Opium Bird : ఓపియమ్ బర్డ్ నిజంగానే ఉందా? ఈ భయానకమైన పక్షి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Opium Bird is Real or Fake : మీరు ఓపియమ్ బర్డ్ గురించి విన్నారా? చూస్తే ఒళ్లు గగుర్పాటు కలిగించే ఆకారం దానిది. ఇది ఇంటర్నెట్లో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఇంతకీ ఇది ఎక్కడుంటుంది?
Opium Bird Full Details : సోషల్ మీడియాలో కొత్తగా ఏది కనిపించినా అది నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. కొన్ని సెకన్ల వీడియోలతోనే చాలామంది ఓవర్‌నైట్ స్టార్ అయిపోతున్నారు. అలాగే వింతలు, విశేషాలు అంటూ పెట్టే ఫోటోలు, వీడియోలు మిలియన్స్‌లో వ్యూస్ అందుకుంటున్నాయి. లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. వీటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నవారు ఎందరో. ఈ వ్యూస్, లైక్స్ కోసం చాలామంది కొన్ని వింతలు, విడ్డూరమైన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అది నిజమో.. లేక అబద్ధమో తెలుసుకునే లోపు ఎందరికో అది షేర్ అయిపోతుంది. అలా వైరల్ అయిన వాటిలో ఓపియమ్ బర్డ్ కూడా ఒకటి.
వింతైనా, చూస్తే ఒళ్లు గగుర్పాటు కలిగించే ఓ వింత పక్షి వీడియోను ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దానిపేరు ఓపియమ్ బర్డ్ అంటూ చెప్పాడు. ఇది నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ఇది చూసేందుకు చాలా భయంకరంగా ఉందంటూ కొందరు చర్చించుకుంటే.. మరికొందరు అసలు ఇది నిజమైనదా? కాదా అంటూ డిస్కషన్స్ చేశారు. ఇంతకీ ఈ పక్షి నిజమైనదా? కాదా? ఉంటే అసలు ఎక్కడ దీని జాడ కనుక్కోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపియమ్ బర్డ్ చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది. ఇది పొడవుగా మనిషిని పోలి ఉంటుంది. కానీ ముఖం మాత్రం పక్షి. భారీ ఈకలతో బూడిద, తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇది మంచులో ఉండే పక్షి. దీనికి పొడవైన ముక్కు ఉంటుంది. కళ్లు నల్లగా ఉంటాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను మొదటిసారిగా ఓ వ్యక్తి టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. దానికి అంటార్కిటిక్ పర్వత శ్రేణుల్లోని పక్షులను చూశారా అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయినా.. ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఈ వీడియో వైరల్ అయింది.
నెటిజన్లు దీనిని నిమిషాలల్లో వైరల్ చేశారు. ఈ పక్షిని చూశారా ఎలా ఉందో.. ఎంత భయంకరంగా ఉందోనంటూ తెగ షేర్ చేసేశారు. అయితే ఇది నిజమైనదో కాదో అంటూ ఉండగా.. ఇది పూర్తిగా వైరల్ అయిన తర్వాత దీని గురించి అసలైన నిజాలు తెలిశాయి. ఇది టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసిన వ్యక్తి ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ మేధస్సును ఉపయోగించి.. ఈ జీవిని తయారు చేశాడు. ఇది అంటార్కిటికాలో గుర్తించలేదని.. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని తేలింది.
AI అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్నో వస్తున్నాయి. చూసేందుకు ఏది నిజమో.. ఏది అబద్ధమో అనేంతగా ఈ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు కూడా దీనితోనే తయారు చేస్తారు. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ అవసరాలను తీరుస్తూనే.. అనర్థాలను సృష్టిస్తుంది. AIకి కాదేది అనర్హం అన్నట్లు ప్రధాన మంత్రి మోదీ వాయిస్‌తో ఎన్ని పాటలు వస్తున్నాయో.. వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. కాబట్టి సోషల్ మీడియాలో దేనిని చూసినా అది వైరల్ చేయడం కాదు.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు.
Also Read : 65 రోజెస్ లక్షణాలు తెలుసా? చిన్నపిల్లలను బాగా ఎఫెక్ట్ చేసే వ్యాధి ఇది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.