షుగర్ ఉన్నవారు రోజూ అవిసె గింజలు తింటే చాలా మంచిదట అవిసె గింజలను ఎక్కువగా బ్యూటీ కోసం ఉపయోగిస్తారు. జుట్టు పెరుగుదల, స్కిన్ హెల్త్‌కోసం వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. అయితే అవిసె గింజలను డైట్లో కూడా తీసుకోవాలంటున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, థియామైన్, న్యూట్రిషనల్ వాల్యూ నిండి ఉంటాయి. అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. రెగ్యూలర్‌గా తీసుకుంటే క్యాన్సర్ కారక కణాలను దూరం చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్‌తో ఇబ్బంది పడేవారు దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే చాలా మంచిది. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)