అన్వేషించండి

DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి

DIY Scrub : మెరిసే, స్మూత్ స్కిన్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే మీరు DIY Scrub చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలో.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పండుగలప్పుడు చర్మ కాంతికి ఇంటి చిట్కాలతో స్క్రబ్ తయారుచేయండి.
  • కొబ్బరి పొడి, శనగపిండి, కాఫీ పొడితో సులభంగా స్క్రబ్ చేయవచ్చు.
  • సున్నితంగా అప్లై చేసి, వారానికి ఒకటి రెండుసార్లు వాడటం మంచిది.
  • మృతకణాలను తొలగించి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది, రంగును మార్చదు.

Homemade Face and Body Scrub : పండుగ సమయంలో చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. దీనికోసం ఖరీదైన స్కిన్ కేర్ ఉత్పత్తులు ఉపయోగిస్తుంటారు. అయితే ఇంట్లోనే కొన్ని పదార్థాలతో స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పొడి, శనగపిండి, కాఫీ పొడి వంటి వాటితో ఇంట్లోనే ఈ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. 

మంచి ఫలితాల కోసం చర్మానికి సరిపడే పదార్థాలను ఎంచుకోవడం, సున్నితంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. అయితే ఈ స్క్రబ్ తయారు చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే కొన్ని పదార్థాలు ఉంటే సరిపోతుంది. మరి ఈ స్క్రబ్‌ ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా అప్లై చేయాలో చూసేద్దాం.

Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి

స్క్రబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

ఎండిన కొబ్బరి పొడి - 4 టేబుల్ స్పూన్లు

శనగపిండి - 3 టేబుల్ స్పూన్లు

గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు

కాఫీ పొడి – 1 టేబుల్ స్పూన్

గంధం పొడి - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా కొబ్బరి పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం మిగిలిన పొడులన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన, తేమలేని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. అయితే ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తయారు చేసి ఎక్కువ రోజులు నిల్వ చేయడం కంటే.. అవసరమైనంత తయారు చేసుకోవడం మంచిది.

Also Read : 50ల్లో ముడతలు, డ్రై స్కిన్ తగ్గాలంటే.. డైట్‌లో ఈ చిన్న మార్పులు చేయండి

స్క్రబ్‌ను ఎలా అప్లై చేయాలంటే..

ముందుగా తయారు చేసుకున్న పొడిని కొద్దిగా తీసుకుని శుభ్రమైన గిన్నెలో వేయాలి. అందులో కొద్దిగా నీరు లేదా పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. పాలు లేదా రోజ్ వాటర్ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అవి మీ స్కిన్​కి సరిపోతాయో లేదో చెక్ చేసుకోవాలి. స్క్రబ్ ముఖానికి అప్లై చేసే ముందు కాస్త ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. 

ఓకే అనుకుంటే దీనిని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిని గట్టిగా రుద్దకూడదు. కళ్ల చుట్టూ, పెదవుల దగ్గర అప్లై చేయకూడదు. శరీరానికి ఉపయోగించినా సున్నితంగా మాత్రమే మసాజ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.

Also Read : పండుగల ముందు గ్లోయింగ్ స్కిన్, షైనీ హెయిర్ కావాలా? రైస్ వాటర్ ఇలా ఉపయోగించండి

ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చంటే.. 

స్క్రబ్‌ను తరచుగా ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు వస్తాయనుకోకూడదు. ఎక్కువగా రుద్దడం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబడటం, మంట రావడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు. 

స్క్రబ్​తో కలిగే లాభాలు 

కొబ్బరి పొడిలో ఉండే చిన్న కణాలు చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. శనగపిండి చర్మంపై ఉన్న మురికి, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. గోధుమ పిండి చర్మాన్ని మృదువుగా చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. కాఫీ పొడి కూడా డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి.. చర్మాన్ని మెరిసేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. గంధం చర్మానికి చల్లదనాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది. 

గుర్తించుకోవాల్సిన విషయాలివే

ఇంట్లో తయారు చేసే స్క్రబ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో కొంతవరకు సహాయపడవచ్చు. కానీ ఇది చర్మం రంగును మార్చదు. మొటిమల మచ్చలను పూర్తిగా తొలగించదు. కాబట్టి ఆరోగ్యంగా కనిపించే చర్మం కోసం తగినంత నీరు తాగడం, చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్ ఉపయోగించడం, పగటిపూట సన్‌స్క్రీన్ అప్లై చేయడం వంటి స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాలి.

Also Read : అరటిపండు ఫేస్ మాస్క్.. ఇంట్లోనే మెరిసే, హెల్తీ స్కిన్ కోసం సులభమైన DIY చిట్కాలు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
Embed widget