అన్వేషించండి

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే

Happiest Countries in the World : ప్రపంచంలో ఏ దేశ ప్రజలు ఎక్కువ సంతోషంగా ఉన్నారో.. ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసా? తాజాగా వచ్చిన రిపోర్ట్​లో ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. అదేంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫిన్లాండ్ మళ్లీ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది.
  • ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా టాప్ 5లో చోటు సంపాదించాయి.
  • భారతదేశం 116వ స్థానంలో, పాకిస్తాన్ 104వ స్థానంలో నిలిచింది.
  • కుటుంబం, వ్యాయామం, ప్రకృతితో సమయం సంతోషాన్ని పెంచుతాయి.

World Happiness Rankings : ప్రపంచంలో ఎవరు ఎక్కువ సంతోషంగా జీవిస్తున్నారు? డబ్బు, అభివృద్ధి, టెక్నాలజీ అన్నీ ఉన్నా.. నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ.. ప్రతి సంవత్సరం World Happiness Report విడుదల చేస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశాలు సంతోషంగా ఉన్నాయో చెప్తూ ఈసారి కూడా ప్రపంచ దేశాల సంతోష స్థాయిలను అంచనా వేసి ర్యాంకులు ప్రకటించారు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? భారత్ ఏ స్థానంలో ఉంది? 

ఆ దేశానిదే మళ్లీ ఫస్ట్ ర్యాంక్

ఈ సంవత్సరం కూడా ఫిన్లాండ్ ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. 10లో 7.764 రేటింగ్ సాధించింది. సామాజిక భద్రత, అవినీతి లేకపోవడం, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవన నాణ్యత అనేది ఇక్కడి ప్రజల సంతోషానికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. 

సంతోషంగా ఉన్న టాప్ దేశాలు

ఫిన్లాండ్ తర్వాత.. ఐస్లాండ్ 2వ స్థానంలో, డెన్మార్క్ 3వ స్థానంలో, కోస్టారికా 4వ స్థానంలో ఉన్నాయి. ఇవే కాకుండా స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్ కూడా సంతోషంగా ఉన్న టాప్ దేశాల్లో ఉన్నాయి. టాప్ 10లో యూరోపియన్ దేశాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అలాగే టాప్ 10 కంట్రీస్లో ప్రధాన ఆంగ్ల భాషా దేశం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అమెరికా 23వ స్థానంలో.. యూకే 29వ స్థానంలో, కెనడా 25వ స్థానంలో, ఆస్ట్రేలియా 15వ స్థానంలో ఉన్నాయి. 

ఇండియా ఏ స్థానంలో ఉందంటే.. 

ప్రపంచ సంతోష సూచికలో భారతదేశం 116వ స్థానంలో నిలిచింది. ఇది చాలా తక్కువ ర్యాంక్ అయినప్పటికీ.. ఓ మంచి విషయం కూడా ఉందని అంటున్నారు. అదేంటంటే.. 2024లో ఈ ర్యాంక్ 126వ ఉండగా.. 2025లో 118వ స్థానంలో ఉంది. అలా చూసుకుంటే ర్యాంక్ కాస్త మెరుగైనట్లే కనపిస్తుందని చెప్తున్నారు. నివేదికల ప్రకారం వృద్ధుల్లో జీవిత సంతృప్తి పెరగడం, కుటుంబ బంధాలు బలంగా మారడమే ఇండియా స్కోర్ మెరుగవడానికి కారణం. 

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్.. 

World Happiness Report ప్రకారం ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. ఇండియా కంటే ముందుగా 104వ స్థానంలో ఉంది. 

సంతోషంగా ఉండేందుకు చిట్కాలివే.. 

దేశం ఏ స్థానం లో ఉన్నా.. వ్యక్తిగతంగా సంతోషంగా ఉండడం మన చేతుల్లోనే ఉంది. మరి సంతోషంగా ఉండేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో.. నిపుణులు ఇస్తోన్న చిట్కాలు ఏంటో చూసేద్దాం. 

  • కుటుంబం, స్నేహితులతో గడపడం వల్ల సంతోషం పెరుగుతుంది. కాబట్టి మీకు నచ్చిన రిలేషన్​ని దూరం చేసుకోకండి.
  • రెగ్యులర్​గా వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల కూడా మూడ్ మెరుగవుతుంది.
  • చిన్న విషయాల్లో ఆనందం వెతుక్కోండి. చిన్న సక్సెస్​ని కూడా సెలబ్రేట్ చేసుకోండి.
  • ఇతరులతో పోల్చుకోవడం మానితే సగం సంతోషంగా ఉంటారని గుర్తించుకోవాలి.
  • ఏమి లేదని బాధపడే బదులు.. ఉన్నవాటి గురించి సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి.
  • ప్రకృతితో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

వీటిని రెగ్యులర్​గా ఫాలో అయితే వ్యక్తిగతంగా సంతోషంగా ఉండేదుకు ఇవి హెల్ప్ అవుతాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget