Fridge: ఈ ఆహార పదార్థాలు రుచిగా ఉండాలంటే ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు
కొంతమంది తెలియక కూరగాయలు, పచ్చళ్లు, కూరలు అన్నీ తీసుకెళ్ళి ఫ్రిజ్ లో నిల్వ చేసేస్తారు. కానీ అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.
ఇప్పుడు ఫ్రిజ్ లేని ఇల్లు లేదు. ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ తప్పనిసరిగా ఫ్రిజ్ ఉంటుంది. అనేక ఆహార పదార్థాలు నిల్వ చేసుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది మాత్రం అందులో పెట్టకూడదని వస్తువులు కూడా పెట్టేస్తూ ఉంటారు. రాత్రిపూట మిగిలిపోయిన కూరలు, అన్నాలు పెట్టడం వల్ల దానికి సద్ది పెట్టె అనే పేరు తీసుకొచ్చేశారు. అది అసలు కరెక్ట్ కాదు. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టకపోవడమే మంచిది. లేదంటే వాటి ఆకృతి, రుచి, నాణ్యత దెబ్బతింటుంది. ఫ్రిజ్ లో ఎప్పుడూ ఉంచడకూడని కొన్ని ఆహారాల జాబితా ఇది..
బంగాళాదుంపలు
బంగాళాదుంపలు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయడం వల్ల వాటి పిండి పదార్థాలు త్వరగా చక్కరలుగా మారతాయి. ఫలితంగా తీపి రుచి వస్తుంది. అందుకే వాటిని ఫ్రిజ్ లో కంటే చల్లని సెల్లార్ లేదా చీకటి ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్ లోని తేమ కారణంగా బంగాళాదుంపలు మొలకలు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఉల్లిపాయలు
ఫ్రిజ్ లోని తేమ కారణంగా ఉల్లిపాయలు మెత్తగా అయిపోయి బూజు పడతాయి. అంతే కాదు వాటి ఘాటైన వాసన ఫ్రిజ్ లో నిల్వ చేసిన ఇతర ఆహార పదార్థాలకి అంటుకుంటుంది. అందుకే వాటిని మంచి వెంటిలేషన్ ఉన్న చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.
బ్రెడ్
సాధారణంగానే బ్రెడ్ జీవితకాలం చాలా తక్కువ. దీని ఫ్రిజ్ లో పెడితే అది గట్టిగా అయిపోతుంది. స్టాలింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. పొడిగా మారిపోయి తాజాదనాన్ని కోల్పోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బ్రెడ్ ని బ్రెడ్ బాక్స్ లో పెట్టుకోవచ్చు. అది పాడైపోకుండా ఉండాలంటే త్వరగా వాడుకోవడం మంచిది.
టొమాటో
అందరూ చేసే మొదటి తప్పు ఇదే. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాగానే టొమాటో బయట ఉంటే చెడిపోతాయని త్వరగా కవర్ లో పెట్టేసి ఫ్రిజ్ లో పెట్టేస్తారు. కానీ చల్లని ఉష్ణోగ్రతలు టొమాటో రుచి, ఆకృతిని మారచేస్తాయి. వాటిని మెత్తగా చేసి రుచి చప్పగా మారుస్తుంది. టొమాటో రుచిని కాపాడుకోవాలంటే వాటిని సూర్యకాంతి నుంచి దూరంగా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం మంచిది.
తేనె
తేనె షెల్ఫ్ జీవితం ఎక్కువ. దానికి శీతలీకరణ అవసరం లేదు. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల తేనె చిక్కగా మారిపోతుంది. దాని స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం చల్లని గదిలో లేదా అల్మారాలో నిల్వ చేసుకోవచ్చు.
కాఫీ
చాలా మంది కాఫీ పొడి ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత బయట పెడితే గడ్డ కట్టిపోతుందని ఫ్రిజ్ లో పెట్టేస్తారు. కానీ అందులోని తేమ వల్ల వాసన, రుచి తగ్గిపోతుంది. కాఫీ తాజాదనం, సువాసన అలాగే ఉండాలంటే చీకటి అల్మారాలో గాలి చొరబడని కంటైనర్ లో భద్రపరుచుకోవాలి.
వేడి సాస్, మసాలా
వేడి సాస్, కెచప్, ఆవాలు ఇలాంటి మసాలాలు గది ఉష్ణోగ్రత వద్ద చెడిపోకుండా ఉంటాయి. ఫ్రిజ్ లో పెడితే అందులోని చల్లని వాతావరణం మసాలాలు చిక్కగా చేసి రుచిని ప్రభావితం చేస్తుంది. లేబుల్ మీద వీటిని ఫ్రీజ్ చేయాలని సిఫార్సు చేస్తే తప్ప ఫ్రిజ్ లో పెట్టకూడదు. బయట అల్మారాలో వీటిని నిల్వ చేసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పండ్లు ఇలా తిన్నారంటే ఈజీగా బరువు తగ్గిపోతారు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial