అన్వేషించండి

డైటింగ్ చేస్తున్నప్పుడు.. ఆ సమస్య వెంటాడుతోందా?

డైటింగ్ చేసినప్పుడు మంచి ఆరోగ్యంతో పాటు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

Weight Loss Diet : బరువు తగ్గాలని, ఫిట్​గా ఉండాలని చాలామంది డైటింగ్ చేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్ డైట్​ పాటించడం వల్ల ఆ సమయంలో మంచి ఫలితాలు కూడా చూస్తారు. అయితే డైటింగ్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్​ కూడా ఉంటాయి. దానిలో జుట్టు రాలిపోవడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైటింగ్​లో భాగంగా కొన్ని పోషకాలు జుట్టుకు సరిగ్గా అందవు. ఆ సమయంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. బరువు తగ్గుతున్నామనే సంతోషం ఎలా ఉన్నాసరే.. జుట్టు రాలిపోతుందనే బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. 

బరువు తగ్గాలి అనుకోవడం అంత సులభమైనది ఏమి కాదు. పట్టుదల, సహనం, డెడికేషన్.. అన్నింటికన్నా ముఖ్యం సమయం కేటాయించడం చాలా అవసరం. ఇన్ని చేసినా సరే దానివల్ల కలిగే దుష్ప్రాభావాలు కూడా ఉంటాయి. మీరు తినే ఆహారం పైనే మీ జుట్టు ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తించాలి. కాబట్టి డైట్​ సమయంలో హెయిర్ ఫాల్​ ఎక్కువగా ఉంటుంది. అయితే డైటింగ్ చేస్తూ కూడా.. జుట్టును సంరక్షించుకోగలిగే మార్గాలు ఏమైనా ఉన్నాయా? 

సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు డైట్​లో పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు చేర్చుకుంటారు. ఇది డైట్​లో ఉన్నప్పుడు జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది. పోషకాల కొరత ఎక్కువయ్యే కొద్ది కొవ్వు తగ్గినా.. జుట్టు మాత్రం వీక్ అయిపోతుంది. ప్రోటీన్లు, క్యాలరీలు పరిమితం చేయడం వల్ల శరీరంలోని పోషకాలను కోల్పోతాము. ఇది జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. రక్తం, ఆక్సిజన్ జుట్టు కుదుళ్లకు చేరకుండా నిరోధిస్తుంది. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి.. ఊడిపోతూ ఉంటుంది. 

డైట్​ పాటిస్తున్నప్పుడు ఫుడ్ పరిమితం చేస్తాము. ఇది మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగిస్తుంది. బరువు తగ్గాలనే ఒత్తిడి తెలియకుండానే ఏర్పడుతుంది కాబట్టి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ ఎక్కువైతే జుట్టు రాలిపోతుంది. ఎందుకంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి.. అది నేరుగా జుట్టు కుదుళ్లను ప్రభావితం చేస్తుంది. తక్కువ సమయంలో బరువు తగ్గిపోవాలనుకునేవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. 

దీనిని ఎలా అరికట్టాలంటే.. 

మీరు ఏ డైట్​ ప్రారంభించినా.. ముందు వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచనల ప్రకారం మీ శరీరానికి ఏమేమి పోషకాలు అందిచాలో వాటిని రెగ్యూలర్​గా తీసుకోవాలి. కేలరీలను కంట్రోల్​ చేయాలి కానీ.. వాటిని పూర్తిగా విస్మరించకూడదు. అలా చేస్తే ఒత్తిడి, అలసటకు గురవుతారు. కాబట్టి శరీరానికి క్రమం తప్పకుండా కొన్ని కేలరీలు అందిచాలి. ఇది మీకు శక్తిని ఇస్తుంది. నిర్థిష్ట పోషకాలను కచ్చితంగా తీసుకోవాలి.

ఒకేసారి బరువు తగ్గాలని చేసే ప్రయత్నాలు ఎప్పుడూ మంచిది కాదు. త్వరగా బరువు తగ్గిపోయినా.. అది దీర్ఘకాలంలో మీపై దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు తీసుకువస్తుంది. మీ జుట్టుకు కూడా ఇది అస్సలు మంచిది కాదు. కాబట్టి.. నెమ్మదిగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ.. బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మీ జుట్టు పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది. 
డైట్​లో ఉన్నప్పుడు జుట్టు రాలడం అనేది చాలా తాత్కలికమైన సమస్యగా తీసుకుంటే పర్లేదు. కానీ దానిని కూడా స్ట్రెస్​గా తీసుకుంటే మాత్రం అది బరువు, జుట్టుపై నెగిటివ్ ఫలితాలను చూపిస్తుంది. డైట్​ చేసుకుంటూ.. తలకు రక్తప్రసరణ అందించే వ్యాయామాలు, మసాజ్​లు చేసుకుంటూ జుట్టును కాపాడుకోవచ్చు కూడా. లేదంటే వైద్యుని సూచనల మేరకు.. సప్లిమెంట్స్​ కూడా తీసుకోవచ్చు. 

Also Read : బరువు తగ్గడానికి రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామాలు చేస్తే చాలట!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Night Heat Wave : నైట్ హీట్ వేవ్ వల్ల డెత్ రేట్ పెరుగుతుందంట.. రాత్రుళ్లు పెరిగే ఉష్ణోగ్రతలతో జాగ్రత్త అంటోన్న నిపుణులు
నైట్ హీట్ వేవ్ వల్ల డెత్ రేట్ పెరుగుతుందంట.. రాత్రుళ్లు పెరిగే ఉష్ణోగ్రతలతో జాగ్రత్త అంటోన్న నిపుణులు
Kidney Stones Problem : కిడ్నీ స్టోన్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ వెజిటేబుల్ జ్యూస్‌లు తాగండి.. మూత్రపిండాలకు మంచిది
కిడ్నీ స్టోన్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ వెజిటేబుల్ జ్యూస్‌లు తాగండి.. మూత్రపిండాలకు మంచిది
Summer Infections on the Rise : వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ముప్పు.. టైఫాయిడ్, ఇతర వ్యాధులు పెరగడానికి కారణాలు ఇవే అంటోన్న నిపుణులు
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ముప్పు.. టైఫాయిడ్, ఇతర వ్యాధులు పెరగడానికి కారణాలు ఇవే అంటోన్న నిపుణులు
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
Hardik Pandya Fined: MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
Numerology: మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
Chennai Super Kings  Knock Out: చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
Cockroaches : బొద్దింకలు(కాక్రోచ్) ఆరోగ్యానికి ప్రమాదమా? వీటి వల్ల వ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే..
బొద్దింకలు(కాక్రోచ్) ఆరోగ్యానికి ప్రమాదమా? వీటి వల్ల వ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే..
Crocodile Attack Uttar Pradesh: అత్తమ్మ అంత్యక్రియల్లో ఘోర విషాదం - సరయూ నదిలో అల్లుడిని మింగేసిన మొసలి!
అత్తమ్మ అంత్యక్రియల్లో ఘోర విషాదం - సరయూ నదిలో అల్లుడిని మింగేసిన మొసలి!
Embed widget