అన్వేషించండి

Sara Tendulkar Skincare Routine : సారా టెండూల్కర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ ఇవే.. సింపుల్ రొటీన్‌తో గ్లాస్ స్కిన్

Sara Tendulkar Skin Care Tips : సారా టెండూల్కర్ తన స్కిన్ కేర్ రొటీన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. PCOS ఉన్న కూడా హెల్తీ, బ్యూటీ స్కిన్ కోసం ఏమి ఫాలో అవ్వాలో తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సారా టెండూల్కర్ సున్నితమైన చర్మం కోసం సరళమైన సంరక్షణ పాటిస్తుంది.
  • క్లెన్సర్, మాయిశ్చరైజర్, SPFతో చర్మాన్ని హైడ్రేట్, రక్షిస్తుంది.
  • PCOS కారణంగా మొటిమలు, జిడ్డు చర్మ సమస్యలు ఎదుర్కొంది.
  • ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర, నీరు చర్మ ఆరోగ్యానికి కీలకం.

Sara Tendulkar Skincare Secrets : ఈరోజుల్లో స్కిన్ కేర్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ పెరుగుతుంది. సోషల్ మీడియా కారణంగా.. K-బ్యూటీ ట్రెండ్ అయినా 'గ్లాస్ స్కిన్' వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఆ లుక్ కోసం వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. దాదాపు 8 నుంచి 15 దశల స్కిన్ కేర్ రొటీన్ కామన్ అయిపోయింది. అయితే ఈ ట్రెండ్స్ వదిలి.. చాలా సింపుల్ రొటీన్​తో వారి చర్మాన్ని చూసుకునే వారు కూడా ఉన్నారు. అలాంటివారిలో సారా టెండూల్కర్ కూడా ఒకరు.

ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన స్కిన్ కేర్ రొటీన్, మెరిసే చర్మం వెనుక రహస్యాన్ని పంచుకుంది. ఆమె తన చర్మం సున్నితంగా ఉంటుందని.. ఈజీగా మొటిమలు వచ్చేస్తాయని అందుకే ఏదైనా ప్రొడెక్ట్ వాడేముందు చాలా ఆలోచిస్తానంటూ.. తన స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పుకొచ్చింది. 

సార్ స్కిన్ కేర్ రొటీన్.. వెరీ సింపుల్

ఎక్కువ ఉత్పత్తులను ఉపయోగించకుండా.. ప్రాథమిక చర్మ సంరక్షణపై దృష్టి పెడతానని సారా చెప్పారు. తనది సెన్సిటివ్ స్కిన్ అని.. దీనికోసం క్లెన్సర్, తేలికపాటి మాయిశ్చరైజర్, చర్మానికి హాని కలిగించకుండా సమతుల్యం చేసే పదార్థాలను ఎంచుకుంటానని తెలిపింది. చర్మాన్ని హైడ్రేట్​గా ఉంచుకోవడంతో పాటు.. సూర్య కిరణాల నుంచి రక్షించుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతానని వెల్లడించింది. ఉదయాన్నే చర్మాన్ని రక్షించే ప్రొడెక్ట్స్ ఉపయోగిస్తుందట. అలాగే రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఆమె దినచర్యలో ముఖ్యమైన భాగంగా తెలిపింది.

మొదట్లో ఎక్కువ ప్రొడెక్ట్స్ ఉపయోగించడం వల్ల త్వరగా ఫలితాలు వస్తాయని భావించానని.. కానీ కాలక్రమేణా 'స్కిన్ టైప్'ను అర్థం చేసుకోవడం, దానిని రక్షించడం చాలా ముఖ్యమని గుర్తించినట్లు తెలిపింది. ఆమె అభిప్రాయం ప్రకారం.. కొత్త ఉత్పత్తులను పదేపదే ప్రయత్నించడానికి బదులుగా.. సాధారణ, స్థిరమైన రొటీన్ మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.

PCOS వల్లే ఇది సాధ్యమైంది..

సారా టెండూల్కర్ తనకు PCOS సమస్య ఉందని కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. దీని కారణంగా మొటిమలు, జిడ్డుగల చర్మం వంటి సమస్యలను ఎదుర్కొన్నానని కూడా తెలిపింది. ఈ అనుభవం చర్మ ఆరోగ్యానికి, అంతర్గత ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉందని ఆమెకు అర్థమయ్యేలా చేసిందని వెల్లడించింది. అలాగే తన ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానని పేర్కొంది. ప్రాసెస్ చేసిన, నూనె, అధిక చక్కెర కలిగిన ఆహారానికి దూరంగా ఉంటుందట ఈ బ్యూటీ.

ఇవేకాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్, మంచి నిద్ర, హైడ్రేషన్ కూడా స్కిన్​ కేర్​కు చాలా అవసరమని తెలిపింది. సరైన ఆహారం, తగినంత నీరు తీసుకుంటే.. ఆ ఫలితాలు చర్మంపై స్పష్టంగా కనిపిస్తాయన్నది. అంతేకాకుండా త్వరగా ఫలితాలు పొందాలనే కోరికతో ట్రెండ్స్ వెనుక పరుగెత్తడానికి బదులుగా.. వైద్యుడి సలహా తీసుకోవాలని సారా సూచించింది. ముఖ్యంగా తనలాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు.. సైన్స్ ఆధారిత, క్లినికల్​గా పరీక్షించిన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది సారా. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget