అన్వేషించండి

Gond vs Gond Katira : సమ్మర్​లో గోంద్ తీసుకోకూడదు గోంద్ కటిరా బెస్ట్.. ఈ రెండిటీ మధ్య తేడాలు, బెనిఫిట్స్ ఇవే

Gond and Gond Katira Health Benefits : వేసవి వేడిని తగ్గించుకునేందుకు గోంద్ కతిరా తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే గోంద్ మాత్రం తీసుకోకూడదట. అదేంటి రెండూ ఒకటి కాదా? మరి తేడాలు ఏంటో చూసేద్దామా?

Difference Between Gond and Gond Katira : వేసవి వేడిని తగ్గించుకుకోవడానికి వివిధ రకాల ఫుడ్స్​ని సమ్మర్​ డైట్​లో చేర్చుకుంటారు. వాటిలో గోంద్ కటిరా కూడా ఒకటి. అయితే గోంద్ కటిరా అని కొనేప్పుడు చాలామంది గోంద్​ని కొనేస్తారు. చూడడానికి కూడా ఇవి కాస్త దగ్గరపోలికతో ఉంటాయి. కానీ రెండూ ఒకటి కాదట. ఇవి రెండూ కూడా సహజమైన గమ్ములు. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. గోంద్​ని మాత్రం సమ్మర్​లో తీసుకోకూడదట. మరి ఈ గోంద్, గోంద్ కటిరా మధ్య తేడాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. 

గోంద్ అంటే ఏమిటి?

గోంద్ చూడడానికి షైనీగా, చూసేందుకు గాజు మాదిరిగా.. ట్రాన్స్​పరెంట్​గా కనిపిస్తుంది. దీనిని నల్ల తుమ్మ చెట్టునుంచి తీస్తారు. తుమ్మ జిగురునే గోంద్ అంటారు. ఇది కాస్త బ్రౌన్ కలర్​లో ఉంటుంది. దీనిని ఎడిబుల్ గమ్​ అని కూడా అంటారు. దీనికి రుచి, వాసన ఉండదు. నీటిలో కరిగిపోయే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయితే దీనిని శీతాకాలంలో ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. అలాగే శక్తిని కూడా పెంచి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేడిని పెంచుతుంది కాబట్టి దీనిని సమ్మర్​లో తీసుకోకూడదు.

గోంద్ ప్రయోజనాలు.. 

ఈ గోంద్​ను లడ్డూల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే ప్రసవం తర్వాత బాలింతలకు త్వరగా కోలుకునేందుకు ఇస్తారు. గోంద్​లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండర బలానికి మంచిది. ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. శరీరానికి బలం అందించి మెటబాలీజం పెంచుతుంది. దీనివల్ల యాక్టివ్​గా ఉంటారు. బరువు తగ్గుతారు. మోకాళ్లలో జిగురు తగ్గినవారు కూడా దీనిని తీసుకోవచ్చు.

గోంద్ కతిరా

గోంద్ కతిరాను ఆల్మండ్ గమ్ అంటారు. ఇది చూడడానికి గోంద్ కంటే డల్​గా ఉంటుంది. ట్రాన్స్​పరెంట్​గా ఉండదు. దీనికి శరీరంలోని వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. అందుకే దీనిని సమ్మర్​లో తీసుకుంటారు. దీనిని నీటిలో నానబెడితే జెల్లీలా మారుతుంది. మృదువుగా, చప్పగా ఉంటుంది. 

గోంద్ కతిరా ప్రయోజనాలు.. 

గోంద్ కతిరాను సమ్మర్​లో శరబత్​ చేసుకుని లేదా ఫలూదా లేదా ఇతర డ్రింక్స్​లలో కలిపి తీసుకోవచ్చు. శరీరంలోని వేడిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. చర్మ సంరక్షణ అందిస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బరువు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

గోంద్​, గోంద్ కతిరా రెండూ ఆరోగ్యానికి మంచివే. గోంద్​ను సమ్మర్​లో వాడకూడదు. గోంద్ కతిరాను నానబెట్టకుండా వాడకూడదు. అవసరాన్ని బట్టి వీటిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే.. ఎంత మంచిదైనా దానిని లిమిటెడ్​గా తీసుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Ministers Meeting: సీఎం రేవంత్ విదేశాల్లో ఉండగా భట్టితో మంత్రుల భేటీ.. ఆశ్చర్యం ఏముందన్న టీపీసీసీ చీఫ్
సీఎం రేవంత్ విదేశాల్లో ఉండగా భట్టితో మంత్రుల భేటీ.. ఆశ్చర్యం ఏముందన్న టీపీసీసీ చీఫ్
Bank Unions Strike: నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు.. వారి ప్రధాన డిమాండ్లు ఇవే
నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు.. వారి ప్రధాన డిమాండ్లు ఇవే
YS Jagan: పదవి లేకపోతే వైఎస్ జగన్ జాతీయపతాకం ఆవిష్కరించరా? - రాజ్యాంగ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటారు?
పదవి లేకపోతే వైఎస్ జగన్ జాతీయపతాకం ఆవిష్కరించరా? - రాజ్యాంగ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటారు?
Jana Nayagan Release Date : విజయ్ 'జన నాయగన్'కు మళ్లీ షాక్ - మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు... రిలీజ్ మరింత ఆలస్యం
విజయ్ 'జన నాయగన్'కు మళ్లీ షాక్ - మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు... రిలీజ్ మరింత ఆలస్యం

వీడియోలు

Sunil Gavaskar About T20 World Cup | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు
Washington Sunder Fitness Update | వాషింగ్టన్ సుందర్ ఫిట్ నెస్ అప్డేట్
Tilak Varma in T20 World Cup | వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అందుబాటులో తిలక్ వర్మ ?
Nat Sciver Brunt Century WPL 2026 | మహిళా ఐపీఎల్‌‌లో నాట్ సీవర్ తొలి సెంచరీ!
RANABAALI Decode | Vijay Deverakonda Rashmika తో Rahul Sankrityan పీరియాడికల్ డ్రామా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ministers Meeting: సీఎం రేవంత్ విదేశాల్లో ఉండగా భట్టితో మంత్రుల భేటీ.. ఆశ్చర్యం ఏముందన్న టీపీసీసీ చీఫ్
సీఎం రేవంత్ విదేశాల్లో ఉండగా భట్టితో మంత్రుల భేటీ.. ఆశ్చర్యం ఏముందన్న టీపీసీసీ చీఫ్
Bank Unions Strike: నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు.. వారి ప్రధాన డిమాండ్లు ఇవే
నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు.. వారి ప్రధాన డిమాండ్లు ఇవే
YS Jagan: పదవి లేకపోతే వైఎస్ జగన్ జాతీయపతాకం ఆవిష్కరించరా? - రాజ్యాంగ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటారు?
పదవి లేకపోతే వైఎస్ జగన్ జాతీయపతాకం ఆవిష్కరించరా? - రాజ్యాంగ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటారు?
Jana Nayagan Release Date : విజయ్ 'జన నాయగన్'కు మళ్లీ షాక్ - మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు... రిలీజ్ మరింత ఆలస్యం
విజయ్ 'జన నాయగన్'కు మళ్లీ షాక్ - మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు... రిలీజ్ మరింత ఆలస్యం
Haka Dance in Medaram: మేడారం జాతరలో న్యూజిలాండ్ మావోరీల ప్రదర్శించిన 'హాకా' నృత్యం గురించి ఆశ్చర్యపోయే విషయాలు
మేడారం జాతరలో న్యూజిలాండ్ మావోరీల ప్రదర్శించిన 'హాకా' నృత్యం గురించి ఆశ్చర్యపోయే విషయాలు
Devara 2: దేవర సీక్వెల్ ఆగలేదు... షూటింగ్, రిలీజ్ అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత
దేవర సీక్వెల్ ఆగలేదు... షూటింగ్, రిలీజ్ అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత
Shamshabad Airport: బస్సు, రైలులాగ అనుకుని విమానం ఎక్కితే కిందకు దించేశారు.. శంషాబాద్‌లో విచిత్ర సంఘటన 
బస్సు, రైలులాగ అనుకుని విమానం ఎక్కితే కిందకు దించేశారు.. శంషాబాద్‌లో విచిత్ర సంఘటన 
Medaram Jatara: 750 మంది కోయ వంశీయుల చరిత్ర.. 7 వేల శిల్పాలతో అద్భుతంగా స్వాగతం పలుకుతున్న మేడారం
750 మంది కోయ వంశీయుల చరిత్ర.. 7 వేల శిల్పాలతో అద్భుతంగా స్వాగతం పలుకుతున్న మేడారం
Embed widget