అన్వేషించండి

Isha Foundation : హైదరాబాద్ టూ ఈషా ఫౌండేషన్​ రౌండ్ ట్రిప్ డిటైల్స్.. బడ్జెట్ కేవలం రూ.3,500 మాత్రమే

Budget Friendly Trip to Isha Foundation : ఈషా ఫౌండేషన్​కి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. తక్కువ ఖర్చుతో హైదరాబాద్​ నుంచి వెళ్లి తిరిగి రాగలిగే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ డిటైల్స్ ఇప్పుడు చూసేద్దాం.  

Hyderabad to Isha Foundation Budget Trip : శివయ్యను ఆరాధించేవాళ్లు.. సద్గురును అభిమానించేవాళ్లు కచ్చితంగా వెళ్లాలనుకునే ప్రాంతాల్లో ఈషా ఫౌండేషన్ ఒకటి. కోయంబత్తూరులోని ఈ ప్రాంతానికి ప్రపంచనలుమూలల నుంచి భక్తులు వెళ్తూ ఉంటారు. మీరు కూడా హైదరాబాద్ నుంచి ఈషా ఫౌండేషన్​ను విజిట్ చేయడానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే తక్కువ బడ్జెట్​లో రౌండ్ ట్రిప్ ఎలా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

హైదరాబాద్ టూ కోయంబత్తూర్

హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకి రోజూ ట్రైన్ ఉంటుంది. సబరి ఎక్స్​ప్రెస్ (17230). ఈ ట్రైన్​కి స్లీపర్ క్లాస్ టికెట్ తీసుకుంటే రూ.525 పడుతుంది. హైదరాబాద్​లో మధ్యాహ్నం 12.20కి ఎక్కితే.. మీరు తర్వాతి రోజు ఉదయం 7.57కి కోయంబత్తూర్​లో దిగుతారు. 

స్టేయింగ్

కోయంబత్తూర్​లో స్టేయింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. వాటి ధర రూ.700 నుంచి మొదలవుతాయి. మీరు ఈషాలోనే స్టే చేయాలనుకుంటే రూ. 990తో రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు దానిలో స్టే చేయవచ్చు. బ్రంచ్, డిన్నర్​ ఉచితంగా అందిస్తారు. ఒకవేళ మీరు కోయంబత్తూర్​లో స్టేయింగ్ తీసుకుంటే.. అక్కడి నుంచి గాంధీపురం బస్​ స్టాప్​కి వెళ్లాలి. అక్కడి నుంచి మీరు ఈషా ఫౌండేషన్​కి బస్​లో వెళ్లొచ్చు. ఉదయం 5.30 నుంచి రాత్రి 8 వరకు బస్​లు అందుబాటులో ఉంటాయి. వీటి టికెట్ ధర రూ.40. మీరు ఇవే బస్​లలో రిటర్న్ కూడా అయిపోవచ్చు. 

ఉదయాన్నే ఈషాకి వెళ్లిపోతే.. రోజంతా అక్కడ ప్రశాంతంగా టైమ్​ని స్పెండ్ చేయవచ్చు. రెండ్రోజులు ఫుడ్​కి రూ.1000 అయ్యే అవకాశముంది. మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్​ని బట్టి, తినేవాటిని బట్టి ఈ ఖర్చు మారుతుంది. రాత్రి రూమ్​కి వెళ్లి మార్నింగ్ చెక్​ అవుట్ చేసేయాలి. 

సిరువాణి వాటర్ ఫాల్స్

మీకు వీలుంటే రూమ్​ని త్వరగా చెక్​ అవుట్ చేసేసి దగ్గర్లో ఉండే సిరువాణి వాటర్​ ఫాల్స్​ని విజిట్ చేయవచ్చు. ఉదయం అక్కడ టైమ్ స్పెండ్ చేసి.. మధ్యాహ్నం కోయంబత్తూరు స్టేషన్​కి వెళ్లిపోవచ్చు. చూసేందుకు ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ఫోటోలకు కూడా అనువైన ప్రదేశం.

రిటర్న్ జర్నీ

కోయంబత్తూరు టూ హైదరాబాద్ ట్రైన్ జర్నీ చేయవచ్చు. ప్రతిరోజూ సబరి ఎక్స్​ప్రెస్​ (17229) అందుబాటులో ఉంటుంది. మీరు సాయంత్రం 3.55కి ఎక్కితే.. హైదరాబాద్​లో మధ్యాహ్నం 12.30కి దిగుతారు. దీని టికెట్ ధర కూడా రూ.525.

రెండ్రోజులు, ఒక నైట్​కి మాత్రమే ఈ బడ్జెట్. మీరు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఖర్చులో మార్పులు ఉంటాయి. మీకు బడ్జెట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే 3rd AC టికెట్స్​ బుక్ చేసుకోవచ్చు. ఇది మీకు కంఫర్ట్​ని ఇస్తుంది. 

Also Read :  హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి 3K బడ్జెట్ ట్రిప్.. విజయవాడ నుంచి వెళ్తే డెడ్ ఈజీ, ట్రిప్ డిటైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
TGPSC: ‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
TGPSC: ‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
‘గ్రూప్‌-1’ పేపర్లు రీవాల్యూయేషన్ జరిపించండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Ishan Kishan: ఫీల్టింగ్‌లో ఇషాన్ కిషన్‌కు గాయం!- వీడియో చూసి భయపడుతున్న హైదరాబాద్‌ ఫ్యాన్స్ 
ఫీల్టింగ్‌లో ఇషాన్ కిషన్‌కు గాయం!- వీడియో చూసి భయపడుతున్న హైదరాబాద్‌ ఫ్యాన్స్ 
Tirumala News: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
Embed widget