావిస్తారు. నిజానికి అది మీ భర్త పూర్తి వ్యక్తిగత అలవాటు. దానిని మార్చుకోమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అతనికి అలా అయితేనే నిద్ర పడుతుంది. దుస్తులు వేసుకుంటే ఆయనకు నిద్ర పట్టదు. దుస్తులు వేసుకుని, నిద్ర చెడగొట్టుకుని మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని చెడగొట్టుకోమని మనం చెప్పలేం. మీ పనిమనిషితో మాత్రమే మీకు సమస్య అయితే ఆమెను ఆ గది క్లీన్ చేయక్కర్లేదని చెప్పండి. ఆ ఒక్క గది మీకు క్లీన్ చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. మీ భర్త మీకు ముఖ్యం అయినప్పుడు దీన్ని పెద్ద సమస్యగా చూడడం మానేసి చిన్న సమస్యగా చూడండి. అతనిది చెడ్డ అలవాటు కాదు, దానివల్ల మీరు గాని, ఇతరులు గాని ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అతను మంచి భర్త అని, విషయాల్లో మీకు సహకరిస్తారని, మీరు గాఢమైన ప్రేమలో ఉన్నారని చెప్పారు. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలను కూడా అంగీకరించాలి. ఆ లోపాలను కూడా ప్రేమించాలి. మీ భర్తకు ఉన్నది పెద్ద లోపమేమీ కాదు. అతను నిద్రపోయేటప్పుడు పూర్తి స్వేచ్ఛను కోరుకున్నాడు. అదే తప్పంటే ఎలా? దీనికి మీరు మీ భర్తను తప్పు పట్టడం, అతనితో గొడవ పడడం మానేసి పరిష్కారాన్ని ఆలోచించండి. మీ భర్త స్వేచ్ఛను, అలవాటును కాపాడుతూ, అతని గౌరవానికి భంగం కలగకుండా ఏం చేయాలో ఆలోచించండి. పనిమనిషి ముఖ్యమా? భర్త ముఖ్యమా అనేది మీరు ఆలోచించాల్సిందే.
మీరు ఉదయం పూట చీర లేదా సల్వార్ వేసుకుంటారు. అదే డ్రెస్ తో రాత్రి నిద్ర పోగలరా? కచ్చితంగా నైట్ డ్రెస్ లేదా నైటీనో వేసుకుంటారు. అది మీకు కంఫర్ట్ గా అనిపిస్తుంది. అలాగే మీ భర్తకు కూడా దుస్తులు లేకుండా పడుకోవడం కంఫర్ట్ గా ఉంది. ఆ కోణంలో చూడకుండా... దాన్ని ఒక మానసిక సమస్యగా చూడడం మానేయండి. కొత్త పనిమనిషిని పెట్టుకుని, ఆ ఒక్క గది తుడవాల్సిన అవసరం లేదని చెప్పండి. సమస్య పరిష్కారం అయినట్టే. ఇంత చిన్న సమస్యను భూతద్ధంలో పెట్టి చూడడం మానేయండి.
Also read: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం
Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో
Chai-Biscuit: ఛాయ్తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే
Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు
White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే
Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్ల రికార్డులు ఎలా ఉన్నాయి?