అన్వేషించండి

Home Remedies: శీతాకాలంలో దగ్గు వేధిస్తుంటే... ఇదిగో ఇంటిచిట్కాలు

వాతావరణం చల్లగా మారేకొద్దీ కొందరిలో జలుబు, దగ్గు, జ్వరాల్లాంటి సీజనల్ వ్యాధులు దాడి చేస్తాయి. వీటిలో ఎక్కువ ఇబ్బంది పెట్టేది దగ్గే.

గొంతులో లేదా గాలి గొట్టాల్లో ఏదైనా దుమ్ము, ధూళి లాంటిది చేరి ఇబ్బంది పెట్టినప్పుడు అది దగ్గు రూపంలో బయటికి వస్తుంది. దగ్గు వల్ల ఆ దుమ్ముతో పాటూ, అంతర్గతంగా ఏర్పడిన శ్లేష్మం కూడా బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసినా కూడా దగ్గు మాత్రం ఒక్కోసారి ఆగదు. సిగరెట్ పొగ పడక, బ్యాక్టిరియల్ ఇన్ఫక్షన్, అలెర్జీలు, ఆస్తమా... ఇలా రకరకాల కారణాల వల్ల దగ్గు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో త్వరగా దగ్గు ఎటాక్  అవుతుంది. ఈ ఇంటి చిట్కాలతో దగ్గును దూరం చేసుకోవచ్చు. పెద్దలు, పిల్లలు... ఇద్దరూ పాటించదగ్గ చిట్కాలే ఇవి. 

1. కొందరికి రాత్రిపూట ఆగకుండా దగ్గు వస్తుంది. అలాంటివారికి తేనె వల్ల ఉపశమనం కలుగుతుంది. గొంతు పొరలపై ఉన్న బ్యాక్టిరియాను, నొప్పిని తేనె తగ్గిస్తుంది. 

2. ఉప్పునీళ్లతో రోజూ ఉదయం గార్గిలింగ్ చేయడం వల్ల గొంతులోని బ్యాక్టిరియా మరణించే అవకాశం ఉంటుంది. అలాగే గొంతులో అడ్డు పడుతున్న శ్లేష్మం కూడా మెత్తబడి గాలి ఆడుతుంది. దీనివల్ల దగ్గు ఆగుతుంది. 

3. అల్లంలో వికారం, జలుబు తగ్గించే లక్షణాలు ఎక్కువ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువ. కనుక అల్లం రసాన్ని అర చెంచా తాగినా మంచి ఫలితం ఉంటుంది. 

4. ఆవిరి పీల్చడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. గొంతులో పట్టేసే సమస్య నుంచి బయటపడేస్తుంది. అక్కడ తేమవంతంగా మారి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 

5. అలెర్జీ సమస్యలున్న వారు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడితే మంచిది. ఇది గాలిలోని బ్యాక్టిరియాను, దుమ్మూ ధూళిని గ్రహించేస్తుంది. 

6. దగ్గు ఉన్నప్పుడు తరచూ గోరువెచ్చని నీరు తరచూ తాగడం అలవాటు చేసుకోవాలి.  గొంతు తడారిపోతే దగ్గు మరింత ఎక్కువైపోతుంది. కాబట్టి తరచూ నీళ్లు తాగడం చాలా ముఖ్యం. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు

Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?

Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం

Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget