అన్వేషించండి

Heat Rash : చెమట పొక్కులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వస్తే తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు

Heat Rash in Summer : వేసవిలో వచ్చే స్కిన్ సమస్యల్లో హీట్ ర్యాష్ ఒకటి. ఈ చెమట పొక్కులు మంట, దురదతో ఇబ్బంది పెడతాయి. మీకు ఈ సమస్య తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చెమట గ్రంధులు మూసుకుపోవడం, తేమ వల్ల చర్మంపై పొక్కులు ఏర్పడతాయి.
  • పరీక్షించని దుస్తులు, మందపాటి క్రీములు వాడకం వల్ల పొక్కులు పెరుగుతాయి.
  • చల్లటి స్నానాలు, కలబంద, గంధం వంటి ఇంటి చిట్కాలు ఉపశమనం కలిగిస్తాయి.
  • కాటన్ దుస్తులు, నీళ్లు తాగడం, మధ్యాహ్నం ఎండలో తిరగకపోవడం ముఖ్యం.

Tips to Prevent and Treat Heat Rash : వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చాలామంది చర్మంపై చిన్న చిన్న ఎర్రటి పొక్కులు, మంట, దురదతో ఇబ్బంది పడతారు. వాటినే చెమట పొక్కులు అంటారు. ఎండకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే వీటిని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తగ్గించుకోవచ్చు. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే తగ్గించుకునేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం. 

చెమట పొక్కులకు కారణాలు

చెమట పొక్కులు చెమట గ్రంధులు మూసుకుపోవడం వల్ల వస్తాయి. అంటే చెమట గ్రంధులు బ్లాక్ అయి.. చెమట చర్మం కింద చేరుకుంటుంది. ఆ ప్రదేశంలో మంట, దురదతో కూడిన పొక్కులు వస్తాయి. అలాగే తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆరదు. చర్మం తడిగా ఉండటంతో బ్యాక్టీరియా పెరిగి కూడా స్కిన్​పై ర్యాష్ వస్తుంది. 

వేసవిలో, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నైలాన్, పాలీస్టర్ వంటి బట్టలు వేసుకుంటే.. అవి గాలిని పాస్ చేయవు. దీనివల్ల చర్మానికి గాలి అందక పొక్కులు వస్తాయి. అలాగే పొడి చర్మాన్ని దూరం చేసుకోవడానికి మందపాటి క్రీములు రాయడం వల్ల పోర్స్ మూసుకుపోతాయి. ఇది కూడా చెమటపొక్కులకు కారణమే. 

ఎవరికి ఎక్కువ వస్తాయంటే.. 

పిల్లల్లో చెమట గ్రంధులు పూర్తి అభివృద్ధి చెందవు కాబట్టి వారికి త్వరగా హీట్ ర్యాష్ వస్తుంది. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల చర్మం మరింత వేడెక్కుతుంది. అలాంటివారికి కూడా ఇవి వస్తాయి. 

తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాలు.. 

చెమట పొక్కులు ఇబ్బంది పెడుతుంటే రోజుకు రెండు సార్లు చల్లటి నీటితో స్నానం చేయండి. సబ్బు తక్కువగా వాడాలి. అలాగే తాజా అలోవెరా జెల్‌ని నేరుగా పొక్కులపై రాస్తే.. ఇది నొప్పి, మంటను తగ్గించి చర్మాన్ని చల్లగా చేస్తుంది. రోజుకు 2–3 సార్లు చేస్తే ఉపశమనం ఉంటుంది. గంధం, రోజ్ వాటర్ కలిపి చర్మానికి అప్లై చేసి.. తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితాలు ఉంటాయి. 

వేప ఆకులు నీళ్లలో మరిగించి ఆ నీటిని చల్లార్చి స్నానం చేసే నీళ్లలో కలపండి. ఇలా చేస్తే శరీరంపై బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. పెరుగును చర్మానికి రాసి 10 నిమిషాల తర్వాత కడగండి. లోపల నుంచి కూలింగ్ కోసం రోజూ మజ్జిగ తాగండి. ధనియాలు నీళ్లలో మరిగించి తాగితే కూడా శరీరం లోపల నుంచి చల్లబడుతుంది. చల్లటి క్లాత్ పొక్కులపై 5 నుంచి 10 నిమిషాలు పెడితే మంట వెంటనే తగ్గుతుంది. ఇది అత్యంత సులభమైన ట్రీట్‌మెంట్​గా చెప్తారు.

రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో చెమటపొక్కులు రాకుండా ఉండాలంటే.. కాటన్ దుస్తులు మాత్రమే వేసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు మరింత మంచిది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగండి. చర్మానికి థిక్​గా ఉండే మాయిశ్చరైజర్స్, ఆయిల్స్ రాయకపోవడమే మంచిది. రాత్రి నిద్రకు ముందు చల్లని నీటితో స్నానం చేయండి. మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్యలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఏసీ లేదా ఫ్యాన్ గాలి బాగా తగిలేలా చూసుకోండి. 

పొక్కులు ఎక్కువగా వ్యాపించి.. వాటి నుంచి చీము వస్తోందని అనిపిస్తే.. జ్వరం ఉంటే వైద్య సహాయం తీసుకోండి. ఎందుకుంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్​ఫెక్షన్​కి దారితీస్తాయి. కాబట్టి సింపుల్ చిట్కాలతో సమస్యను దూరం చేసుకోండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget