Headache Tips: తలనొప్పి వేదిస్తోందా? మందులు వద్దు, ఈ చైనీస్ చిట్కాలతో తక్షణ ఉపశమనం!
తలనొప్పి వేదిస్తోందా? అయితే, అనవసరంగా మందులు వాడి భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవద్దు. ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

తలనొప్పి ఎంత బాధిస్తుందో తెలిసిందే. ఈ నొప్పి వల్ల ఏ పని చేయలేం. ఏదీ ఆలోచించలేం. చికాకు, కోపం, అసహనాన్ని కూడా తలనొప్పి ప్రేరేపిస్తుంది. మొత్తానికి తలనొప్పి మనిషిని మనిషిలా ఉండనివ్వదు. అయితే, తలనొప్పి వచ్చినప్పుడు మనం చాలా కూల్‌గా ఉండాలి. ఈ నొప్పితో పోరాడేందుకు మన ఫింగర్‌టిప్స్‌నే ఆయుధంగా మార్చుకోవాలి.
చాలామంది తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం మందులు తీసుకుంటారు. అయితే, మాత్రాలు అప్పటికప్పుడు ఉపశమనం కలిగించినా.. సమస్య మాత్రం పూర్తిగా తొలగిపోదు. పైగా అతిగా మాత్రలు మింగడం ఆరోగ్యానికి హానికరం కూడా. అందుకే, తలనొప్పిని తగ్గించడం కోసం చైనీయులు అనేక పద్ధతులు పాటిస్తున్నారు. ముఖ్యంగా చేతివేళ్లతోనే శరీరంలోని కొన్ని భాగాలను మర్దనా చేసి తలనొప్పి నుంచి ఉపశమనం పొందేవారు. మన శరీరంలోని కొన్ని సున్నితమైన ప్రెజర్ పాయింట్లను తాకడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి, ఆ ప్రెజర్ పాయింట్లు ఏమిటీ? ఏ విధంగా మసాజ్ చేయాలో చూడండి.
చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో..: చూపుడు వేలు, బొటన వేలుకు మధ్యలో ఉండే ప్రాంతాన్ని యూనివ్యాలీ పాయింట్ అని అంటారు. మీ కుడిచేతి బొటన వేలుతో ఎడమ చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో ఉండే ప్రాంతాన్ని 20 సెకన్లపాటు సున్నితంగా, ప్రెస్ చేసి గుండ్రంగా తిప్పండి. ఇది ఒత్తిడిని తగ్గించేందుకు సహకరిస్తుంది. కానీ, నొప్పి కలిగేంత గట్టిగా ఆ భాగాన్ని పట్టుకోవద్దు.
కళ్ల మధ్యలో.. ముక్కుపై: మీకు తలనొప్పి వచ్చినప్పుడు మీ చేతులు తెలియకుండానే కనుబొమ్మలు, కళ్లకు మధ్యలో ఉండే ముక్కు మీదకు వెళ్తాయి. అంటే, మీకు తెలియకుండానే మీరు తొలనొప్పి ఉపశమనానికి ప్రయత్నిస్తు్న్నారు. ఇకపై అదే కొనసాగించండి. మీరు తలనొప్పి వచ్చినప్పుడు పట్టుకొనే ముక్కు ప్రాంతాన్ని ‘డ్రిల్లింగ్ బాంబూ’ పాయింట్ అంటారు. తలనొప్పి వచ్చినప్పుడు మీరు మీ రెండు చూపుడు వేళ్లను ఉపయోగించి కళ్లకు మధ్యంలో ముక్కు భాగంపై కనీసం 15 సెకన్లు సున్నితంగా ప్రెస్ చేస్తూ మర్దనా చేయండి. దీనివల్ల తలనొప్పి, సైనస్ నొప్పులు తగ్గుతాయి.
కనుబొమ్మల మధ్య: దీన్నే ‘థర్డ్ ఐ’ అని అంటారు. కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతాన్ని మూడో కన్ను ప్రాంతం అంటారు. అక్కడ ఒక్క నిమిషంపాటు బొటన వేలు లేదా చూపుడు వేలుతో ఒత్తిడి చేయండి లేదా, రెండు వేళ్లతో మర్దనా చేయండి. దానివల్ల మీకు రిలీఫ్ లభించడమే కాకుండా తలనొప్పి కూడా తగ్గుతుంది.
Also Read: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!
భుజం వద్ద: ఇది మీ మెడకు దిగువున భుజానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రెజర్ పాయింట్ మీద ప్రెస్ చేసినట్లయితే తప్పకుండా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మిమ్మల్ని భుజం నొప్పి వేదిస్తున్నట్లయితే.. అదే ప్రెజర్ పాయింట్ మీద ప్రెస్ చేస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.
Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

