అన్వేషించండి

Rice Water for Skin and Hair : పండుగల ముందు గ్లోయింగ్ స్కిన్, షైనీ హెయిర్ కావాలా? రైస్ వాటర్ ఇలా ఉపయోగించండి

Rice Water for Glowing Skin and Shiny Hair : పండుగల సమయంలో అలంకరణతో పాటు స్కిన్, హెయిర్ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీరు రైస్ వాటర్ని ఇలా ఉపయోగించండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బియ్యం కడిగిన నీరు చర్మం, జుట్టు సంరక్షణకు మంచిది.
  • జుట్టుకు షాంపూ తర్వాత, చర్మానికి నేరుగా వాడాలి.
  • తాజా నీటిని వాడాలి; అలెర్జీ వస్తే వాడకం ఆపాలి.
  • ఇది చిన్న చిట్కా మాత్రమే; సరైన జీవనశైలి ముఖ్యం.

Glowing Skin and Glossy Hair for Festivals : పండుగలు వచ్చాయంటే కొత్త బట్టలు, ఆభరణాలతో పాటు ముఖం కాంతివంతంగా కనిపించాలని.. జుట్టు మెరుస్తూ ఉండాలని చాలామంది కోరుకుంటారు. దీనికోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వాడుతారు. అలాగే గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లో దొరికే పదార్థాలతో కూడా సహజమైన చిట్కాలను కూడా ప్రయత్నిస్తారు. అలాంటి వాటిలో రైస్ వాటర్ కూడా ఒకటి.

బ్యూటీ రొటీన్‌లో రైస్ వాటర్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. ఇది చర్మానికి హైడ్రేషన్ అందించడంతో పాటు జుట్టు స్మూత్‌గా, షైనీగా కనిపించడానికి కొంతవరకు సహాయపడుతుంది. మరి పండుగల ముందు దీన్ని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో చూసేద్దాం. 

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

జుట్టుకు రైస్ వాటర్

బియ్యాన్ని కొద్దిసేపు నీటిలో నానబెట్టిన తర్వాత వచ్చే నీటిని తీసుకుని జుట్టుకు ఉపయోగించవచ్చు. షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు ఈ నీటిని అప్లై చేసి కొద్దిసేపు ఉంచి.. ఆ తర్వాత సాధారణ నీటితో బాగా కడగాలి. బియ్యంలో ఉండే స్టార్చ్ జుట్టు వెంట్రుకలపై తేలికపాటి పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు స్మూత్‌గా, సాఫ్ట్‌గా, కొంత మెరుపుతో కనిపించవచ్చు. చిక్కులు కూడా సులభంగా విడిపోతాయి. 
అయితే రైస్ వాటర్ వాడటం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందని లేదా హెయిర్ ఫాల్ పూర్తిగా ఆగిపోతుందని చెప్పే సరైన ఆధారాలు లేవు.

చర్మానికి ఎలా వాడాలంటే..

రైస్ వాటర్‌ను కొందరు చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కొంతవరకు హైడ్రేట్ చేసి సాఫ్ట్‌గా అనిపించేలా చేయవచ్చు. బియ్యం నుంచి లభించే కొన్ని పదార్థాలు చర్మంలోని తేమను, చర్మ రక్షణ పొరను కాపాడటంలో ఉపయోగపడవచ్చని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి. 

Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి

బియ్యం నుంచి తయారుచేసిన ప్రత్యేకమైన సెరమైడ్ ఉత్పత్తులపై జరిగిన పరిశోధనలను ఇంట్లో తయారుచేసుకునే సాధారణ రైస్ వాటర్‌తో కంపేర్ చేయలేము కాబట్టి.. రైస్ వాటర్‌తో డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ పూర్తిగా పోతాయని లేదా కొద్ది రోజుల్లోనే గ్లాస్ స్కిన్ వస్తుందని చెప్పలేము.

పండుగల ముందు ఇలా ట్రై చేయండి..

పండుగకు కొన్ని రోజుల ముందు మీ బ్యూటీ రొటీన్‌లో రైస్ వాటర్‌ను ఒక అదనపు స్టెప్‌గా ప్రయత్నించవచ్చు. అయితే కొత్తగా ఏదైనా చర్మంపై ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. జుట్టుకు ఉపయోగించాలనుకుంటే తాజాగా తయారుచేసుకున్న రైస్ వాటర్‌ను ఉపయోగించండి. ఎందుకంటే ఎక్కువసేపు పులియబెట్టి, సరిగ్గా నిల్వ చేయని రైస్ వాటర్‌లో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

రైస్ వాటర్ ఉపయోగించిన తర్వాత చర్మం లేదా తలపై దురద, ఎర్రబడటం, వాపు, మంట లేదా పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉపయోగించడం ఆపేయాలి. సెన్సిటివ్ స్కిన్ లేదా సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

గ్లో కోసం ఇలా చేయండి..

పండుగ రోజున ముఖం, జుట్టు అందంగా కనిపించడానికి రైస్ వాటర్‌ను ఉపయోగించడం మంచిదే కానీ.. పూర్తిగా దానిపై ఆధారపడకూడదు. దానిని ఒక చిన్న బ్యూటీ రొటీన్‌గా మాత్రమే చూడాలి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్యమైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర, సరైన స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోవడం కూడా ముఖ్యమే.

Also Read : యవ్వనంగా, మెరిసే చర్మం కోసం తినాల్సిన ఫుడ్స్ ఇవే.. స్కిన్​ కలర్ కూడా బ్రైట్ అవుతుందట

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget