అన్వేషించండి

Ghee for Dark Circles : కళ్ల కింద నెయ్యి రాస్తే బ్లాక్ సర్కిల్స్ తగ్గుతాయా? ప్రతిరోజూ రాత్రి అప్లై చేస్తే కలిగే లాభాలివే

Applying Ghee Under Your Eyes : కంటి చుట్టూ నల్లని వలయాలు, కంటి కింద వాపు, ఉబ్బడం వంటివి కనిపిస్తే.. నెయ్యి రాస్తే మంచిదని చెప్తున్నారు. మరి దీనివల్ల లాభమా? నష్టమా? తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నెయ్యిలోని విటమిన్లు, కొవ్వులు కళ్ల చర్మాన్ని పోషించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • ఇది చర్మానికి తేమ అందించి, నల్లటి వలయాలు, ముడతలను తగ్గిస్తుంది.
  • రక్త ప్రసరణను మెరుగుపరిచి, అలసిన కళ్ల ఉబ్బును కూడా తగ్గించగలదు.
  • స్వచ్ఛమైన నెయ్యిని తక్కువ మోతాదులో వాడి, ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి.

Ghee Under the Eyes Benefits and Precautions : ఒత్తిడిలో ఉన్నప్పుడు, రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోనప్పుడు కళ్ల కింద నల్లటి వలయాలు, ఉబ్బు, పొడిబారడం వంటివి కనిపిస్తాయి. వీటిని తగ్గించుకోవడం కోసమే మార్కెట్లోకి ఐ క్రీములు, సీరమ్‌లు వచ్చాయి. అయితే చాలామంది తమ సెన్సిటివ్ స్కిన్, మంచి రిజల్ట్స్ ఇచ్చే చికిత్స కోసం ట్రెడీషనల్ టిప్స్ ఫాలో అవుతున్నారు. అలాంటి టిప్స్​లో కళ్ల కింద నెయ్యి రాయడం ఒకటి. ఇలా అప్లై చేస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల కింద సున్నితమైన చర్మాన్ని సహజ పద్ధతిలో పోషించడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే కళ్ల కింద చర్మం పలుచగా, సున్నితంగా ఉంటుంది. అక్కడ నూనె గ్రంధులు లేకపోవడం వల్ల చర్మం పొడిగా, ముడతలుగా, మచ్చలుగా, డల్​గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చల్లని వాతావరణం, స్క్రీన్‌ ఎక్కువ చూడడం, కాలుష్యం, నిద్రలేమి వంటి కారకాల వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. చర్మానికి తిరిగి తేమను అందించడం కోసం, కెమికల్స్​లోని నెయ్యి వంటి సహజ మాయిశ్చరైజర్‌ అప్లై చేయవచ్చా?

Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి

కళ్ల కింద నెయ్యి రాయడం వల్ల కలిగే లాభాలు

నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఇ, కె ఉంటాయి. ఇవి చర్మాన్ని బాగు చేయడానికి, తేమగా ఉంచడానికి సహాయం చేస్తాయి. విటమిన్ ఎ చర్మ కణాల పునరుత్పత్తికి, విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కళ్ల కింద ప్రాంతానికి లోతైన పోషణను అందించి.. వాటిని మృదువుగా చేస్తాయి. నెయ్యి సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మంలోకి ఇంకిపోతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఎప్పుడు అప్లై చేస్తే మంచిదంటే..

పొడిబారడం తగ్గించడానికి.. రాత్రిపూట తేమను నిలుపుకోవడానికి.. నిద్రపోయే ముందు కళ్ల కింద కొద్దిగా నెయ్యి రాసుకోవచ్చు. దీనిని నిరంతరం ఉపయోగించడం వల్ల ఫైన్ లైన్స్ తగ్గిపోతాయి. డీహైడ్రేషన్ వల్ల కలిగే అకాల వృద్ధాప్యాన్ని ఇది నివారించవచ్చు.

Also Read : క్రియేటిన్ వల్ల బట్టతల వస్తోందా? 20-30 ఏళ్లకే జుట్టు రాలడానికి డాక్టర్లు చెప్తోన్న కారణాలు ఇవే

బ్లాక్ సర్కిల్స్ దూరం అవుతాయా?

రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, పిగ్మెంటేషన్ లేదా పలుచని చర్మం బ్లాక్ సర్కిల్స్​కు కారణం కావచ్చు. నెయ్యి చర్మానికి రక్త ప్రసరణను, రక్త పోషణను మెరుగుపరిచే అవకాశం ఉంది. ఇది కాలక్రమేణా నల్లటి వలయాలను నివారించే అవకాశం ఉంది. చర్మ సంరక్షణలో భాగంగా దీనిని రెగ్యులర్​గా ఉపయోగిస్తే.. అది దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేసి బ్లాక్స్ సర్కిల్స్​ని దూరం చేస్తుంది.

కళ్లు ఉబ్బితే..

నిద్రలేమి, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్లు ఉబ్బడం, కళ్లు అలసిపోవడం జరుగుతుంది. నెయ్యి చర్మాన్ని రిలాక్స్ చేసి.. తేలికపాటి వాపును తగ్గిస్తుంది. అలాగే శాంతపరిచే ప్రభావాలను కలిగి ఉంటుంది. నెయ్యితో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి.. కళ్ల కింద వాపు తగ్గడానికి సహాయపడవచ్చు.

Also Read : పాదాలు నల్లగా, గరుకుగా ఉన్నాయా? ఇంట్లోనే పార్లర్ తరహాలో ఇలా సింపుల్​గా క్లీన్‌ చేసుకోండి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

నెయ్యిని సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కూడా ఉపయోగించవచ్చు. అయితే దీనిని తక్కువ పరిమాణంలోనే అప్లై చేయాలి. చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా లేదా మొటిమలు రాకుండా ఉండేందుకు స్వచ్ఛమైన, సేంద్రీయమైన, ఉప్పు లేని నెయ్యిని ఉపయోగించాల్సి ఉంటుంది. నెయ్యి హానికరమైనది కాదు. కానీ మొటిమలు లేదా జిడ్డు చర్మం ఉన్నవారు దీనిని తక్కువగా ఉపయోగించాలి. మొదటిసారి ఉపయోగిస్తే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. 

మెడికల్ సమస్యలు, అలెర్జీలు లేదా దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు.. కేవలం నెయ్యి మాత్రమే సరిపోదు. కాబట్టి అలాంటి సమయంలో వైద్య సహాయం తీసుకోవడం మంచిది. 

Also Read : ఎండలో తిరిగి ట్యాన్ అయ్యారా? ఈ ఇంటి చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లతో చర్మానికి మళ్లీ మెరుపు తీసుకురండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
Reduce Sun Tan Naturally : ఎండలో తిరిగి ట్యాన్ అయ్యారా? ఈ ఇంటి చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లతో చర్మానికి మళ్లీ మెరుపు తీసుకురండి
ఎండలో తిరిగి ట్యాన్ అయ్యారా? ఈ ఇంటి చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లతో చర్మానికి మళ్లీ మెరుపు తీసుకురండి
Hepatitis B in Pregnancy : గర్భిణీలకు హెపటైటిస్ బి ఉంటే బిడ్డకు కూడా వస్తుందా? బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా డాక్టర్ ఇస్తోన్న సూచనలివే
గర్భిణీలకు హెపటైటిస్ బి ఉంటే బిడ్డకు కూడా వస్తుందా? బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా డాక్టర్ ఇస్తోన్న సూచనలివే
Advertisement

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
Embed widget