అన్వేషించండి

Snake Bite Medicine : నాగపాము, రక్తపింజిరి, కట్లపాము కాటేసినా ఈ మందు వాడితే చాలట.. కేవలం 300 రూపాయాలతో ప్రాణం కాపాడవచ్చా?

Anti Snake Venom : నాగుపాము, కట్లపాము కాటేసినా చికిత్స ఉందా? యాంటీ స్నేక్ వీనోమ్ ఎలా పని చేస్తుంది? పాము కాటు మరణాలను తగ్గించే ఈ మందు గురించి వైద్యులు వెల్లడించిన కీలక విషయాలు ఇవే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇండియాలో పాముకాటు మరణాలు తగ్గించడానికి ASV కీలకమైనది.
  • విషపాముల విషంతో గుర్రం రక్తం నుండి ASV తయారవుతుంది.
  • వైద్య పర్యవేక్షణలో ASV అందించాలి, నేరుగా ఇంజెక్ట్ చేయకూడదు.
  • పాముకాటు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి సరైన చికిత్స పొందాలి.

Snake Bite Deaths in India : ఇండియాలో ప్రతి ఏడాది పాము కాటుతో 50 వేల మంది రైతులు చనిపోతున్నారని.. కానీ ఈ మెడిసన్ అలాంటి వారికి అందుబాటులో ఉంటే వారి ప్రాణాలు కాపాడవచ్చని చెప్తున్నారు డాక్టర్ రవికాంత్ కొంగర. కేవలం 300 రూపాయాలతో అందుబాటులో ఉండే ఈ మెడిసన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ మెడిసన్ ఏంటి.. దానిని ఎలా తయారు చేస్తారు? ఇది ఎలా పని చేస్తుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

300 రూపాయల మందు..

ప్రపంచంలో పాము కాటుతో మరణిస్తున్నవారి సంఖ్య ఇండియాలోనే అధికమని డాక్టర్ రవికాంత్ కొంగర తెలిపారు. సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని.. లేకుంటే పాముకాటు ద్వారా జరిగే మరణాలు చాలావరకు తగ్గేవని చెప్తున్నారు. ఈ మందు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అదే యాంటీ స్నేక్ వీనోమ్ (Anti Snake Venom). ఇది కేవలం 300 రూపాయాలకే అందుబాటులో ఉంటుందని.. ఇది ప్రతీ గ్రామాల్లో అందుబాటులో ఉంచితే పాము కాటు మరణాలు తగ్గుతాయని అంటున్నారు. 

యాంటీ స్నేక్ వీనోమ్ తయారీ..

ఇండియాలో చాలా విషపూరితమైన వాటిలో నాగపాము, కట్లపాము, రక్తపింజిరి అని.. వీటి వల్లే చాలామంది మరణిస్తున్నారని తెలిపారు. అయితే వీటి విషాన్ని ఉపయోగించే యాంటీ స్నేక్ వీనోమ్ తయారు చేస్తారని వెల్లడించారు. అంటే నాగపాము, కట్లపాము, రక్తపింజిరి విషాన్ని తీసుకుని.. వాటిని కలిపి ఒక చుక్క గుర్రానికి ఎక్కిస్తారట. గుర్రం తన శరీరంలో వీటికి యాంటీబాడీలు తయారు చేస్తుంది. అప్పుడు గుర్రంలోని రక్తం తీసుకుని.. దానిలోని యాంటీ బాడీలను మందుగా చేస్తారు. ఇది మార్కెట్లో చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉంటుందని తెలిపారు. 

ఫస్ట్ ఎయిడ్ ఇదే..

కొందరు ఏ పాము కాటు వేసిందో చెప్తారు.. మరికొందరు చెప్పలేరు. అలాంటివారికి ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు వైద్యులు. పాము కాటు వేసినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తర్వాత చికిత్స చాలా సులభం అవుతుందని.. మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు టౌన్ వెళ్లేవరకు పరిస్థితి విషమించదని చెప్తున్నారు. 

బాధితుడికి నేరుగా ఇవ్వకూడదట..

ఇంజెక్షన్ రూపంలో ఈ మందును బాధితుడికి నేరుగా ఇవ్వకూడదని వైద్యులు చెప్తున్నారు. చాలామంది తెలియక నేరుగా తీసుకోవాలని చూస్తారు. కానీ దీనిని ఐవీగా ఇవ్వకూడదని.. సెలైన్​కి స్లోగా ఇవ్వాలని సూచిస్తున్నారు. వెంటనే నేరుగా వేగంగా ఇస్తే.. రియాక్షన్ కూడా ఒకేసారి ఇచ్చేస్తుందని.. అది కొందరికి ఇబ్బంది కలిగిస్తుందని సూచించారు. విషపూరితమైన పాము కాటేసిందనుకున్నప్పుడు దీనిని తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్తున్నారు. 

అలాగే పాము కాటేసిన వెంటనే ఈ ఇంజెక్షన్ వేస్తే సరిపోతుంది అనుకోకూడదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఎయిడ్ వైద్యుల పర్యవేక్షణలో, ఆసుపత్రిలో మాత్రమే ఇవ్వాల్సిన చికిత్స అని సూచిస్తున్నారు. ఎందుకంటే అలర్జీ లేదా అనాఫైలాక్సిస్ వంటివి ఉంటే తీవ్రమైన రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మందు అందరికీ ఒకే విధంగా ఇవ్వరు. పాము విషం లక్షణాలు, రోగి పరిస్థితిని బట్టి వైద్యులు ASV డోసు నిర్ణయిస్తారు.

పాముకాటు తర్వాత చేయాల్సినవి

ముందుగా బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. అలాగే కాటు వేసిన అవయవాన్ని కదలకుండా ఉంచాలి. వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్, చికిత్స చేయించాలి. అలాగే పాము కాటు వేస్తే.. ఆ గాయం కోయడం, విషం పీల్చడం, బిగుతుగా కట్టేయడం వంటి పద్ధతులు చేయకూడదని సూచిస్తున్నారు. అలాగే ప్రతి పాముకాటుకు ASV అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా పాములు విషరహితమైనవే.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget