Gobi Manchuriyan : గోబీ మంచూరియాపై నిషేదం.. బట్టలు ఉతికే పౌడర్‌తో వంటకాన్ని చేస్తున్న వైనం
Gobi Manchuriyan is Banned : గోబీ మంచూరియా అంటే మీకు బాగా ఇష్టమా? అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే గోవాలో గోబీ మంచూరియా తినొద్దు అంటూ దానిపై నిషేదం విధించారు.
Goa Gobi Manchuriyan : వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కూడా ఇష్టంగా తినే స్నాక్స్‌లలో గోబీ మంచూరియా ఉంటుంది. చికెన్ మంచూరియా కంటే.. గోబీ మంచూరియాను తినేవారి సంఖ్య కాస్త ఎక్కువే. ఈవెనింగ్ స్నాక్స్‌గా దీనిని తీసుకునేవారు చాలామంది ఉంటారు. అందుకే దాదాపు అన్ని ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో దీనిని విక్రయిస్తారు. అయితే గోవాలో మాత్రం గోబీ మంచూరియాపై నిషేదం పడింది. దీనిని అమ్మవద్దు, తినవద్దు అంటూ నిబంధనలు విధించింది. ఇంతకీ గోబీ మంచురియా తింటే కలిగే ప్రమాదమేంటి? అక్కడ ఎందుకు దీనిపై నిషేదం విధించారు? మరి ఇక్కడ దానిని తినొచ్చా?
మీకు గోబీ మంచూరియా ఇష్టమా?
గోవాలో ఎంజాయ్ చేసేందుకు చాలామంది వెళ్తూ ఉంటారు. అప్పుడు కాస్త నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలన్నా.. అప్పటికప్పుడు ఆకలి తీర్చుకోవాలన్నా ఫుడ్స్టాల్స్కి వెళ్లి గోబీ మంచూరియా ఆర్డర్ చేస్తారు. మీరు కూడా అలాంటి గోబీ మంచూరియా లవర్స్ అయితే కాస్త ఆగండి. సింథటిక్ కలర్స్, పరిశుభ్రతపై ఆందోళనల కారణంగా గోవాలోని మపుసా మున్సిపల్ కౌన్సిల్ ఈ వంటకాన్ని స్టాల్స్ మెనూ నుంచి నిషేదించింది. మపుసా కౌన్సిలర్ తారక్ అరోల్కర్ జనవరి చివరిలో ఈ డిష్‌ను నిషేదించాలని.. దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వగా.. కౌన్సిల్ వాటిని త్వరగా అంగీకరించి.. ఈ డిషన్‌ను నిషేదించింది.
కలర్స్, కెమికల్స్
ఇక్కడ గోబీ మంచూరియా చేయడంలో అస్సలు పరిశుభ్రతను పాటించట్లేదని.. సింథటిక్ రంగుల వినియోగం బాగా ఎక్కువ ఉంటుందని, సాస్‌లలో వివిధమైన కెమికల్స్ ఉంటున్నాయని.. బట్టలు ఉతకడానికి ఉపయోగించే పౌడర్ని కలుపుతున్నారని మపుసా తెలిపింది. వీటివల్ల దానిని తింటున్నవారు అనారోగ్యాలకు గురి అవుతున్నట్లు గుర్తించారు. విక్రేతలు వినియోగానికి హానికరమైన, నాణ్యత లేని సాస్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. డిస్ప్లేలో నాణ్యమైన సాస్‌ను ఉంచి.. వంటలో మాత్రం నాణ్యతలేని వాటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పిండి విషయంలో కూడా మొక్కజొన్న పిండితో పాటు.. రకరకాల పొడులను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.
బట్టల పౌడర్
బట్టలు ఉతకడానికి వినియోగించే పౌడర్‌ను కూడా గోబీ మంచూరియా తయారీలో వినియోగిస్తున్నట్లు తేలింది. అందుకే తక్కువ ధరకే గోబీ మంచూరియాను అమ్మేస్తున్నట్లు తెలిపారు. అయితే గోవాలో గోబీ మంచూరియాపై నిషేదం జరగడం ఇది తొలిసారి ఏమి కాదు. 2022లో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ దీనిని నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకే మీరు గోవా వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. పొరపాటున కూడా గోబీ మంచూరియా ఆర్డర్ చేయకండి. ఎందుకంటే అక్కడివారికి దీనిపై అవగాహన ఉంటుంది కానీ.. టూరిస్ట్‌లకు తెలియదని అమ్మినా అమ్మేస్తారు. ఇలాంటి స్టాల్స్‌లో ఏదైనా ఆర్డర్ చేసేముందు వారు ఎలా చేస్తున్నారో చూసి దానికి అనుగుణంగా మీ మెనూని ఫిక్స్ అవ్వండి.
ఈ నేషదం కేవలం గోవావరకే ఉంది. ఒకవేళ మీరు దీనిని ఇతర ప్రాంతాల్లో తినాలనుకుంటే.. ఎందుకైనా మంచిది ఓసారి వాళ్లు ఎలా దానిని తయారు చేస్తున్నారో చూసి.. అప్పుడు వాటిని తినండి. లేదంటే ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగే అవకాశముంది. ఈ గొడవలేకుండా మీకు గోబీ మంచూరియా ఇష్టం ఉంటే.. చక్కగా దానిని రెసిపీని నేర్చుకుని.. శుభ్రంగా ఇంట్లోనే తయారు చేసుకుని హాయిగా లాగించేయండి.
Also Read : డెస్క్ జాబ్‌వల్ల బరువు పెరుగుతున్నారా? ఈ టిప్స్‌తో ఫిట్‌గా మారిపోండి