నాన్నకు స్విగ్గీలో జాబ్ వచ్చిందట - ఆ చిన్నారి ఆనందాన్ని చూస్తే, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్!
తండ్రీ, కూతురు అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. తండ్రికి ఉద్యోగం వచ్చిందని తెలిసి ఆ చిన్నారి వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అంతా ఫిదా అవుతున్నారు.
![నాన్నకు స్విగ్గీలో జాబ్ వచ్చిందట - ఆ చిన్నారి ఆనందాన్ని చూస్తే, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్! Girl Jumps With Joy After Dad Lands Job At Swiggy, Wins Hearts Online నాన్నకు స్విగ్గీలో జాబ్ వచ్చిందట - ఆ చిన్నారి ఆనందాన్ని చూస్తే, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/b47aaeaaa49458f4f09d550bf1236fac1666097006374239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తండ్రీ కూతుళ్ల అనుబంధం చాలా ప్రత్యేకమైనది. కూతురు పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన తర్వాత కూడా తన బాగోగుల కోసం తాపత్రయపడుతూనే ఉంటాడు తండ్రి. సాధారణంగా కూతురుకు ఉద్యోగం వస్తే తండ్రి పడే సంతోషాన్ని మనం చూసే ఉంటాం. కానీ తండ్రికి ఉద్యోగం వచ్చినప్పుడు కూతురు పడే సంతోషాన్ని మీరెప్పుడైనా చూశారా? దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవడంతో ప్రతీ వీడియో సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో కొన్ని నవ్వు తెప్పించేవి ఉంటే, కొన్ని బాధాకరమైనవిగా, కొన్ని కన్నీళ్లు తెప్పించేవి ఉంటాయి. అలాంటి వీడియోల్లో ఇప్పుడు చూడబోయే వీడియో మనసును హత్తుకుంటుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఈ వీడియోలో స్కూల్ యూనిఫాం వేసుకున్న ఓ చిన్న పాప తన చేతులతో కళ్లు మూసుకోగా.. ఆమె తండ్రి స్విగ్గీ టీ-షర్ట్‌తో తన ముందుకొచ్చాడు. కళ్లు తెరిచిన ఈ చిన్నారి తన తండ్రికి స్విగ్గీలో కొత్త ఉద్యోగం వచ్చిందని తెలుసుకుని ఆనందంతో ఎగిరి గంతులేసింది. పట్టరాని సంతోషంతో తండ్రిని హత్తుకుంది. ఆ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వీడియోను పూజా అవంతిక అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన క్షణాల్లోనే కొన్ని లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో గురించి నెటిజన్లు మాట్లాడుతూ ఆ వీడియోలో చిన్నారి ఆనందం వెలకట్టలేనిదని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు ఆ తండ్రీ కూతురి బంధం చాలా బాగుందని మరొకరు ప్రశంసించారు. చిన్నారి ముఖంలోని సంతోషం చూసి అందరూ సంతోషపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: మీకు తెలుసా? చేతిరాతను చూసి ఆరోగ్యం, మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు, ఇదిగో ఇలా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)