అన్వేషించండి

Love Bite Removing Tips : మచ్చలందు లవ్​బైట్​ వేరయా? దీనిని ఎలా తగ్గించుకోవచ్చంటే

Hickey Removal : మీకు లవ్​బైట్ తెలుసా? తెలియకుండా ఎందుకు ఉంటారు లేండి? మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఇచ్చే ఈ మచ్చ మీకు ఎంత నచ్చినా.. దానిని కవర్ చేసుకోవాల్సిన అవసరం మీకు కచ్చితంగా వస్తుంది.

Home Remedies for Hickey : అరేయ్ మచ్చా.. ఏంటి ఈ మచ్చ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే కంగారుగా దానిని కవర్​ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సిగ్గుపడుతున్నారా? అబ్బా.. ఎన్నిసార్లు చెప్పాను ఇలా చేయొద్దు అని.. ఇప్పుడు చూశావా వాడికి తెలిసి కూడా ఏంటిది అని కావాలని అడుగుతున్నాడు అని మీ పార్టనర్​ మీద ప్రేమగా కోపం చూపిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. మీ పార్టనర్​ ప్రేమను కంట్రోల్ చేయడం ఎందుకు కానీ.. మీ లవ్​బైట్​ తాలుకూ మచ్చ(Love Bite Mark)ని కంట్రోల్ చేసేయండి. అయితే ముందుగా లవ్​బైట్ (Love Bite)​ అంటే ఏంటో.. అది ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకుందాం. 

లవ్​బైట్​. దీనినే హికీస్ అని కూడా అంటారు. ఇది చర్మంపై.. కనిపించే ఓ గాయం. ఇది కొరకడం లేదా పెదవులతో ప్రెస్​​ చేయడం వల్ల అయ్యే తీపి గాయమని చెప్పవచ్చు. ఇద్దరి రొమాన్స్​(Romance)లో తెలియకుండా జరిగే ఓ ప్రక్రియ లేదా తెలిసి ప్రేమగా చేసే ఓ గాయంగా చెప్పవచ్చు. ఈ లవ్​ బైట్​ ముదురు ఎరుపు, ఊదా రంగులో లేదా మీ చర్మం రంగు కంటే ముదురు రంగులో కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇవి మెడపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 

మెడదగ్గర ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో మీ పార్టనర్(Partner)​ మీ చర్మాన్ని పెదవులతో గట్టిగా ప్రెస్​ చేసినప్పుడు లేదా కొరికినప్పుడు కలిగే ఒత్తిడి.. మీ చర్మం కింద ఉండే రక్తనాళాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఇలా రక్తనాళాలు విచ్చిన్నమై.. పెటెచియా అనే చిన్న మచ్చలను విడుదల చేయడం ప్రారంభిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ చిన్న మచ్చలన్నీ కలిసి ఒక పెద్ద డార్క్ స్పాట్​ను ఏర్పరచుతుంది. దీనిని లవ్​బైట్​ లేదా హికీ(Hickey) అంటాము. 

ఈ గాయం ఎంతకాలం ఉంటుంది? 

లవ్​బైట్​ ఏర్పడే మూమెంట్ మధురంగానే ఉండొచ్చు కానీ.. దాని తర్వాత కలిగే పర్యావసనాలు ఎదుర్కోవడం సాహసమనే చెప్పాలి. ఇంట్లో ఉండేవారికి పర్లేదు కానీ.. కాలేజీలకు, ఆఫీస్​లకు వెళ్లేవారికి దీనిని కవర్​ చేయడం ఓ పెద్ద టాస్క్​ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ గాయమేంటి అనేది అందరికీ అర్థమైనా.. కావాలని దగ్గరికెళ్లి మరీ.. ఏమిటిది అని అడుగుతారు. దానికి మీ దగ్గర సిగ్గు తప్పా.. సమాధానం ఉండదనే చెప్పాలి. అమ్మాయిలైతే.. మేకప్​తో దానిని కవర్ చేసుకోవచ్చు. మరి అబ్బాయిలైతే.. దానిని ఎలా కవర్ చేయాలి. అసలే లవ్​బైట్​ దాదాపు రెండు వారాలు ఉంటుందట. అయితే దీనిని త్వరగా తగ్గించుకోవడానికి కొన్ని హోమ్ రెమిడీస్​ (Home Remedies for Hickey) ఉన్నాయి. అవేంటే మీరు ఓ లుక్కేయండి. 

హాట్ కంప్రెస్..

లవ్​బైట్​ని తగ్గించుకోవడానికి మీరు హీట్ కంప్రెస్ (Heat Compress) ఉపయోగించవచ్చు. లేదంటే వేడి నీళ్లతో కాపడం పెట్టుకోవచ్చు. ఇది మచ్చను తర్వగా తగ్గేలా చేస్తుంది. ఎందుకంటే హీట్ కంప్రెస్ నుంచి వచ్చే వేడి.. హికీ ప్రాంతంలో మెరుగైన రక్తప్రసరణను ప్రోత్సాహిస్తుంది. తద్వారా నొప్పి తగ్గి.. మచ్చ కూడా త్వరగా తగ్గే అవకాశముంది. కాబట్టి రోజులో 2 నుంచి 3 సార్లు.. 5 నుంచి 10 నిమిషాలు కాపడం పెట్టండి.

అలోవెరా జెల్​తో..

కలబంద జెల్ (Aloe Vera Gel) యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది గాయాలను త్వరగా తగ్గేలా చేస్తుంది. దీనికోసం మీరు ఫ్రెష్ అలోవెరాను తీసుకుని దాని జెల్​ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. 15 నుంచి 20 నిముషాలు అలాగే ఉంచండి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేయండి. దీనిని రోజుకు రెండు సార్లు చేస్తే తర్వగా మచ్చ మాయమవుతుంది. 

కోల్డ్ కంప్రెస్..

హీట్​ కంప్రెస్ (Cold Compress)​ మాత్రమే కాదు.. ఈ మచ్చను తగ్గించడానికి కోల్డ్ కంప్రెస్​ కూడా బాగానే హెల్ప్ చేస్తుంది. చల్లని ఉష్ణోగ్రత వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని పరిశోధనలు తెలిపాయి. ఇవి నాళాల నుండి చర్మానికి రక్తప్రవాహాన్ని తగ్గించి.. మచ్చలను ఏర్పరుస్తుంది. దీనికోసం మీరు ఐస్​క్యూబ్స్ ఉపయోగించవచ్చు. రోజుకు రెండు, మూడుసార్లు ఐస్​ క్యూబ్​తో మసాజ్ చేసినా మంచి ఫలితముంటుంది.

మసాజ్ థెరపీ..

మసాజ్ థెరపీ నొప్పిని తగ్గించడంతో పాటు.. శరీరంలో రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మచ్చ త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అయితే మచ్చ ఉన్న ప్రదేశంలో ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు. కాబట్టి కొద్దిగా నూనె తీసుకుని చేతులను బాగా రబ్​ చేయండి. చేతుల మధ్య వేడికలిగినప్పుడు మీరు ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, మచ్చ తగ్గుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ చిట్కాలతో మీరు కూడా లవ్​బైట్స్​కి బాయ్ చెప్పేయండి. 

Also Read : కలయికకు కూడా షెడ్యూల్ ఫిక్స్ చేయాలట.. ఎందుకంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget