World Record: పొడవైన గోళ్లతో రికార్డు సృష్టించిన బామ్మ, ఆ గోళ్లను పెంచడం వెనుక కారణం తెలిస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటారు
ప్రతి ఏటా ఎన్నో రకాల గిన్నిస్ రికార్డుల నెలకొల్పుతుంటారు. ఈ ఏడాది పొడవైన గోళ్ల రికార్డు సృష్టించింది ఓ అమెరికన్ బామ్మ.
పొడవైన గోళ్లు... రెండు చేతులకున్నా గోళ్లను కలిపితే 42 అడుగులు ఉన్నాయిట. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. పీత కాళ్లలా పొడవుగా కనిపిస్తున్న ఈ గోళ్లను చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆమె పేరు డయానా. అమెరికాలో నివసిస్తోంది. గత పాతకేళ్లుగా ఆమె గోళ్లు కత్తిరించుకోలేదట. ఇకపై కూడా కత్తిరించుకోనని చెప్పేస్తోంది. గోళ్లు పెంచింది మాత్రం రికార్డు కోసం కాదని, అనుకోకుండా రికార్డు వరించిందని చెప్పింది. తాను గోళ్లు పెంచడం వెనుక చాలా బాధకరమైన గతం ఉందని వివరించింది.
Also read: ప్రాణాన్ని నిలబెట్టే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, వీటితో మరిన్ని ఉపయోగాలు
కూతురి జ్ఞాపకంగా
తన ముద్దుల కూతురి జ్ఞాపకంగా ఈ గోళ్లను పెంచుకుంటున్నట్టు చెబుతోంది డయానా. పాతికేళ్ల క్రితం 16 ఏళ్లే తన కూతురు ఓ రోజు రాత్రి తన గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టిందని, తరువాత వెళ్లి తన గదిలో నిద్రపోయిందని చెప్పింది. ఉదయం ఎంతకీ లేవలేదని, చూస్తే మరణించి ఉందని వివరించింది. నిద్రలోనే ఆమెకు ఆస్తమా తీవ్రంగా ఎటాక్ చేయడం వల్ల ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలిపింది. ముందు రోజు రాత్రే ఆమె నాకు గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టిందని, ఆ గోళ్లను కత్తిరించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. గోళ్లు పెరుగుతున్న కొద్దీ తన కూతురు తనతోనే ఉన్నట్టు అనిపిస్తుందని వివరించింది.
Also read: ఈ దేశాలకు వీసా దొరకడం చాలా కష్టమట, ఆ దేశాలేంటో తెలిస్తే షాక్ తింటారు
డయానా ఇప్పటికీ తన గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టించుకుంటుంది. ఆ గోళ్లకు నెయిల్ పాలిస్ పెట్టాలంటే అయిదారు గంటలు పడుతుందని, తన మనవలు చాలా ఓపికగా పెడతారని తెలిపింది. కనీసం ఇరవై నుంచి ముప్పై నెయిల్ పాలిష్ డబ్బాలు అవసరం పడతాయని చెబుతోంది.
View this post on Instagram