Burger: ఏవండోయ్ ఇది విన్నారా? బర్గర్ ఆరోగ్యకరమైన ఆహారమేనట, అదెలాగో తెలుసా?
మీరు జంక్ ఫుడ్ ప్రియులా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఇప్పటి వరకు బర్గర్ తింటే అనారోగ్యమని అన్నారు కానీ ఇప్పుడు ఆరోగ్యకరమైన డైట్ అని చెబుతోంది కొత్త అధ్యయనం.
పిజ్జా.. బర్గర్.. ఫ్రెంచ్ ఫ్రైస్.. వీటిని పేరు చెప్తేనే చాలా మందికి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. చిన్న పిల్లలు కూడా వీటిని ఏంటి ఇష్టంగా ఆరగించేస్తారు. కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించేవేనని గతంలో ఎన్నో అధ్యయనాలు హెచ్చరించాయి. మరి ఇప్పుడు.. బర్గర్ ఆరోగ్యరకరమైన ఆహారంలో భాగం కావచ్చని పరిశోధకులు అంటున్నారు. ఇది బర్గర్ ప్రియులకి ఒక రకంగా శుభవార్తే.
చికెన్, రెడ్ మీట్ ఛీజ్ తో చేసిన బర్గర్ తింటుంటే ఎంత బాగుంటుందో కదా. మునుపటి అధ్యయనాలు ప్రాసెస్ చేసిన మాంసం, బేకన్, సాసేజ్, సలామీ వంటివి తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ తో ముడి పడి ఉన్నాయని వెల్లడించాయి. జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపాయి. కానీ తాజా పరిశోధన మాత్రం రెడ్ మీట్, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు ఆరోగ్యంపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపవని సూచిస్తున్నాయి. 80 దేశాలలో ఆహారాలు, ముందస్తు మరణాలు, స్తరవకులు, గుండె జబ్బుల రేట్లని పోల్చి కెనడియన్ అధ్యయనం దీన్ని కనుగొన్నది.
సగటున ఎవరైతే పండ్లు, మాంసాహారం, చేపలు, గింజలు, చిక్కుళ్ళు, బీన్స్ వంటి ఆహారం తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు చిన్న వయసులో చనిపోయే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే వీటిలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడతాయి. రోజుకి 85 గ్రాముల రెడ్ మీట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. అయితే ఇది తప్పనిసరిగా స్టీక్, చాప్స్ లేదా తాజా బర్గర్ లను తయారు చేయడానికి ఉపయోగించే గొడ్డు మాంసం మాత్రం ప్రాసెస్ చేయనిది అయి ఉండాలి.
కాస్త మంచిదే
కొద్ది మొత్తంలో మాంసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమేనని మెక్ మాస్టర్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఆండ్రూ మెంటే చెప్పుకొచ్చారు. అలాగే రెండు సేర్విన్గ్స్ పూర్తి కొవ్వు పాలతో చేసిన బటర్, పాలు, పెరుగు వంటివి తీసుకుంటే కొన్ని రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. న్యూట్రిషన్ లేబుల్స్ కొవ్వు, సంతృప్త కొవ్వులు తగ్గించే దాని మీద పరిశోధనలు చేశాయి. కానీ మా పరిశోధనలు మాత్రం గింజలు, చేపలు, పాలు వంటి రక్షిత ఆహారాలు తీసుకోవడం కలిగే ప్రయోజనాలని తెలుసుకునేందుకు, వాటి ప్రాధాన్యతని గుర్తించేందుకు జరిగాయని డాక్టర్ మెంటే సూచిస్తున్నారు.
గతంలో ఫ్రెంచ్ ఫ్రైస్ బంగాళాదుంపలతో కాకుండా వేరే పదార్థాలతో చేసుకుని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు వెల్లడించారు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంపల కంటే స్వీట్ పొటాటో(చిలగడ దుంప)లతో చేసుకుని తినొచ్చు. ఇవి పోషకాలని అందిస్తాయి. అయితే వీటిని నూనెలో కాకుండా ఆవిరితో ఉడికించుకుని తినాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ ఆహార పదార్థాలు రుచిగా ఉండాలంటే ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial