Devara 2: దేవర సీక్వెల్ ఆగలేదు... షూటింగ్, రిలీజ్ అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత
Devara 2 Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. 'దేవర' సీక్వెల్ ఆగలేదు. ఆ మూవీ షూటింగ్, రిలీజ్ అప్డేట్స్ ఇచ్చారు నిర్మాత సుధాకర్ మిక్కిలినేని.

ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాన్సంట్రేషన్ అంతా 'డ్రాగన్' మీద ఉంది. 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2', 'సలార్' వంటి పాన్ ఇండియా యాక్షన్ బ్లాక్ బస్టర్స్ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అందులో క్యారెక్టర్ కోసం వెయిట్ తగ్గుతున్నారు, మళ్ళీ కొన్ని రోజులకు పెరుగుతున్నారు. లుక్స్ పరంగా వేరియేషన్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ సినిమా సంగతి ఓకే. మరి, 'దేవర 2' వర్క్ ఎంత వరకు వచ్చింది? అంటే... అభిమానులకు ఒక గుడ్ న్యూస్.
మే నుంచి 'దేవర 2' రెగ్యులర్ షూటింగ్!
Devara 2 Regular Shooting Update: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా 'దేవర'. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే 'దేవర 2' గురించి తర్వాత అప్డేట్ లేదు. ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని, పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపించాయి. అటువంటిది ఏమీ లేదని అప్పుడప్పుడూ పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు చిత్ర నిర్మాత అధికారికంగా అప్డేట్ ఇచ్చారు.
Also Read: మొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?
మే నుంచి 'దేవర' రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతామని సుధాకర్ మిక్కిలినేని చెప్పారు. సో, అప్పటికి 'డ్రాగన్' షూట్ ఎన్టీఆర్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
మరి 'దేవర 2' విడుదల ఎప్పుడు గురూ?
Devara 2 Release Date: 'దేవర 2' షూట్ గురించి మాత్రమే కాదు... మరొక అప్డేట్ కూడా ఇచ్చారు సుధాకర్ మిక్కిలినేని. సినిమా విడుదల గురించి ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది (2027) విడుదల అవుతుందని, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పారు. జనగాంలో జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన ఈ విషయాలు చెప్పారు. అదీ సంగతి.
'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం' చిత్రానికి రచయితగా పని చేయడంతో పాటు 'జనతా గ్యారేజ్' చిత్రానికి దర్శకత్వం వహించారు ఆయన. ఎన్టీఆర్, కొరటాల కలయికలో 'దేవర' హ్యాట్రిక్ హిట్ అని చెప్పాలి. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై నందమూరి కళ్యాణ్ రామ్, కొరటాల శివ ప్రొడ్యూస్ చేశారు.


















