అన్వేషించండి

Gas Cylinder Risks : శీతాకాలంలో గ్యాస్ సిలిండర్ వాడేప్పుడు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.. పాటించకపోతే ప్రమాదం తప్పదు

Gas Cylinder Precautions : చలికాలంలో గ్యాస్ సిలిండర్ వాడకంలో జాగ్రత్తలు అవసరం. అయితే చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీయవచ్చని.. అందుకే సేఫ్టీ టిప్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు.

Gas Cylinder Safety Tips : శీతాకాలంలో ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతాం. వేడిగా ఏమైనా తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల గ్యాస్ సిలిండర్ వాడకం కూడా పెరుగుతుంది. అలాగే చలి లోపలికి రాకుండా ఉండేందుకు తలుపులు, కిటికీలు ఎక్కువగా మూసి ఉంచుతారు. దీనివల్ల వంటగదిలో గాలి ప్రసరణ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్‌కు సంబంధించిన చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.  

గ్యాస్ లీకేజీ, అగ్ని ప్రమాదాలు లేదా ఊపిరాడకపోవడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. అందువల్ల చలికాలంలో గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. దీనివల్ల మీ ఇల్లు, కుటుంబం రెండూ సురక్షితంగా ఉంటాయి.

వెంటిలేషన్‌పై దృష్టి పెట్టండి

చలికాలంలో బయటి గాలి చల్లగా ఉన్నప్పటికీ.. వంటగదిలో సరైన వెంటిలేషన్ ఉండటం చాలా ముఖ్యం. వంట చేస్తున్నప్పుడు కిటికీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా ఆన్ చేయండి. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడూ చాలా చల్లని లేదా మూసి ఉన్న ప్రదేశంలో ఉంచవద్దు. సిలిండర్ ఎల్లప్పుడూ నిటారుగా, సమతలంగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. 

పైపు వంగిపోయిందా? లేదా వదులుగా ఉందా? అని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ వాసన కొద్దిగా వచ్చినా వెంటనే స్టవ్ ఆపి.. రెగ్యులేటర్ తీసేసి తలుపులు కిటికీలు తెరవండి. అలాంటి పరిస్థితుల్లో లైట్ లేదా స్విచ్ ఆన్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇది స్పార్క్‌లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.

సేఫ్టీ చెక్‌ను నిర్లక్ష్యం చేయవద్దు

చలికాలంలో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్, పైపును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మరింత ముఖ్యం. పాత లేదా విరిగిపోయిన పైపులను వెంటనే మార్పించండి. ఎందుకంటే చలిలో రబ్బరు గట్టిపడి పగిలిపోవచ్చు. సిలిండర్‌కు అనుసంధానించిన రెగ్యులేటర్ సరిగ్గా లాక్ చేశారా? లేదా అని ప్రతిసారీ ఉపయోగించే ముందు తనిఖీ చేయించుకోవాలి. గ్యాస్ వెలిగించడానికి అగ్గిపెట్టె లేదా లైటర్‌ను మాత్రమే ఉపయోగించండి. 

మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి. సిలిండర్ దగ్గర హీటర్ వంటివి ఉంచడం చాలా ప్రమాదకరం. అలాగే గ్యాస్ అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ ఆపివేయడం అలవాటు చేసుకోండి. కొద్దిపాటి అప్రమత్తతతో చలికాలంలో పెద్ద ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget