అన్వేషించండి

Banana Face Mask : అరటిపండు ఫేస్ మాస్క్.. ఇంట్లోనే మెరిసే, హెల్తీ స్కిన్ కోసం సులభమైన DIY చిట్కాలు

DIY Banana Face Mask : వీకెండ్​లో గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే.. మెరిసే, హెల్తీ స్కిన్ కోసం చూస్తుంటే అరటిపండుతో ఫేస్ మాస్క్ వేసుకోండి. దీనిని ఎలా చేసుకోవాలో.. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అరటిపండు మాస్క్ చర్మానికి సహజ పోషణనిచ్చి, కాంతివంతంగా చేస్తుంది.
  • పండిన అరటి, తేనె, నిమ్మరసంతో మాస్క్, చర్మానికి అనుగుణంగా మార్పులు.
  • 15 నిమిషాలు ఉంచి, ప్యాచ్ టెస్ట్, మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి.
  • ఈ మాస్క్ చర్మ కాంతిని పెంచి, యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

Banana Face Mask for Glowing Skin : అరటిపండు ఫేస్ మాస్క్ చర్మానికి సహజంగా పోషణనిచ్చి, కాంతివంతంగా చేస్తుంది. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ ఫేస్ మాస్క్.. చర్మాన్ని మృదువుగా, తాజాగా, యవ్వనంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. అయితే దీనిని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. పైగా ఈ మాస్క్ అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉంటుంది.

అరటిపండుతో చర్మానికి కలిగే లాభాలు

అరటిపండ్లు స్కిన్ హెల్త్​కి చాలా మంచివి. వీటిలో విటమిన్ A, B, C, E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తిన్నా.. నేరుగా ముఖానికి అప్లై చేసినా మంచి ఫలితాలు చూడవచ్చు. అరటిపండును మాస్క్​గా చర్మానికి అప్లై చేస్తే ఇది స్కిన్​ను కాంతివంతం చేస్తుంది. నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ముఖానికి హైడ్రేషన్​ను అందిస్తుంది. కాబట్టి అన్ని రకాల చర్మాలకు మంచి ఫలితాలు ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది.

Also Read : కళ్ల కింద నెయ్యి రాస్తే బ్లాక్ సర్కిల్స్ తగ్గుతాయా? ప్రతిరోజూ రాత్రి అప్లై చేస్తే కలిగే లాభాలివే

బనానా ఫేస్ మాస్క్ 

బనానా ఫేస్ మాస్క్​ కోసం మీరు పండిన అరటిపండ్లు తీసుకోవాలి. అరటిపండును బాగా చిదిమి.. దానిలో తేనె, నిమ్మరసం వేసి మాస్క్ తయారు చేసుకోవచ్చు. దీనిని పావుగంట ఉంచండి. మీకు జిడ్డు చర్మం ఉంటే.. శనగపిండిని కూడా కలిపి అప్లై చేయవచ్చు. పొడి చర్మం ఉన్నవారు పెరుగు వేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉంటే రోజ్ వాటర్ కలిపి అప్లై చేయవచ్చు. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బనానా ఫేస్ మాస్క్ సహజమైనదే అయినప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తప్పకుండా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 20 నిమిషాల కంటే ఎక్కువసేపు ముఖానికి ఉంచుకోవద్దు. వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేయవచ్చు. అయితే ప్యాక్ కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ కచ్చితంగా అప్లై చేయాలి.

Also Read : ఎండలో తిరిగి ట్యాన్ అయ్యారా? ఈ ఇంటి చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లతో చర్మానికి మళ్లీ మెరుపు తీసుకురండి

బనానా మాస్క్​తో లాభాలు

అరటిపండు మాస్క్ యవ్వనమైన చర్మం కోసం కొల్లాజెన్‌ను పెంచుతుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. సహజమైన నూనెలు మృదువైన, మెరిసే రూపం కోసం తేమను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మపు రంగు సమంగా మారే అవకాశం ఉంది. కాబట్టి స్కిన్ కేర్ రోటీన్లో దీనిని ఉపయోగించవచ్చు.

Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Healthy Skin Diet : ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
ముఖంలో గ్లో రావాలా? సహజమైన మెరుపు కోసం ఈ 5 కూరగాయలు తినండి
Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు
Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget