అన్వేషించండి

Henna for Hair : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే

Using Henna on Hair : జుట్టుకు సహజమైన రంగు రావడంతో పాటు హెయిర్ కేర్ కోసం కూడా చాలామంది హెన్నా ఉపయోగిస్తుంటారు. అయితే కొందరు నిపుణులు హెన్నాను అప్లై చేయవద్దని చెప్తున్నారు. ఎందుకంటే.. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెల్లజుట్టుకు హెన్నా సహజ రంగునిచ్చినా, తరచుగా వాడితే జుట్టు పొడిగా మారుతుంది.
  • మార్కెట్ హెన్నాలలో రసాయనాలుండవచ్చు, అవి డ్రైనెస్, అలర్జీలకు కారణం.
  • బ్లాక్ హెన్నాలోని పీపీడీ రసాయనం చర్మ అలర్జీలకు తీవ్రంగా దారితీస్తుంది.
  • జుట్టు రకం బట్టి, స్వచ్ఛమైన హెన్నాను జాగ్రత్తగా, అవసరమైనంత వాడాలి.

Henna Benefits, Risks and Precautions : తెల్లని జుట్టును కవర్ చేసేందుకు, హెయిర్ కేర్ కోసం చాలామంది హెన్నాను తలకు ఉపయోగిస్తారు. సహజమైన హెయిర్ డైగా భావించి కొందరు రెగ్యులర్గా అప్లై చేస్తారు. అయితే హెన్నాను తరచుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారడం, రఫ్‌గా మారడం వంటి సమస్యలు వస్తాయని కొందరు చెబుతున్నారు. మరి అసలు హెన్నాను జుట్టుకు అప్లై చేయకూడదా? దీనిని అప్లై చేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

ప్యూర్ హెన్నా..

సహజమైన ప్యూర్ హెన్నా అయితే సాధారణంగా జుట్టుకు రంగు ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. హెన్నాలో ఉండే సహజ రంగు పదార్థం లాసోన్ (Lawsone) జుట్టులోని కెరాటిన్‌తో బంధం ఏర్పరచుకుని ఆరెంజ్-రెడ్ నుంచి బ్రౌన్ టోన్ వరకు రంగును ఇవ్వగలదు.
అయితే సమస్య అనేది హెన్నాలో మాత్రమే ఉండకపోవచ్చు. మార్కెట్లో లభించే కొన్ని హెన్నా హెయిర్ డై ప్రొడక్ట్స్‌లో ఇతర కెమికల్స్, రంగులు కలిపి ఉండే అవకాశం ఉంది. అందుకే హెన్నా పేరుతో అమ్మే ప్రతి ఉత్పత్తి సహజమైనదేనని అనుకోవడం తప్పు అని చెప్తున్నారు.

Also Read : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి

జుట్టును పొడిగా మారుతుందా?

హెన్నా జుట్టు వెంట్రుకలపై కోటింగ్‌లా పనిచేస్తుంది. కొంతమందిలో ఇది జుట్టును కాస్త మందంగా, బలంగా అనిపించేలా చేయవచ్చు. కానీ తరచుగా లేదా ఎక్కువసేపు హెన్నాను ఉంచడం వల్ల జుట్టు పొడిగా, రఫ్‌గా అనిపించవచ్చు. ఇప్పటికే డ్రై, కర్లీ లేదా డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నవారు హెన్నా ఉపయోగించిన తర్వాత జుట్టు మరింత పొడిబారినట్లు గమనించవచ్చు.

తేమను తగ్గిస్తుందా?

ప్యూర్ హెన్నా సాధారణ హెయిర్ డైలో ఉండే కొన్ని హార్ష్ కెమికల్స్ మాదిరిగా జుట్టును బ్లీచ్ చేయదు. అయితే హెన్నా జుట్టుపై ఒక పొర ఏర్పరచడం వల్ల కొందరిలో జుట్టు గట్టిగా, పొడిగా లేదా చిక్కులు పడేలా అనిపించవచ్చు. అందుకే హెన్నా వేసుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ కండీషనర్ లేదా తగిన హెయిర్ కేర్ తీసుకోవడం మంచిది. 

హెన్నా రెగ్యులర్గా వేసుకోకూడదా?

తెల్ల జుట్టు కవర్ చేయడానికి ప్రతి వారం లేదా తరచుగా హెన్నా వేయాల్సిన అవసరం లేదు. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టుపై ప్రొడక్ట్ బిల్డప్, డ్రైనెస్ వంటి సమస్యలు రావచ్చు. జుట్టు రకం, హెన్నా ఉత్పత్తి, ఉపయోగించే విధానాన్ని బట్టి ఫలితాలు మారుతాయి. కాబట్టి ఒకరి హెయిర్‌కు సరిపోయే విధానం మరొకరికి కూడా తప్పనిసరిగా సరిపోతుందని అనుకోకూడదు.

Also Read : అవిసె గింజలు, బియ్యం, కలబందతో హెయిర్ మాస్క్.. నేచురల్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ కోసం ట్రై చేయండి

బ్లాక్ హెన్నాతో జాగ్రత్త

బ్లాక్ హెన్నా పేరుతో లభించే కొన్ని ఉత్పత్తుల్లో పారా-ఫెనిలీన్ డయామిన్ (PPD) వంటి రసాయనాలు ఉండవచ్చు. ఇవి కొందరిలో తీవ్రమైన చర్మ అలర్జీలు, మంట, దురద, వాపు వంటి ప్రతిచర్యలకు కారణమవుతాయి. అందుకే బ్లాక్ హెన్నా లేదా వెంటనే నల్లగా రంగు వచ్చే హెన్నా ఉత్పత్తులను ఉపయోగించే ముందు పదార్థాలు చెక్ చేసుకుని ప్యాచ్ టెస్ట్ వేసుకోవాలి. 

ప్యాచ్ టెస్ట్ అవసరం ఎందుకంటే..

హెన్నా సహజమైనదే అయినా ప్రతి ఒక్కరి చర్మానికి ఒకే విధంగా సరిపోదు. మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు లేదా కొత్త బ్రాండ్‌కి మారినప్పుడు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. దురద, మంట, ఎర్రబడటం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే జుట్టుకు అప్లై చేయకుండా ఉండాలి. తీవ్రమైన అలర్జీ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

జుట్టు పెరుగుతుందా?

హెన్నాను జుట్టు పెరుగుదలకు అద్భుతమైన పరిష్కారంగా ప్రచారం చేస్తుంటారు. కానీ హెన్నా నేరుగా జుట్టు పెరుగుదలను పెంచుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. ఇది ప్రధానంగా జుట్టుకు రంగు ఇవ్వడానికి, వెంట్రుకలకు కండిషనింగ్ అనుభూతి కలిగించడానికి ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే హెన్నాపై ఆధారపడకుండా అసలు కారణాన్ని గుర్తించడం ముఖ్యం.

Also Read : అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

కెమికల్ హెయిర్ డైతో జాగ్రత్త 

హెన్నా అంటే మొత్తం ఒకే రకం ఉత్పత్తి కాదు. 100% ప్యూర్ హెన్నాలో సాధారణంగా హెన్నా ఆకుల పొడి మాత్రమే ఉంటుంది. కానీ మార్కెట్లోని కొన్ని హెన్నా కలర్స్లో ఇతర హెయిర్ డై పదార్థాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్యాక్‌పై ఉన్న పదార్థాలు చదుకోవాలి. సహజమైన లేదా హెర్బల్ అని రాసి ఉంటే కెమికల్-ఫ్రీ అనుకోకూడదు. 

హెన్నాను జుట్టుకు అసలు అప్లై చేయకూడదా?

అయితే జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా అంటే అలా చెప్పడం సరికాదు. ప్యూర్ హెన్నాను సరైన విధంగా, అవసరమైనంత మాత్రమే ఉపయోగిస్తే మంచిది. చాలామందికి జుట్టు రంగు కోసం ఉపయోగించవచ్చు. అయితే జుట్టు ఇప్పటికే చాలా పొడిగా, డ్యామేజ్‌గా ఉంటే లేదా స్కాల్ప్ సెన్సిటివ్‌గా ఉంటే జాగ్రత్త తీసుకోవడం అవసరం.

Also Read : మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget