Mental Health: కడుపు బాగుంటేనే మనసు బాగుంటుంది - అర్థం కాలేదా? నిపుణులు ఏం చెప్పారో చూడండి
అదేంటి పేగులకు, మెదడుకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
ఒత్తిడి, పేలవమైన జీవనశైలి, మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోవడం వంటి కారణాల వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. డబ్యూహెచ్వో 2019 అధ్యయనం ప్రకారం మానసిక ఆరోగ్య రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాధుల్లో సుమారు 15 శాతం వరకు కారణమని పేర్కొంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 90 శాతం మంది భారతీయులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. జన్యుశాస్త్రం, జీవితానుభవాలు, పర్యావరణ కారకాలు మానసిక సమస్యలకు ప్రాథమిక కారణాలు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పేలవమైన పేగు ఆరోగ్యం కూడా అలాంటి రుగ్మతకు దారి తీస్తుంది. అందుకే, కడుపు బాగుంటేనే మనసు బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా మెదడులోని రసాయనిక అసాధారణతల వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి అసమతుల్యతకి కారణం జీర్ణశయాంతర పేగు లేదా గట్ హెల్త్ కారణమని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పేలవమైన ఆహారం, దీర్ఘకాలిక ఒత్తిడి ఫలితంగా తరచుగా సంభవించే గట్ మైక్రోబయోమ్ లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మెదడు పనీతిరుకి అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి వల్ల పొత్తి కడుపు తిమ్మిరి, పైల్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. గట్, మానసిక స్థితి మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
గట్ ఆరోగ్యం మెదడుని ఎలా ప్రభావితం చేస్తుంది?
గట్ మైక్రోబయోమ్ అని పిలిచే జీర్ణశయాంతర పేగు శరీరంలో జీర్ణక్రియ, జీవక్రియ సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గట్ మైక్రోబయోమ్ లు మానసిక స్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. బాధగా ఉన్న పేగు మెదడుని అప్రమత్తం చేసేందుకు కొన్ని సంకేతాలు పంపిస్తుంది. దీని వల్ల మైండ్ డిస్ట్రబ్ గా అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం డిప్రెషన్ తో బాధపడుతున్న రోగులో డయలీస్టర్, కోప్రొకోకస్ వంటి గట్ సూక్ష్మజీవులు మానసిక ఆరోగ్య పరిస్థితులకు కారణం అవుతాయి.
గట్- బ్రెయిన్ కనెక్షన్
మెదడు, గట్ లెక్కలేనన్ని నరాల ద్వారా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఈ ఇంటర్ కనెక్షన్ భావోద్వేగాలను నిర్వహించడమే కాకుండా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా సరిగా చూసేందుకు సహాయపడుతుంది. పొట్ట, మెదడు మధ్య రసాయన, భౌతిక కనెక్షన్ ఉంటుంది.
అతిపెద్ద నాడి: ఈ పెద్ద నాడి మెదడుని పేగులకు కలుపుతుంది. జీర్ణాశయం ద్వారా ఆహారాన్ని తరలించడంలో సహాయపడటమే కాకుండా జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. భోజనం తిన్నప్పుడు మెదడు, కడుపుకి సంతృప్తి అనుభూతిని కలిగిస్తుంది.
గట్ మైక్రోబయోమ్: ఇవి సాధరణంగా ఆరోగ్యాని మెరుగుపరుస్తాయి. గట్ లో కొన్ని వేల మైక్రోబయోమ్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, వైరస్ తో కూడిన ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని విచ్చిన్నం చేసేందుకు దోహదపడతాయి. మెదడుని జీర్ణక్రియ, మానసిక ఆరోగ్యానికి కీలకమైన గట్ ఎంటర్టిక్ నాడీ వ్యవస్థ(ENS) కి కలుపుతుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థలో కనిపించే న్యూరాన్ లు ఉపయోగిస్తుంది. అందుకే ENS ని మానవ శరీరం రెండో మెదడు అని కూడా చెప్తారు.
న్యూరోట్రాన్స్మీటర్లు: గామా అమినోబ్యూట్రిక్ యాసిడ్, డోపమైన్, సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మీటర్లు మెదడులోని భయం, ఆందోళన భావోద్వేగలను నియంత్రిస్తాయి. ఈ రసాయనాలు మానసిక రుగ్మతలు కూడా తగ్గిస్తాయి. మెదడులోని ఆరోగ్యకరమైన న్యూరోట్రాన్స్మీటర్ఉత్పత్తి పేగు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.
పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇలా
కూరగాయలు, పండ్లు, చిక్కులలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, ప్రొ బయోటిక్స్ ఉన్న ఆహారం పెరుగు, ఆలివ్, మజ్జిగ, కాటేజ్ చీజ్ వంటివి తీసుకుంటే గట్ ఆరోగ్యం బలపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గర్భిణీలకు వచ్చే ప్రాణాంతకమైన ఎక్లాంప్సియా గురించి తెలుసా? లక్షణాలు ఎలా ఉంటాయంటే
Join Us on Telegram: https://t.me/abpdesamofficial