మీ జీవితం ఇలా లేకపోతే, త్వరగా ముసలోళ్లు అయిపోతారు!
రోజులు గడిచేకొద్దీ వయసు పెరగడం కొన్ని దశాబ్ధాల్లో వృద్ధాప్యం రావడం అనేది అనివార్యమైన విషయం అనేది ప్రపంచమంతా అంగీకరించే విషయమే. కానీ కొందరు శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయంతో తాము ఏకీభవించమని అంటున్నారు.
వయస్సు పెగడంలో ప్రతి సెకన్ కౌంట్ అవుతుంది. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండలేం. కానీ, ఆ మార్పును అంత ఈజీగా గుర్తించలేం. నెలలు గడిచే కొద్ది శరీరంలో మార్పును గమనించగలం. ఏళ్లు గడిచేకొద్ది.. మనం యవ్వనాన్ని కోల్పోతున్నామని అర్థమవుతుంది. అయితే, కొందరు వయస్సు పెరుగుతున్న.. యవ్వనంగానే ఉంటారు. చాలా యాక్టీవ్‌గా, అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు. ఇందుకు వారి అలవాట్లు, జీవనశైలీ, సామాజిక పరిస్థితులే అంటే నమ్ముతారా? అయితే, తాజా పరిశోధనల్లో తేలింది అదే.
రోజులు గడిచేకొద్దీ వయసు పెరగడం.. కొన్ని దశాబ్దాల్లో వృద్ధాప్యం రావడం అనేది అనివార్యమైన విషయం అనేది ప్రపంచమంతా అంగీకరించే విషయమే. కానీ కొందరు శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయంతో తాము ఏకీభవించమని అంటున్నారు. యూఎస్‌లోని హార్వర్డ్ సింక్లెయిర్ ల్యాబ్ కు చెందిన కో డైరెక్టర్, జన్యుశాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ సింక్లైర్ ‘‘DNA is no longer your destiny” అని అంటున్నారు. అంటే డీఎన్ఏ మీద ఆధారపడి ఇక పై జీవితాలు సాగవని అర్థం.
మన ఆరోగ్యం ఎలా ఉండబోతోందనేది 20 శాతం ముందుగానే రాయబడి ఉన్న జన్యురచన మీద ఆధారపడి ఉంటుంది. అయితే మిగిలిన 80 శాతం మాత్రం మన నియంత్రణలో ఉంటుందని ప్రొఫెసర్ డెవిడ్ అంటున్నారు. మీరు ఎంత ఆరోగ్యవంతమైన జీవన విధానం అనుసరిస్తున్నారనే దాని మీద ఆధారపడి మీ ఆరోగ్య జీవితం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. దాన్ని బట్టే మీ లైవ్ ఉల్లాసంగా సాగుతుందా లేక భయంకరంగా ఉంటుందా అనేది తెలుస్తుంది. కాబట్టి అలా మీ ఏజింగ్ ప్రాసెస్ ను ప్రభావితం చేసే కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.
అలవాట్లు – జీవన శైలి
ఒత్తిడి, కాలుష్యం, తీసుకునే ఆహారం, పొగతాగడం వంటి దురలవాట్లు, తగినంత వ్యాయామం లేకపోవడం వంటి కారకాలు మీ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయనేది నిర్వివాదాంశం. వీటితోపాటు నిద్రాసమయం కూడా ఒక భాగమే. ఇటీవల లండన్ లోని యూనివర్సిటి కాలేజ్ సైంటిస్టులు జర్నల్ స్లీప్ హెల్త్ లో కొత్త విషయాలను ప్రచురించారు. మిడిల్ ఏజ్ వ్యక్తులు మధ్యాహ్నం తీసే చిన్న కునుకు.. వారి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదట. డిమెన్షియా వంటి రిస్క్ లు తగ్గుతాయని ఈ నిపుణులు చెబుతున్నారు.
సాంఘిక జీవితం
పనుల ఒత్తిడిలో పడి సాంఘిక జీవిత ప్రాముఖ్యతను మరచిపోతుంటాము. డాక్టర్ టామ్ సిన్ లూయిస్ ఓ మీడియా సంస్థకు చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘ఆరోగ్యవంతమైన వృద్ధాప్యానికి అత్యంత సురక్షిత కారకాల్లో ఒకటి బలమైన మానసిక ఆరోగ్యం కూడా ఉంది. సాధారణంగా ఎవరూ దీనికి పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వరు’’ అని అన్నారు. తరచుగా పార్టీలు చేసుకొనేవారు కంటే.. పెద్దగా సోషల్ లైప్ లేని వారు త్వరగా వృద్ధాప్యం బారిన పడొచ్చు. అప్పటి వరకు ఉన్న అలవాట్లను మార్చుకోవడం చాలా బాధకరంగా అనిపిస్తుంది. అలాంటపుడు ఆయుష్షు పెరగడం అనేది మన చేతిలో లేదులే అని అనిపించవచ్చు. ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలు మనం శాశ్వతంగా జీవించేందుకు దోహదం చెయ్యకపోవచ్చు. కానీ మరణాన్ని వాయిదా వేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొడగించవచ్చు. అల్జీమర్స్ అనేది పెద్దవారిలో మరణానికి కారణమవుతున్న ముఖ్యమైన కారణంగా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆరోగ్యవంతమైన జీవన శైలి, ఒక హాబి, కాస్త స్నేహం, సోషల్ లైఫ్ కలగలిపి బతికితే వృద్ధాప్యాన్ని వాయిదా వెయ్యవచ్చని నిపుణులు రుజువులు చూపుతున్నారు.
Also read : GAS stove: గ్యాస్ స్టవ్ వాడుతున్నారా? కంటికి కనిపించని ఈ ప్రమాదాన్ని మీరు ఊహించి ఉండరు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.