అన్వేషించండి

Life Span: 150 ఏళ్ల వరకు బతికేయొచ్చట తెలుసా?

మనిషి ఎంతకాలం బతకొచ్చు. అసలు జీవితకాలం ఎంత ? మహా అయితే 60, 70 అంటారా? కానీ తాజాగా జరిగిన ఓ పరిశోధనలో మనిషి 150 ఏళ్ల వరకు గరిష్ఠంగా బతకొచ్చు అని తేలింది.

60 ఏళ్లు రాగానే వృద్ధాప్యం అనుకుంటాం. మహా అయితే 80 ఏళ్లు బతకొచ్చని భావిస్తాం. జపాన్, బ్రిటన్‌ వంటి దేశాల్లో శతాధిక వృద్ధులున్నా, వారి సంఖ్య మరీ ఎక్కువేం కాదు. దేశకాల పరిస్థితులను బట్టి... ప్రజల సగటు ఆయుష్షు మారిపోతుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్రెంచి మహిళ జీనె కాల్మెంట్‌ 122 సంవత్సరాలు బతికినట్టు చెబుతారు.

1875లో ఆమె జన్మించినప్పుడు మనిషి సగటు జీవితకాలం 43 ఏళ్లు! మరి- ఎన్నో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన "ప్రస్తుత కాలంలో మనిషి గరిష్ఠంగా ఎంతకాలం బతికే అవకాశముంది?" అన్న ప్రశ్న మరోసారి పరిశోధకులను తొలిచింది. ఇంతకుముందు పలు అధ్యయనాలు... మనిషి గరిష్ఠంగా 140 సంవత్సరాలు బతికే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే సింగపూర్, రష్యా, అమెరికాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు తాజాగా మరో అధ్యయనం చేపట్టారు. 19వ శతాబ్దం నాటి 'గోంపెట్జ్‌ ఈక్వేషన్‌' ఆధారంగా లెక్కలు వేశారు. మనిషి గరిష్ఠంగా 150 సంవత్సరాలు బతికే అవకాశముందని నిర్ధారణకు వచ్చారు! మనం ఇప్పుడు అనుకుంటున్న 70-80 ఏళ్లు... అందులో దాదాపు సగమేనన్న మాట. అంతేకాదు. కంప్యూటర్‌ మోడల్‌ సహాయంతో వయసు, అవయవాల క్షీణత, ఏ వయసులో పనిచేయడం నిలిపివేస్తారు... తదితర అంశాల ఆధారంగా మరో లెక్క కూడా వేశారు. అందులో కూడా మనిషి 150 ఏళ్లు బతికే అవకాశముందని తేల్చారు.

[quote author=పరిశోధకులు]శరీరం తన ధర్మాన్ని నిర్వర్తించే    సామర్థ్యాన్ని క్రమంగా క్షీణించే దశను వృద్ధాప్యంగా పేర్కొంటాం. ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తున్నప్పుడు శరీరం సమస్థితి (హోమియోస్టాసిస్‌) కోల్పోతుంది. ఫలితంగా వ్యాధుల నుంచి కోలుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. చివరికి మరణం గుప్పిట్లో దేహం చేరిపోతుంది. ఒకవేళ ఈ సమస్థితిని స్థిరంగా ఉంచుకుని, వ్యాధుల నుంచి కోలుకునే సామర్థ్యం తగ్గకుండా చూసుకుంటే... మనిషి భేషుగ్గా 150 ఏళ్లు జీవించే అవకాశముంది.                                  

ఈ పరిశోధనలో భాగంగా మొత్తం 70 వేల మంది రక్తనమూనాలను పరీక్షించారు.

మీరూ బతికేయొచ్చు..

దీర్ఘకాలం జీవించాలనుకునే వారికి పరిశోధకులు మూడు కీలక సూచనలు చేశారు. ‘‘దీర్ఘాయుష్మంతులు కావాలనుకునే వారికి మొదట ఉండాల్సినవి... మంచి జన్యువులు. వందేళ్ల మార్కును అందుకోవడానికి ఇవెంతో కీలకం. రెండోది... అద్భుతమైన ఆహార-వ్యాయామ ప్రణాళిక. దీన్ని పాటిస్తే జీవితకాలం మరో 15 ఏళ్లు పెరుగుతుంది. ఇక మూడోది- మంచి చికిత్సలు, ఔషధాలు. ఇవి నాణ్యమైన జీవితకాలం మరింత కొనసాగేలా చేస్తాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రైటన్‌కు చెందిన పరిశోధనకర్త రిచర్డ్‌ ఫరాఘెర్‌ చెప్పారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget