Benefits of Radish: ముల్లంగి తినడం లేదా... మీకే నష్టం
ముల్లంగి కాస్త వగరుగా ఉంటుంది. అందుకని దాన్ని తినడం మానేస్తే మాత్రం మీకే నష్టం అని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు.
![Benefits of Radish: ముల్లంగి తినడం లేదా... మీకే నష్టం Health benefits of radish Benefits of Radish: ముల్లంగి తినడం లేదా... మీకే నష్టం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/8b9ed925f0e2fed9e9aef3d7624aa63c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ముల్లంగిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. కారణం దాని రుచే. అంతేకాదు ముల్లంగితో ఎక్కువ రకాల వంటలు చేయలేం. సాంబారులో వేసుకోవాలి లేదా వేపుడు చేసుకోవాలి. అలా చేసినా సరే దానిలోని వగరు పూర్తిగా పోదు. అందుకే చాలా మంది తమ డైట్ లో ముల్లంగికి స్థానమే ఇవ్వరు. పోషకాహార నిపుణులు మాత్రం ముల్లంగి తినకపోతే మనకే నష్టమని చెబుతున్నారు. దాన్ని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు.
ముల్లంగి తింటే పచ్చకామెర్లు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఇది కాలేయాన్ని కాపాడుతుంది. ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ సరఫరాను సక్రమంగా జరిగేలా చూస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి కాలేయం, పొట్ట విషయంలో చాలా శక్తిమంతమైన డిటాక్సిఫయర్ గా పనిచేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు ముల్లంగిని తినవచ్చు. ఎందుకంటే ఒక ముల్లంగిని తింటే కేవలం ఒక కెలరీ మాత్రమే శరీరానికి అందుతాయి. ఇందులో ఫ్యాట్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ కూడా ఉండవు. దీని ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.
ముల్లంగిలో ఉండే ఎంజైములు మన శరీరంపై దాడి చేసే ఫంగస్ ను చంపేస్తుంది. దీనిలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి.
చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ముల్లంగి సహకరిస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు, దద్దుర్లకు ఇందులో ఉండే పోషకాలు చెక్ పెడతాయి. అలాగే చర్మం పొడిగా మారడాన్ని కూడా నిరోధిస్తాయి.
ముల్లంగిలో ఉండే ఆంథోసైనిన్స్ గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా ఉండేలా చూస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయులను క్రమబద్దీకరిస్తాయి. అలాగే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచేందుకు కొలాజిన్ అవసరం. దాని ఉత్పత్తిని పెంచుతుంది ముల్లంగి.
అతి ఏదైనా అనర్థమే. అలాగే ముల్లంగిని అతిగా తింటే మాత్రం థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. దీన్ని అధికంగా తింటే థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగి, హార్మోన్ స్థాయిలు తగ్గుతాయని తేలింది. కనుక రోజూ తినకుండా వారానికి ఒకటి లేదా రెండు సార్లకు మించి తినకుండా ఉంటే సరి. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు కూడా ముల్లంగికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.
Also read: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని
Also read: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...
Also read: ఈ టీ తాగితే .. అందం అమాంతం పెరిగిపోతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)