Dark circles: కళ్ల కింద నల్లమచ్చలు పోయేందుకు... సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు సూచనలు
కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వాటిని పోగొట్టేందుకు సులభమైన చిట్కాలు ఇవిగో...
పని ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం వంటి రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. వాటిని తగ్గించుకునేందుకు ప్రముఖ సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు రుజుతా దివాకర్ కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. ఆమె తన ఇన్ స్టా ఖాతాలో ఈ చిట్కాలను పోస్టు చేశారు.
1. ప్రతిరోజూ అల్లం, తులసిఆకులు, కుంకుమ పువ్వు రేకలతో టీ చేసుకోవాలి. ఆ టీ చల్లారాక అందులో కాస్త తేనె జోడించి తాగడం అలవాటు చేసుకోవాలి.
2. వేరుశెనగ పలుకులు, బెల్లం, కొబ్బరికోరు కలిపి ప్రతిరోజు సాయంత్రం నాలుగ్గంటల సమయంలో స్నాక్స్ లా తినాలి.
3. ముఖానికి సబ్బును రాయడం తగ్గించి, శెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి క్లెన్సర్ గా వాడుకోవాలి.
4. రాత్రి పదకొండు ముందే నిద్రపోయేట్టు మీ షెడ్యూట్ ప్లాన్ చేసుకోవాలి. మధ్యాహ్నం కనీసం అరగంటైనా నిద్రపోవాలి.
5. అన్నింటి కన్నా నెగటివ్ ఆలోచనలు అధికంగా ఉండే, గొడవలు పడే వ్యక్తిత్వమున్న వాళ్లకి దూరంగా ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
View this post on Instagram
ఈ సూచనలన్నీ పాటిస్తే తప్పకుండా కళ్లకింద నల్లటి వలయాలు తగ్గుతాయి. అలాగే రెగ్యులర్ గా అందరూ చేసే కీరాదోస, అలెవెరా, టమాటో చిట్కాలు కూడా అప్పుడప్పుడు పాటిస్తే మంచిదే. కీరాదోసను గుండ్రని ముక్కలుగా కట్ చేసి కళ్ల మీద రోజుకు కనీసం పావుగంటసేపు పెట్టుకోవాలి. అలాగే టమోటాను కూడా ఇలా వాడొచ్చు. ఇక అలోవెరా వల్ల మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి. చర్మానికి అవసరమైన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. కళ్లకింద నల్లటి వలయాలు వస్తున్నవారు రోజూ అలోవెరా జెల్ ను రాసుకుని ఇరవై నిమిషాల పాటూ వదిలేయాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నల్లటి వలయాలను రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి రోజుకోసారైనా గ్రీన్ టీ తాగడం అలవాటుగా మార్చుకోండి.
Also read: వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగితే మంచిదేగా? ఆయుర్వేదం కాదంటోంది ఎందుకు?
Also read: ఈ చిన్న ట్యాబ్లెట్ చెరువు నీటిని మంచినీరుగా మార్చేస్తుంది .... కొత్త పరిశోధన సక్సెస్
Also read: విటమిన్ సి తగ్గిందో... ఈ రోగాలన్నీ దాడి చేసేందుకు రెడీ