News
News
వీడియోలు ఆటలు
X

Pollution: ఆస్తమా ఉన్న పిల్లలను బాణాసంచా కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవాలి?

దీపావళి వచ్చిందంటే కొంతమంది భయపడిపోతారు. కారణం వారికున్న ఆస్తమా వ్యాధి. ముఖ్యంగా ఆస్తమా ఉన్న పిల్లలు ఇబ్బంది పడతారు.

FOLLOW US: 
Share:

దీపావళి వస్తే పిల్లలకు పండగే, ఎందుకంటే బాణాసంచా కాల్చుకోవచ్చు, స్వీట్లు తినవచ్చు. కానీ ఆస్తమా ఉన్న పిల్లలకు మాత్రం దీపావళి వస్తే నరకమే. రసాయనాల పొగకు ఊపిరాడక ఇబ్బంది పడతారు. ఈ సమయంలో తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దీపావళినాకు కాల్చే బాణాసంచా పొగ చాలా ప్రమాదకరమైనది.  సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) తాజా నివేదిక ప్రకారం ఢిల్లీ-NCRలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉందని, ఆరోగ్యానికి హానికరమైనదని చెప్పారు.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గరిష్టంగా 249కి చేరుకున్నట్టు తెలిపారు. ఇక ఆ గాలిలో బాణాసంచా పొగ కలిస్తే ఎంతో మందికి శ్వాస అందక ఇబ్బందులు పాలవుతారు. 

ఆస్తమా పిల్లలు
కేవలం ఢిల్లీలోనే కాదు చాలా పట్టణాల్లో గాలి కలుషితం అవుతోంది. ఇక దీపావళి రోజు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

ఉబ్బసం (ఆస్తమా) అనేది పెద్దలు, పిల్లలు ఇద్దరినీ ప్రభావితం చేసే శ్వాసకోశ పరిస్థితి. ఈ సమస్య ఉన్నవారిలో ఊపిరితిత్తులకు వెళ్లే శ్వాసనాళాలు ఇరుకుగా మారుతాయి. ఉబ్బి, అందులో అదనపు శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. అప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఉబ్బసం అనేది పిల్లలను మరీ ప్రభావితం చేస్తుంది. పొగ, ఇన్ఫెక్షన్ వల్ల ఆస్తమా ఎక్కువైపోతుంది. అప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 

1. దగ్గు తీవ్రంగా మారుతుంది. 
2. శ్వాస ఆడదు.
3. ఛాతీ దగ్గర పట్టేసినట్టు అవుతుంది. 
4. నిద్రపట్టడంలో ఇబ్బంది ఎదురవుతుంది. 
5. శ్వాసకోశ సమస్యలు అధికం అవుతాయి. 
6. అలసట వస్తుంది. 

కాలుష్య ప్రభావం
ఆస్తమా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (AAFA) ప్రకారం, వాయు కాలుష్యం వల్ల ఆస్తమా ఉన్నవారి పరిస్థితి దిగజారుతుంది. ఇలా బాణాసంచా పొగ వల్ల ఆస్తమా వచ్చే శాతం 40 శాతం అధికంగా ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ గాలిలో అధికంగా చేరి పిల్లల ఆస్తమా పెంచేస్తుంది. గాలిలో పొగమంచులా చేరిన ఈ వాయువులు ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలను చికాకుపెడతాయి. ఊపిరితిత్తుల పనితీరును తగ్గిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. 

ఎలా కాపాడుకోవాలి?
మీ బిడ్డకు ఆస్తమా ఉంటే, దీపావళి నాడు వాయు కాలుష్యం నుండి రక్షించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

1. అన్నింటి కన్నా మొదటిది ఆస్తమా ఉన్న పిల్లల్ని బాణాసంచా కాల్చేటప్పుడు బయటికి పంపకండి. 
2. ఒకవేళ బయటికి వస్తానని మారాం చేస్తే మాస్కు పెట్టండి. 
3. వారి ఇన్షేలర్లను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోండి.  
4. ఎక్కువ పొగ వచ్చే బాణాసంచాకు వారిని దూరంగా ఉంచండి. 

Also read: దీపావళికి వంటింట్లో వాడే ఈ వస్తువులు మాత్రం కొనకండి, దురదృష్టం వెంటాడుతుందట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 23 Oct 2022 11:06 AM (IST) Tags: Air pollution Kids Diwali pollution Asthma Attack

సంబంధిత కథనాలు

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!

Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!

Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం