Morning Skincare Routine : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Skincare Routine : రోజంతా మీ స్కిన్ అందంగా, మెరుస్తూ కనిపించాలంటే ఉదయాన్నే స్కిన్ కేర్ రొటీన్ సెట్ చేసుకోవాల్సి ఉంది. మరి దీనిని ఎలా సెట్ చేసుకుంటే మంచి గ్లో పొందవచ్చో చూసేద్దాం.

- ఉదయం తేలికపాటి క్లెన్సర్, టోనర్‌తో ముఖం శుభ్రం చేయండి.
- విటమిన్ సి సీరమ్, ఐ క్రీమ్, మాయిశ్చరైజర్ తప్పకుండా అప్లై చేయండి.
- సూర్యరశ్మి నుంచి రక్షణకు కనీసం SPF 30 సన్ స్క్రీన్ వాడండి.
- తగిన నీరు త్రాగి, సమతుల్య ఆహారం, వ్యాయామం పాటించండి.
Tips For Healthy And Glowing Skin All Day : నిద్రలేవగానే ప్రతి ఒక్కరూ తాజాగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించే స్కిన్ కావాలని కోరుకుంటారు. మీరు ఈ మెరిసే స్కిన్ పొందాలనుకుంటే.. దానికి కచ్చితంగా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి అంటున్నారు బ్యూటీ నిపుణులు. ఉదయాన్నే మీరు చర్మానికి మొదటగా వాడే ప్రొడెక్ట్.. రోజంతా మీ చర్మ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందని అంటున్నారు. సరైన దినచర్య మాత్రమే చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుందని చెప్తున్నారు.
మొటిమలు, ముడతలు, నిస్తేజం వంటి సమస్యల నుంచి చర్మాన్ని రక్షించడానికి ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలో.. మచ్చలేని, సహజంగా కాంతివంతమైన చర్మం కోసం ఏమి చేస్తే మంచిదో ఇప్పడు చూసేద్దాం.
Also Read : 50ల్లో ముడతలు, డ్రై స్కిన్ తగ్గాలంటే.. డైట్‌లో ఈ చిన్న మార్పులు చేయండి
క్లెన్సర్ క్లీనింగ్..
నిద్రలేవగానే మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగండి. రాత్రంతా పేరుకుపోయిన మురికిని, అధిక నూనెను తొలగించడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మీ చర్మ రకాన్ని బట్టి తేలికపాటి ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌ను ఉపయోగించండి. కెమికల్స్ నిండిన ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి చర్మాన్ని పొడిబారేలా చేసి చికాకును పెంచుతాయి.
టోనర్
ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. మీరు రోజ్ వాటర్‌ను సహజమైన టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. అలాగే స్కిన్ హైడ్రేటెడ్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. ముఖాన్ని తాజాగా కూడా ఉంచుతుంది.
Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి
సీరమ్‌తో పోషణ
టోనర్ తర్వాత.. మీ ముఖానికి సీరమ్ అప్లై చేయండి. ఉదయం పూట విటమిన్ సి సీరమ్ అప్లై చేస్తే మంచిదని చెప్తారు. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే నల్ల మచ్చలను తగ్గిస్తుంది. సహజమైన మెరుపును పెంచడంలో సహాయపడుతుంది.
కళ్ల కోసం ఐ క్రీమ్
కళ్ల కింద నల్లటి వలయాలు లేదా ఉబ్బు ఉంటే.. మీరు తప్పకుండా ఐ క్రీమ్ అప్లై చేయండి. క్రీమ్‌ను చర్మంపై సున్నితంగా అప్లై చేస్తే అది కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతం తాజాగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మాయిశ్చరైజర్
సీరమ్ తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. ఇది చర్మంలో తేమను నిలుపుతుంది. రోజంతా చర్మాన్ని మృదువుగా, నునుపుగా ఉంచుతుంది. జిడ్డు చర్మానికి జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను.. పొడి చర్మానికి క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి.
సన్‌స్క్రీన్ ఇంపార్టెంట్..
ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది మీ చర్మాన్ని సూర్యుని హానికరమైన UV కిరణాల నుంచి కాపాడుతుంది. చర్మం నల్లబడటం, మచ్చలు, ముడతలను నివారిస్తుంది. కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడండి.
Also Read : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
రోజూ ఉదయాన్నే మీరు కాలేజ్ లేదా ఆఫీస్ లేదా ఇతర ఏ కారణంతో అయినా బయటకు వెళ్లేముందు మీరు ఈ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం మంచిది. అలాగే రోజంతా హైడ్రేట్ అయ్యేందుకు నీటనిని తాగాలి. డీప్ ఫ్రైడ్, స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉంటూ కూరగాయలు, ఫ్రూట్స్, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకుంటే మీ స్కిన్‌లో కచ్చితంగా మంచి మార్పులు చూస్తారు. అలాగే వ్యాయామం కూడా మీ చర్మం యంగ్‌గా కనిపించడంలో హెల్ప్ చేస్తుంది.
Also Read : జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
ట్రెండింగ్ వార్తలు























