అన్వేషించండి

Health and Hand Writing: మీకు తెలుసా? చేతిరాతను చూసి ఆరోగ్యం, మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు, ఇదిగో ఇలా!

చేతి రాతను అధ్యయనం చేసే శాస్త్రం పేరు గ్రాఫాలజీ. దీని ప్రకారం చేతిరాతతో మన అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చట. వాటిని చేతిరాత ద్వారా ఎలా పరిష్కరించుకోవాలో కూడా చెబుతున్నారు గ్రాఫాలజిస్టులు.

కొందరి చేతిరాత చూస్తే కడిగిన ముత్యంలా ఉంటుంది. మరికొందరిది గజిబిజిగా గందరగోళంగా ఏమీ అర్థంకాకుండా ఉంటుంది. గ్రాఫాలజీ అంటే చేతిరాతను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఒక శాస్త్రం. దీని ప్రకారం మ‌నలో ఉండే శారీర‌క‌, మాన‌సిక వ్యాధుల‌ను రెండింటినీ తెలుసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు గ్రాఫాల‌జిస్టులు. మ‌రి ఈ గ్రాఫాల‌జీ ప్ర‌కారం చేతి రాత ప్రకారం.. వ్యక్తుల వైఖరిని కూడా తెలుసుకోవచ్చట. అది ఎలాగో చూడండి. 

ఎడమ చేతి రాత..: మ‌న‌లో చాలామంది ఎడ‌మ‌చేతితో రాసేవారు ఉంటారు. అలా ఎడమ చేతితో స్ట్రెయిట్ గా కాకుండా.. ఏట‌వాలుగా రాసే వ్య‌క్తి నిరాశావాద వైఖ‌రిని క‌లిగి ఉంటార‌ట‌. వారు న‌లుగురితో స‌మ‌యం గ‌డ‌ప‌ం కంటే.. త‌మ‌తో తాము స‌మయాన్ని గ‌డ‌ప‌డానికే ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. దీనివ‌ల్ల వారు ఎక్కువగా డిప్రషన్‌కు లోన‌వుతుంటారు. కాబ‌ట్టి అలాంటి వారు స్ట్రెయిట్ గా కుడిచేతితో రాయ‌డం అల‌వాటు చేసుకుంటే క‌నుక స‌మ‌స్య తీరిపోతుందని చెబుతున్నారు గ్రాఫాల‌జిస్టులు. 

వదులుగా పట్టుకుని రాయడం: ఇక కొంద‌రు పెన్ ను వ‌దులుగా ప‌ట్టి లైట్ గా రాస్తుంటారు. అలాంటి వారు శాంతి ప్రేమికులుగా ఉంటార‌ట‌. ఎదుటివారిని త్వ‌ర‌గా క్ష‌మించేస్తార‌ట‌. వారికి జ‌రిగిన చెడు విష‌యాల గురించి మ‌ర్చిపోవడానికే ప్ర‌య‌త్నిస్తార‌ట‌. ఇక ఈర‌కంగా రాసే వారికి బీపీ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. కానీ అధిక ఒత్తిడితో పెన్ ను ప‌ట్టి రాసేవారికి మాత్రం త్వ‌ర‌గా కోపం వ‌స్తుంద‌ని, వారు ఇత‌రుల‌ను అంత ఈజీగా క్ష‌మించ‌లేర‌నీ, ఇక వారు ఎక్కువ ఒత్తిడికి లోనై బీపీ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. 

బేస్ లైన్ కింద రాసే వ్యక్తులు..: ఇక బేస్ లైన్ పైన కాకుండా కింద రాసే వ్య‌క్తి తీవ్ర‌మైన ఒత్తిడి, నిరాశ చెందుతున్నాడ‌ని అర్థం. అలాంటి వారిలో ఆత్మ‌విశ్వాసం త‌క్కువ‌గా ఉంటుంది. అదేవిధంగా వారు ప్ర‌తీ అంశాన్ని నెగెటివ్ గా చూస్తార‌ట‌. వారు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంద‌ట‌. ఇక బేస్ లైన్ పైన రాసేవారు త‌రుచుగా మూడ్ స్వింగ్స్ కు లోన‌వుతుంటార‌ట‌. ఏ డెసిష‌న్ ను అంత ఈజీగా తీసుకోలేర‌ట‌. అందుక‌ని త‌ప్ప‌కుండా బేస్ లైన్ పైన రాయ‌డం  నేర్చుకుంటే ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. బేస్ లైన్ పైనే రాసేవారు బ‌ల‌మైన నిర్ణ‌యాల‌ను క‌లిగి ఉండి, త‌మ ల‌క్ష్యాల‌ప‌ట్ల‌ ఆశాజ‌న‌కంగా, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటార‌ని చెబుతున్నారు. 

అక్షరాలను అంటించి రాయడం..: ఇక అక్ష‌రాల‌ను ఒక‌దానికొక‌టి అంటిస్తూ గ‌జిబిజిగా రాసే వారు ఎప్పుడూ ఆందోళ‌న చెందుతూ ఉంటారు. వారి జీవితంలో కూడా ఎలాంటి డెసిష‌న్ ను తీసుకోలేక గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌కు లోన‌వుతుంటారు. ఇక వ్యాక్యాల‌ను రాసేట‌ప్పుడు మ‌రీ ఎక్కువ స్పేస్ ఇస్తూ రాసేవారు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డే అవ‌కాశం ఎక్కువ‌. అలాగే త‌క్కువ స్పేస్ ఇస్తూ రాసే వారు బాగా అనుమాన‌స్తుల‌ట‌. అందుక‌ని ప‌దాల‌ను రాసేట‌ప్పుడు సాధార‌ణ‌మైన దూరాన్ని పాటిస్తూ రాయ‌డం మంచిద‌నీ, ఇది వారి ఆలోచ‌నా తీరును మారుస్తుంద‌ని అంటున్నారు. 

చెడు అలవాట్లను మానేయాలంటే..: మీలో ఎవ‌రైనా స్మోకింగ్ లేదా డ్రింకింగ్ లాంటి అల‌వాట్ల‌కు బానిస‌లైతే అలాంటి వారు వాటిని నియంత్రించుకోవాలంటే రాసే స‌మ‌యంలో పేప‌ర్ కు ఎడ‌మ వైపు మార్జిన్ వ‌దిలి బేస్ లైన్ పైనే రాయ‌డాన‌కి ప్ర‌య‌త్నిస్తే ఆ అల‌వాట్ల‌నుంచి దూర‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇలా వారి వారి ఆరోగ్య స్థితి, తీసుకునే మెడిసిన్ ను బ‌ట్టి, మాన‌సిక స్థితిని అంచ‌నా వేస్తూ మ‌న రాత‌లో కాస్త మార్పులు చేసుకుంటే మ‌న ఆరోగ్యం మ‌న చేతిరాత‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు గ్రాఫాల‌జిస్టులు. 

Also Read: ఎక్స్ పైర్ అయిన ఫుడ్ తింటే ఏమవుతుంది? వాటి వల్ల వచ్చే అనర్థాలేంటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget