Flaxseed Gel : గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి
Flaxseed Gel for Dry Skin : మెరిసే, మృదువైన చర్మం కోసం ఇంట్లోనే అవిసె గింజలతో జెల్ తయారు చేసుకోండి. దీనిని తయారు చేయడం, అప్లై చేయడం కూడా సులభమే. DIY రెసిపీ ఇదే.

- వయసుతో తగ్గే చర్మ తేమకు అవిసెగింజల జెల్ పరిష్కారం.
- అవిసెగింజలను నీటిలో మరిగించి, వడగట్టి చిక్కని జెల్ తయారుచేయాలి.
- అలోవెరా, విటమిన్ E కలిపి రాత్రిపూట ముఖానికి సున్నితంగా పట్టించాలి.
- ఫ్రిజ్‌లో నిల్వ చేసి, వాడే ముందు చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయాలి.
DIY Flaxseed Gel for Glowing Skin : వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో సహజమైన తేమ తగ్గడం, పొడిబారడం, ఫైన్ లైన్స్ కనిపించడం, చర్మం మునుపటిలా బిగుతుగా లేకపోవడం జరుగుతుంది. అందుకే చాలామంది ఖరీదైన క్రీములు, సీరమ్స్ వాడుతుంటారు. అయితే చర్మానికి కొద్దిగా అదనపు హైడ్రేషన్ అందించేందుకు ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే కొన్ని DIY ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఫ్లాక్స్‌సీడ్ జెల్ కూడా ఒకటి. దీనిని అవిసెగింజలతో చేస్తారు.
అవిసె గింజల జెల్
అవిసె గింజలను నీటిలో మరిగిస్తే సహజంగా జెల్‌లా మారుతుంది. ఇది తేలికపాటి, జారుగా ఉండే టెక్స్చర్‌తో చర్మంపై అప్లై చేయడానికి సులభంగా మారుతంది. ఇందులో అలోవెరా జెల్ వంటి పదార్థాలను కూడా కలిపి ఉపయోగించవచ్చు. అయితే ఇది కొల్లాజెన్‌కు ప్రత్యామ్నాయం కాదు. చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా, సాఫ్ట్‌గా అనిపించేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది.
Also Read : అవిసె గింజలు జెల్ తలకు అప్లై చేస్తే కలిగే లాభాలు ఇవే.. ఇలా తయారు చేసి, అలా అప్లై చేసేయండి
ఫ్లాక్స్‌సీడ్ జెల్ తయారీ..
అవిసె గింజలు – 2 టేబుల్ స్పూన్లు
నీరు – 1 కప్పు
అలోవెరా జెల్ – 1 టేబుల్ స్పూన్
విటమిన్ E క్యాప్సూల్ – 1
ఆల్మండ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ముందుగా అవిసె గింజలను నీటిలో వేసి మరిగించాలి. దానిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి నీరు చిక్కగా మారి జారుగా, జెల్‌లా కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. వేడిగా ఉన్నప్పుడే జెల్‌ను వడకట్టాలి. ఇలా చేస్తే గింజల నుంచి జెల్‌ను వేరు చేయడం సులభమవుతుంది. వడకట్టిన జెల్‌ను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దానిలో అలోవెరా, విటమిన్ E వేసి బాగా కలపండి. అవసరమైతే బాదం నూనె లేదా కొబ్బరి నూనె వేసుకోవచ్చు. అయితే ఆయిలీ లేదా పింపుల్స్ ఉన్నవారు నూనె వేసుకోకపోవడమే మంచిది.
Also Read : అవిసె గింజలు, బియ్యం, కలబందతో హెయిర్ మాస్క్.. నేచురల్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ కోసం ట్రై చేయండి
ఫ్రిజ్‌లో ఎలా స్టోర్ చేయాలి?
ఇలా తయారు చేసుకున్న జెల్‌ను శుభ్రమైన, గాలి చొరబడని కంటైనర్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది ప్రిజర్వేటివ్స్ లేని స్కిన్‌కేర్ కాబట్టి.. ఎక్కువ తయారు చేసి ఎక్కువ రోజులు నిల్వ చేయకండి. వాసన, రంగు లేదా టెక్స్చర్‌లో మార్పు కనిపిస్తే వెంటనే పారేయాలి.
ఎప్పుడు అప్లై చేయాలంటే..
రాత్రి ముఖాన్ని మైల్డ్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని మెత్తగా తుడుచుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్లాక్స్‌సీడ్ జెల్ తీసుకుని ముఖం, మెడపై పలుచగా అప్లై చేయాలి. గట్టిగా రుద్దకుండా సున్నితంగా అప్లై చేయడం మంచిది. చర్మానికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే ముఖాన్ని కడుక్కోవచ్చు.
Also Read : మెంతులు, అవిసె గింజలు, బియ్యంతో హెయిర్ ప్యాక్.. జుట్టు బలంగా, పొడవుగా పెరగడానికి ట్రై చేసేయండి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జెల్ నేచురల్ కదా.. ఏమీ కాదు అనుకోకూడదు. ఇంట్లో తయారు చేసిన పదార్థాలు కూడా కొందరికి అలర్జీ లేదా ఇరిటేషన్ కలిగించవచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ వేసుకోండి. అలాగే చర్మం ఇప్పటికే దెబ్బతిని ఉంటే.. ఇరిటేషన్ ఉన్నా లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ జెల్‌ను అప్లై చేయకపోవడమే మంచిది.
Also Read : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























