Hair Straightening: హెయిర్ స్ట్రెయిటనింగ్ ఉత్పత్తుల వల్ల గర్భాశయ క్యాన్సర్? హెచ్చరిస్తున్న కొత్త అధ్యయనం
జుట్టు స్ట్రెయిటనింగ్ చేసుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే వ్యసనం అనే చెప్పాలి. కానీ దాని వల్ల మహిళల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
జుట్టు అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకే వాటి సంరక్షణ కోసం మార్కెట్లో ఎన్ని ఉత్పత్తులు వచ్చినా సరే వెంటనే కొనేసి వాటిని ఉపయోగిస్తూనే ఉంటారు. అలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడం ఏమో కానీ ఉన్నది ఊడిపోయి పేలవంగా కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు తల స్నానం చేసిన వెంటనే హెయిర్ డ్రయర్ పెట్టుకోవడం అవసరమైనప్పుడల్లా హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటున్నారు. పార్లర్ కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే జుట్టు సంరక్షణకి కావలసిన పరికరాలు అన్ని అందుబాటులో ఉంటున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల మహిళలు ఎక్కువగా వీటి మీద ఆధారపడతారు. కానీ వాటిని అతిగా వినియోగించడం వల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
అధ్యయనం సాగింది ఇలా..
హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం కొన్ని రకాల క్రీములు, జెల్‌లు ఉపయోగించే వారి సంఖ్య పెరగింది. ఈ ఉత్పత్తుల్లోని రసాయనాల వల్ల ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకి చేయింది 35-74 సంవత్సరాల వయస్సు కలిగిన 33,497 మంది మహిళల్ని పరిశీలించారు. దాదాపు 11 సంవత్సరాల పాటు వాళ్ళని గమనించారు. ఆ సమయంలో 378 గర్భాశయ క్యాన్సర్ కేసులు నిర్ధారించారు. హెయిర్ స్ట్రెయిట్ నెర్ లని ఎప్పుడు ఉపయోగించని మహిళల్లో 1.65 శాతం 70 సంవత్సరాల వయసులో గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి చేశారని అంచనా వేశారు. అయితే ఈ ఉత్పత్తులు తరచూ వినియోగించే వారులో ప్రమాదం 4.05 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
హెయిర్ స్ట్రెయిటనింగ్ ఉత్పత్తులు వినియోగించని వారి కంటే వాడే వాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ అవకాశం రెండింతలు ఉన్నట్లు కనుగొన్నారు. హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉండే వాటి మీద పరిశోధకులు సమాచారాన్ని సేకరించలేదు. కానీ పారాబెన్, బస్పినాల్ ఏ, ఫార్మాల్డిహైడ్ వంటి స్ట్రెయిటనర్ ఉత్పత్తులలో కనిపించే అనేక రసాయనాలు గర్భాశయంలో ప్రమాదాన్ని పెంచడానికి దోహదం చేస్తాయని ఈ బృందం వెల్లడించింది.
మరికొన్ని పరిశోధనలు అవసరం
జుట్టు ఉత్పత్తుల ద్వారా గర్భాశయ క్యాన్సర్ వచ్చే దానికి సంబంధించి వివరాలు సేకరించేందుకు మరికొన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు బృందం వెల్లడించింది. వాటిలోని రసాయనాలు మహిళల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే నిర్దిష్ట రసాయనాలు గుర్తించడానికి లోతైన పరిశోధన అవసరం.
ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ నాలుగో స్థానంలో ఉంటుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కారణంగా ఈ క్యాన్సర్ వస్తుంది. మహిళల్లో అత్యధికంగా కనిపించేది రొమ్ము క్యాన్సర్ తర్వాత ఇదే ఎక్కువగా వస్తుంది. దీనికి సంబంధించి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ ప్రమాదకరంగా ఉంటుంది. నెలసరి క్రమం తప్పడం, గర్భం ధరించలేకపోవడం, వజీనా నుంచి రక్తస్రావం జరగడం వంటివి గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు. దీనికి సంబంధించిన వైరస్ శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ జుట్టు నిగనిగలాడాలా? హెన్నాను ఇలా అప్లై చేస్తే సాధ్యమే!