అన్వేషించండి

Best Cold Remedies : జలుబును తగ్గించడంలో మెడిసన్ పని చేయట్లేదా? ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయిపోండి

Home Remedies for Cold : జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. టాబ్లెట్స్ వేసుకున్నా వెంటనే రిలీఫ్ రాదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. 

Cold and Flu Home Remedies : జలుబు వచ్చిందంటే చాలు. బాడీ పెయిన్స్, జ్వరం, చలి ఎక్కువగా ఉంటుంది. ముక్కు కారుతూ ఇబ్బంది పెడుతుంది. దీనికోసం మీరు మందులు తీసుకున్నా అంతగా ప్రభావం ఉండదు. కానీ ఈ లక్షణాలు మెరుగుపడకపోతే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేయవచ్చు. ఇవి మీకు జలుబు నుంచి ఉపశమనం అందిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

చికెన్ సూప్

జలుబు, ఫ్లూని తగ్గించుకోవడానికి మీరు చికెన్ సూప్ ట్రై చేయవచ్చు. ఇది మీరు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి హెల్ప్ చేస్తుంది. దీనికి ఎలాంటి సైంటిఫిక్ రుజువు లేదు కానీ.. దీనిలోని పదార్థాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది మీకు హైడ్రేషన్ అందించి ఓదార్పునిస్తుంది. దీనిలోని పోషకాలు మీకు ఎనర్జీ ఇస్తాయి. కాబట్టి మీరు జలుబుతో ఇబ్బంది పడుతుంటే వేడి వేడి చికెన్ సూప్ తాగేయొచ్చు. 

అల్లం

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్​, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీకు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. వికారం వంటి ఇబ్బందులు దూరం చేస్తుంది. దీనిని టీ రూపంలో లేదా కషాయంగా తీసుకోవచ్చు. 

తేనె

తేనెలో అనేక రకాల యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. లెమన్ టీలో తేనె కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఇది దగ్గు సమస్యను కూడా దూరం చేస్తుంది. అయితే మీరు చిన్న పిల్లలకు తేనె ఇవ్వకపోవడమే మంచిది. 

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబయాల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది జలుబు లక్షణాలు తగ్గిస్తుంది. ఇది మీరు అనారోగ్యం బారిన పడకుండా హెల్ప్ చేస్తుంది. 

విటమిన్ సి

జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేసుకోవడానికి మీరు విటమిన్ సి ఎక్కువ కలిగి ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సిట్రస్ ఫ్రూట్స్​ మీకు ఈ సమస్య నుంచి ఉపశమనం అందిస్తాయి. బ్రోకలీ వంటి ఆకుకూరలతో సూప్ చేసుకుని తాగొచ్చు. 

ప్రోబయోటిక్స్ 

ప్రోబయోటిక్స్ మీ గట్, రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. శ్వాసకోశ ఇన్​ఫెక్షన్ల నుంచి ఉపశమనం అందిస్తాయి. కాబట్టి పెరుగు, మజ్జిగను మీ డైట్​లో యాడ్ చేసుకోవచ్చు. 

నోటిని పుక్కిలించాలి..

ఉప్పు నీటితో నోటిని పుక్కిలిస్తే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశముంది. ఇది జలుబు తీవ్రత, లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా గొంతు నొప్పిని దూరం చేస్తుంది. 

ఇవన్నీ మీకు జలుబు నుంచి ఉపశమనం అందించినా.. వాటి గురించి ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవు. కానీ మీరు వీటిని ఫాలో అయితే జలుబు, ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోండి. దీనివల్ల మీరు ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. పరిస్థితి విషమిస్తే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించండి. 

Also Read : ఓపియమ్ బర్డ్ నిజంగానే ఉందా? ఈ భయానకమైన పక్షి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget