Warm water with Honey: వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగితే మంచిదేగా? ఆయుర్వేదం కాదంటోంది ఎందుకు?
బరువు తగ్గాలనుకునేవారు మొదట చేసే పని పరగడుపున వేడి నీళ్లలో, తేనె కలుపుకుని తాగడం. కానీ ఆయుర్వేదం ఈ పద్ధతికి నో చెబుతోంది ఎందుకు?
చాలామందికి వేడి నీళ్లలో, లేదా పాలలో తేనె వేసుకుని తాగే అలవాటు ఉంటుంది. కొందరు లెమన్ టీ, గ్రీన్ టీ ఇలాంటి హెర్బల్ టీలలో వేసుకుని తాగుతారు. తేనె వల్ల చాలా ప్రయోజనాలుండడం వల్ల, పంచదారకు బదులు దీన్ని వాడే వాళ్ల సంఖ్య కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు పూర్తిగా చక్కెరకు దూరంగా ఉంటూ, దాని బదులు అప్పుడప్పుడు తేనెను తింటున్నారు. తేనెలో కాల్ఫియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింకు వంటి పోషకాలు లభిస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. తేనె కొలెస్ట్రాల్ శోషణలో సహాయపడి, బరువును తగ్గిస్తుందని చాలా మంది నమ్మకం. ఇది సహజ స్వీటెనర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే తేనె తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దగ్గు నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అందుకే తేనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవన్నీ నిజమేనని ఆయుర్వేదం కూడా అంగీకరిస్తోంది. కానీ వేడి నీళ్లలో లేదా పాలు, టీలలో వేసుకోవడం మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తోంది.
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు రేఖా రాధమణి తన ఇన్ స్టా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. తేనేను సహజంగా తాగితే ఎన్ని లాభాలు కలుగుతాయో, దాన్ని వేడి ద్రావణంలో వేసుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు కలిగే విధంగా, తేనె విషపూరితవంగా మారుతుందని వివరిస్తున్నారు. వేడెక్కిన తేనె స్లో పాయిజన్ తో సమానమని అంటున్నారు రేఖా. వేడెక్కిన తేనె శరీరంలో చేరాక విషపూరితంగా మారుతుందని తెలిపారు. అలాగే నేరుగా తేనెతుట్టే నుంచి సేకరించిన తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్ లు లభిస్తాయని, ఇది షుగర్ రోగులకు కూడా చాలా మంచిదని చెప్పారు. కానీ మార్కెట్లో లభించే పాశ్చరైజ్డ్ తేనెలో డయాబెటిస్ రోగులకు హానికలిగించే మొక్కజొన్న సిరప్ లేదా కృత్రిమ స్వీటెనర్‌లు జోడిస్తారని హెచ్చరించారు.
తేనెకు ఏ మాత్రం వేడి తగిలినా అందులో ఉండే పోషకాలు కూడా నిర్వీర్యం అవుతాయని, కాబట్టి వేడినీళ్లలో కాకుండా గది ఉష్ణోగ్రతను కలిగి ఉండే నీళ్లలోనే కలుపుకుని తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు రేఖా.
[insta]
View this post on Instagram
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఈ చిన్న ట్యాబ్లెట్ చెరువు నీటిని మంచినీరుగా మార్చేస్తుంది .... కొత్త పరిశోధన సక్సెస్
Also read: విటమిన్ సి తగ్గిందో... ఈ రోగాలన్నీ దాడి చేసేందుకు రెడీ
Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు