కొందరు వివిధ కారణాలతో తడిజుట్టుతో నిద్రపోతూ ఉంటారు. ఆఫీస్ నుంచి లేట్‌గా వచ్చి ఫ్రెష్ అవ్వడమో.. వర్షం వల్లనో జుట్టు తడిగా ఉంటుంది. జుట్టును ఆరబెట్టే సమయం లేక.. లేదా నీరసంతో అలానే పడుకునిపోతారు. ఇలా జుట్టును ఆరబెట్టుకోకుండా పడుకోవచ్చా? పడుకుంటే ఏమవుతుంది? కచ్చితంగా హెయిర్‌ని డ్రై చేసి నిద్రపోవాలంటున్నారు. లేదంటే పలు సమస్యలు వస్తాయట. తడి జుట్టుతో పడుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. చుండ్రు, ఈస్ట్ వంటి ఫంగల్ సమస్యలు పెరుగుతాయి. వీటివల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలిపోవడమే కాకుండా తెగిపోతూ ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. స్కాల్ప్‌పై తడి ఉండడం వల్ల జలుబు చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)