Office Exercises : డెస్క్ జాబ్‌వల్ల బరువు పెరుగుతున్నారా? ఈ టిప్స్‌తో ఫిట్‌గా మారిపోండి
Desk Job Exercises : డెస్క్ జాబ్‌లు చేసే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువైతున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నారు. అయితే డెస్క్‌లోనే ఉంటూ హెల్తీ ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు.
Weight Loss Tips : శారీరక శ్రమ లేకుండా.. మానసికంగా స్ట్రెస్ తీసుకుంటూ చేసే ఉద్యోగాలనే డెస్క్ జాబ్‌లు అంటారేమో. ఎందుకంటే శారీరక శ్రమ లేదు అనే మాటే తప్పా.. ఈ డెస్క్ జాబ్‌ల వల్ల ఎందరో ఆరోగ్య సమస్యలు పొందుతున్నారు. పని కోసం గంటలు కొద్ది తమ డెస్క్‌ల్లో కూర్చోని కాలం గడిపేస్తున్న చాలామందిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అవి దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు దారి తీస్తున్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగి పోవడం, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లింగబేధం లేకుండా బరువు అనేది అందరిలో కామన్ ఇష్యూ అయిపోంది. మీరు కూడా డెస్క్ జాబ్ వల్ల బరువు పెరిగిపోతున్నారా? అయితే కొన్ని టిప్స్ పాటిస్తూ మీ కేలరీలను బర్న్ చేసి.. ఆరోగ్యకరమైన బరువును మీరు పొందవచ్చు. డెస్క్ దగ్గరున్నప్పుడు కూడా కేలరీలు బర్న్ చేసే అనేక టెక్నిక్స్ ఉన్నాయి. వీటిని మీ వర్క్ రోటీన్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆ టిప్స్ ఏంటంటే..
బ్రేక్ తీసుకోండి..
చాలా మంది వర్క్ ఉంది.. అవ్వట్లేదని.. పని ఒత్తిడితో డెస్క్‌లకే పరిమితమైపోతారు. ఎవరైనా కొలిగ్స్ వచ్చి అలా వెళ్లి వద్దామన్నా.. మీరు వెళ్లండి నాకు వర్క్ ఉందని పనిలో నిమగ్నమైపోతారు. ఇలా చేయడాన్ని పూర్తిగా మానుకోండి. వర్క్‌ను పక్కన పెట్టేయమని కాదు కానీ.. కాస్త బ్రేక్ తీసుకుంటే మీరు ఇంకా ఉత్సాహంతో పనిని కంప్లీట్ చేయగలరు. ఇలా బ్రేక్ తీసుకుని.. కూర్చీ నుంచి లేవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. లేచినప్పుడు వీలైతే శరీరాన్ని కాస్త స్ట్రెచ్ చేయండి.
డెస్క్ వ్యాయామాలు
కండరాలను కదిలించేందుకు, కేలరీలను బర్న్ చేసేందుకు మీరు కొన్ని డెస్క్ వ్యాయామాలు చేయొచ్చు. లెగ్ లిఫ్ట్‌లు, చైర్ స్క్వాట్స్లు, డెస్క్ పుష్ అప్లు వంటి సాధారణ వ్యాయామాలు చేయొచ్చు. ఇవి మీకు ఒత్తిడిని కూడా తగ్గించి.. పని మీద ఫోకస్ పెట్టేందుకు హెల్ప్ చేస్తాయి.
మెట్లు ఎక్కండి..
దాదాపు అన్ని ఆఫీస్‌లలో మెట్లు, ఎలివేటర్లు ఉంటాయి. మీకు కుదిరినప్పుడు మెట్లు ఎక్కేందుకు, దిగేందుకు ప్రయత్నించండి. దీనివల్ల కేలరీలు బర్న్ అవ్వడమే కాకుండా కండరాల్లో కదలిక, మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. ఇలా చేయడం వల్ల మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
కోర్ మీద ఫోకస్
కేలరీలను బర్న్ చేయడానికి మీరు మీ భంగిమను మెరుగుపరచుకోవడానికి నిటారుగా కూర్చోవచ్చు. దానికి అనుగుణంగా మీ కోర్ కండరాలను నిమగ్నం చేయండి. ఇది సింపుల్‌గా ఉన్నా.. చాలా ఎఫెక్టివ్‌గా ప్రభావం చూపిస్తుంది.
నీరు తాగండి..
హైడ్రేటెడ్‌గా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డెస్క్ జాబ్‌లు చేసే వారు చాలామంది నీళ్లు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. గంటల కొద్ది నీటికి దూరంగా ఉంటారు. అలా కాకుండా అలారమ్ పెట్టుకునైనా సరే.. నీటిని తాగాలి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వార శరీరం ఎక్కువకేలరీలను బర్న్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది.
డీప్ బ్రీత్లు..
డెస్క్ దగ్గరున్నప్పుడు మీరు డీప్ బ్రీత్లు తీసుకోవచ్చు. ఈ డీప్ బ్రీత్లు మీ కండరాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాకుండా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మీకు తెలుసా? మనం బ్రీత్లు కరెక్ట్‌గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ సింపుల్ టిప్స్, అలవాట్లను మీ పని వేళల్లో ఫాలో అయితే మీరు కేలరీలను బర్న్ చేస్తూ.. ఆరోగ్యంగా ఉంటారు. ఇవి మీ శరీరానికే కాదు.. మీ వర్క్‌ని మెరుగుపరచడంలో, మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి.
Also Read : మీకు డయాబెటిస్ ఉంటే బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఆ తప్పులు అస్సలు చేయకండి