Nine Wives: తొమ్మిది మందితో పెళ్లి, ‘బెడ్ రూమ్’లో పాట్లు - ఈ భర్త కష్టాలు తెలిస్తే నవ్వేస్తారు!

ఆ దేశంలో బాహుభార్యత్వ చట్టాలను ఉల్లంఘించి మరీ 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బెడ్ రూమ్ కష్టాలను ఎదుర్కొంటున్నాడు.

FOLLOW US: 

Nine Wives |క భార్యతో సంసారం చేయడానికే కొందరు భర్తలు.. ఎన్నో కష్టాలు భరిస్తున్నంత బిల్డప్ ఇస్తారు. పాపం, ఇతడు ఒకేసారి తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నాడు. ఒకే భార్యను కలిగి ఉండాలనే తన దేశ చట్టాలను సైతం వ్యతిరేకిస్తూ.. 9 మందిని ఒకేసారి పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని గర్వంగా ప్రకటించాడు. కానీ, పెళ్లి తర్వాత అతడికి అసలు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో ఏ భార్యతో సంసారం చేయాలో తెలియక గందరగోళానికి గురవ్వుతున్నాడు. అందరికీ సమ న్యాయం చేయలేక మదనపడుతున్నాడు. చివరికి తన కష్టాలను మీడియాకు వెల్లడించాడు. 

బ్రెజిల్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో 2021లో తన ఎనిమిది మంది ప్రియురాళ్లను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఉర్సోకు లువానా కజాకి అనే మహిళతో వివాహమైపోయింది. ఆమె తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తుందని అంతా భావించారు. కానీ, ఉర్సో ఆమె అంగీకారంతోనే ఆ పెళ్లిల్లు చేసుకున్నాడు. కానీ, అతడి ఊహించలేని విషయం ఏమిటంటే.. ఆ ఎనిమిది మంది ప్రియురాళ్లు(ఇప్పుడు భార్యలు) ఒకరైన అగాథ అతడి నుంచి విడిపోవాలని కోరుకోవడం. ఇందుకు ఆమె చెప్పిన కారణం ఉర్సోకు అస్సలు నచ్చలేదు. ఆమెకు అంతమంది భార్యల్లో ఒకరిగా జీవించడం సాధ్యం కావడం లేదని, అందుకే విడాకులు తీసుకుంటున్నానని చెప్పింది. భర్త తనపైనే ఎక్కువ ప్రేమించాలని కోరుకుంది. ఆమె నిర్ణయాన్ని మిగతా భార్యలు తప్పుబట్టారు. ఉర్సో చేస్తున్న సాహసంలో ఆమె భాగస్వామి కావాలని భావించిందేగానీ.. అతడిపై ప్రేమతో పెళ్లి చేసుకోలేదని అంటున్నారు. తాము మాత్రం ఉర్సోను వదలమని స్పష్టం చేశారు. 

అయితే, ఉర్సో ప్రస్తుతం తన నుంచి దూరంగా ఉంటున్న ఆ భార్యను ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నాడు. ఇప్పట్లో మరో పెళ్లి చేసుకొనే అవకాశం లేదని అంటున్నాడు. ఎందుకంటే.. ఇప్పటికే ఉన్న భార్యలను సుఖ పెట్టడం, మచ్చిక చేసుకోవడం, వారికి నచ్చే విధంగా నడుచుకోవడం ఉర్సోకు కష్టంగా మారిందట. ముఖ్యంగా పడక గదిలో ఎవరితో సెక్స్ చేయాలో తెలియక తికమక పడుతున్నాడట. ఈ విషయాన్న ఉర్సోనే స్వయంగా వివరించాడు. చాలామంది తనకు 9 మంది భార్యలున్నారని, ఎవరితోపడితే వారితో సుఖపడొచ్చని భావిస్తారని, అందుకే తన కష్టాలను బయటకు చెప్పాలనుకుంటున్నా అని అతడు ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు.

బ్రెజిల్‌లో బహుభార్యత్వం చట్టవిరుద్ధం. దీంతో అతడు చేసుకున్న పెళ్లిల్లకు చట్టబద్ధత లభించలేదు. అంటే, అతడు ఇప్పటికీ చట్ట వ్యతిరేకంగా 9 మంది భార్యలతో సంసారం చేస్తున్నట్లే. ‘‘మా లైంగిక జీవితం నిజంగా ఆహ్లాదకరంగా ఉంది. మొదట్లో నేను అపాయింట్‌మెంట్ తీసుకుని సెక్స్ చేసేవాడిని. ఒక టైమ్ టేబుల్ పాటించేవాడిని. కానీ, అదే సమస్యగా మారింది. కొన్నిసార్లు షెడ్యూల్ ప్రకారమే సెక్స్ చేయాల్సి వచ్చేది. కానీ, ఆనందం కోసం కాదు’’ అని తెలిపాడు. 

Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?

‘‘ఒక్కో సందర్భంలో నేను ఒక భార్య గురించి ఆలోచిస్తూ మరొక భార్యతో సెక్స్ చేశాను. అది చాలా చిత్రంగా అనిపించింది. కానీ, ఇప్పుడు టైమ్ టేబుల్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినప్పుడు, మనసు కోరుకున్నప్పుడే సహజమైన సెక్స్‌లో పాల్గొంటున్నాం. తొమ్మిది భార్యలతో సంసారం చేసినప్పుడు అతడు మరో సమస్య కూడా తనకు ఎదురైందని చెప్పాడు. ‘‘నేను వారిలో ఒకరికి ఖరీదైన బహుమతి, మరొకరికి చిన్న లేదా తక్కువ ధర గిఫ్ట్ ఇచ్చినప్పుడు వారిలో అసూయ ఏర్పడింది. వారంతా తన భర్త తమపై శ్రద్ధ చూపాలని, ఆప్యాయంగా ఉండాలని, సెక్స్ చేయాలని కోరుకుంటున్నారు. నేను కూడా అదే కోరుకుంటున్నా. ఒకరి ఎక్కువ మరొకరికి తక్కువ చేయలేను. కానీ, నా భార్యల్లో ఒకరు తనకు మాత్రమే నేను సొంతం కావాలని భావించింది. దీంతో ఆమెను మిగతా భార్యలు తప్పుబట్టారు. అందుకే ఆమె దూరమైంది’’ అని తెలిపాడు. అయినా, తొమ్మిది మంది భార్యలను భరిస్తున్నాడంటే.. అతడు నిజంగానే గ్రేట్ కదూ. 

Also Read: గుండె నొప్పిని మీ కాళ్లు ముందే హెచ్చరిస్తాయి, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Published at : 28 Apr 2022 07:48 PM (IST) Tags: Nine Wives Husband with Nine wives Brazil Husband Brazil Nine wives Intimate with Nine Wives

సంబంధిత కథనాలు

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

Umbrella: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం