అన్వేషించండి

Urination During Stomach Upset : విరేచనాలతో పాటు పదే పదే యూరిన్‌కు వెళ్తున్నారా? కారణాలు, జాగ్రత్తలు ఇవే

Diarrhoea and Frequent Urination : వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో చాలామందికి గడబిడగా ఉంటుంది. దీంతో తరచూ మూత్రవిసర్జనకు వెళ్తారు. అసలు దీనికి కారణాలు ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కడుపులో వికారం, విరేచనాలు తరచుగా మూత్రవిసర్జనకు కారణం.
  • మూత్రాశయం ఒత్తిడి, ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్ దీనికి ముఖ్య కారణాలు.
  • వేయించిన ఆహారం మానుకోండి; తీవ్ర లక్షణాలుంటే వైద్యుని సంప్రదించండి.

Frequent Urination Along With Diarrhoea : కడుపులో వికారం అనేది ఒక సాధారణ సమస్య. ఎందుకంటే వివిధ సందర్భాల్లో వివిధ కారణాల వల్ల చాలామంది దీనితో ఇబ్బంది పడతారు. అయితే కొన్నిసార్లు ఇది మరో అనారోగ్య సమస్యతో పాటుగా వస్తుంది. అంటే కొంతమందికి విరేచనాలు లేదా కడుపులో వికారంతో పాటు.. తరచుగా మూత్రవిసర్జన కూడా అవుతుంది. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కానప్పటికీ.. శరీరంలో జరిగే కొన్ని మార్పులు దీనికి కారణం కావచ్చు. 

మూత్రాశయంపై ఎఫెక్ట్..

విరేచనాలు అయినప్పుడు శరీరం నుంచి అధిక మొత్తంలో నీరు, అవసరమైన లవణాలు కోల్పోతారు. ఈ మార్పును తట్టుకోవడానికి శరీరం ప్రయత్నిస్తుంది. కానీ కొన్నిసార్లు కడుపు, పేగులలో సంక్రమణ లేదా వాపు చుట్టుపక్కల అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. పైగా కడుపు, మూత్రాశయం ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే కడుపు సమస్యలు వచ్చినప్పుడు మూత్రాశయంపై ఒత్తిడి కలుగుతుంది. ఇది తరచుగా మూత్రవిసర్జనకు కారణం అవుతుంది.

ఇన్​ఫెక్షన్​ ఎఫెక్ట్..

విరేచనాలు, తరచుగా యూరిన్​కి వెళ్లడం ఒకే ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా కలుషితమైన ఆహారం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేయగలవు. ఒకవేళ ఇన్ఫెక్షన్ మూత్ర మార్గానికి చేరితే, తరచుగా మూత్రవిసర్జన, మంట లేదా అసౌకర్యం వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే కేవలం కడుపు నొప్పి గురించే కాకుండా ఇతర మూత్ర సంబంధిత సమస్యలపై కూడా శ్రద్ధ పెట్టడం ముఖ్యం.

డీహైడ్రేషన్..

శరీరంలో ద్రవాలు తగ్గడం లేదా డీహైడ్రేషన్ కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విరేచనాలు అయినప్పుడు చాలామంది ఎక్కువ నీరు, ఓఆర్ఎస్ లేదా ఇతర ద్రవపదార్థాలు తాగుతారు. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మూత్రవిసర్జన తరచుగా జరగవచ్చు. ఇది నార్మల్ కావచ్చు. కానీ మీకు విపరీతమైన దాహం, తల తిరగడం లేదా మీ మూత్రం చాలా ముదురు రంగులోకి మారితే.. అది కూడా డీహైడ్రేషన్‌కు సంకేతం కావచ్చు.

ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇలాంటి పరిస్థితిలో మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కడుపులో అసౌకర్యంగా ఉంటే.. వేయించిన ఆహారాలు, మసాలా, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ నూనె ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి పేగులపై అదనపు ఒత్తిడిని కలిగించి.. విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతేకాకుండా షుగర్, కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా సమస్యను ఎక్కువ చేస్తాయి.

మిల్క్ ప్రొడెక్ట్స్

చాలా మందిలో పాలు, కొన్ని పాల ఉత్పత్తులు కూడా కడుపు నొప్పిని పెంచుతాయి. అందుకే విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, మీగడ లేదా చిక్కటి పాల ఉత్పత్తులకు తాత్కాలికంగా దూరంగా ఉండాలి. అరటిపండ్లు, గంజి, టోస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు, తేలికపాటి భోజనం కడుపుకు ఉపశమనం కలిగిస్తుంది. 

వైద్య సహాయం.. 

ఒకవేళ విరేచనాలు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. దానితో పాటు మంట, మూత్రంలో రక్తం, లేదా అధిక జ్వరం వంటి లక్షణాలు ఉంటే.. నిర్లక్ష్యం చేయకండి. ఇటువంటి పరిస్థితి ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స చేయడం ద్వారా సమస్య మరింత తీవ్రం కాకుండా నివారించవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Desk Job Health Risks : డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
Munagaku Roti Pachadi : నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Morning Skincare Routine : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి
గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget