Aromatherapy : ఒత్తిడిని దూరం చేసి ఏకాగ్రతను పెంచే సువాసనలు ఇవే.. కచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి
Stress Relief Scents : ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనసును తేలికపరిచే, హాయినిస్తూ.. ఏకాగ్రతను పెంచే అరోమాలను ఇంట్లోనే ఆస్వాదించండి. అయితే వేటితో ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం.

Fragrance Therapy to Reduce Stress : ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా? ఆలోచనలతో మనసు సతమతమవుతుందా? అయితే మీరు ఈ సింపుల్, ఓల్డ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే. మీకు మనశ్శాంతిని ఇచ్చి.. ఒత్తిడిని దూరం చేసే సువాసనలు మీ ఇంట్లోనే ఉన్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఎన్నో శతాబ్ధాలుగా సువాసనలు ఆధ్యాత్మికతతో ముడి పడి ఉన్నాయి. కానీ అవి ప్రదేశాలను శుద్ధి చేయడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, మనస్సును ప్రశాంతపరచడానికి హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. ధ్యానం చేస్తున్నా, డైరీ రాస్తున్నా లేదా రోజంతా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నా లేదా ఏకాగ్రతను పెంచుకోవాలన్నా ఈ సువాసనలు మీకు హెల్ప్ చేస్తాయట. ఏకాగ్రత, ప్రశాంతత, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే సువాసనలు ఏంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.
ప్రశాంతంగా మార్చే అగరుబత్తి
అగరుబత్తిని వెలిగిస్తే.. తన సువాసనతో.. ఆ ప్రదేశాన్ని ప్రశాంతంగా మార్చేస్తుంది. అధునాతన, ఆధ్యాత్మికతను ప్రోత్సాహిస్తుంది. కాబట్టి మీ మూడ్ బాలేకున్నప్పుడు.. మీ రూమ్లో చిన్న అగరుబత్తి వెలిగించండి. కొందరికి వీటి సువాసన నచ్చకపోవచ్చు. అలాంటివారు.. అగరబత్తుల్లో వివిధ ఫ్లేవర్స్ చూసి.. వాటిని ట్రై చేయవచ్చు.
మనసును శుద్ధి చేసే కర్పూరం
కర్పూరం శతాబ్దాలుగా ప్రదేశాలను, మనస్సులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తున్నారు. కర్పూరం అగరబత్తిని వెలిగించడం వలన ఒత్తిడి, ప్రతికూలతను తొలగించవచ్చట. ఇది ఏకాగ్రతను పెంచడంతో పాటు.. ఆధ్యాత్మిక సంబంధాన్ని మెరుగుపరిచే రిఫ్రెష్ వాతావరణాన్ని ఇస్తుంది.
ఎనర్జీకోసం ఫ్రెష్ పైనాపిల్
వైబ్రెంట్, రిఫ్రెషింగ్ ఫీల్ కోసం ఫ్రెష్ పైనాపిల్ ట్రై చేయవచ్చు. దీని అద్భుతమైన సువాసన రూమ్‌ని ఫ్రెష్‌గా మార్చేస్తుంది. మూడ్‌ని మెరుగుపరిచి.. సృజనాత్మకతను, ఉల్లాసకరమైన మనస్సును ప్రోత్సహిస్తుంది. ఉదయం లేదా ఆఫీస్ డెస్క్‌లో దీని స్మెల్ చూస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.
ప్రకృతి సిద్ధమైన లావెండర్
లావెండర్ స్మెల్‌ను చాలామంది ఇష్టపడతారు. దీని తాజా సువాసన ఆందోళనను తగ్గించడానికి, చంచలమైన మనస్సును శాంతపరచడానికి సహాయపడతాయి. కాబట్టి నిద్రపోయే ముందు లేదా ప్రశాంతమైన సమయంలో దీనిని ట్రై చేయవచ్చు. లావెండర్ ఫ్లేవర్ క్యాండిల్స్, రూమ్ ఫ్రెషనర్స్ ట్రై చేయవచ్చు.
హాయినిచ్చే చందనం
చందనం సువాసన మనస్సుకి హాయినిస్తుంది. ధ్యానం చేసేప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిచగలదు. ఇది ఏకాగ్రత, భావోద్వేగ స్థిరత్వాన్ని మెరుగుపరిచే గుణాలు, సహజంగా శాంతపరిచే గుణాలు కలిగి ఉంది.
అందమైన సువాసన ఇచ్చే రోజ్
గులాబీ ప్రేమ, స్వచ్ఛత, వైద్యంతో ముడిపడి ఉంటుంది. ఇది మృదువైన స్వభావంతో ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి, సానుకూలమైన ఆలోచనల కోసం.. ఈ ఫ్లేవర్ ఉండే క్యాండిల్స్, అగరుబత్తి వంటివి ఎంచుకోవచ్చు.
ఆనందాన్ని ఇచ్చే జాస్మిన్
మత్తు కలిగించే సువాసనకు మల్లెలు ప్రసిద్ధి చెందినవి. దీనిని చాలామంది ఇష్టపడతారు. మొగ్రా ఇంద్రియాలను మేల్కొల్పి.. ఆత్మను ఉత్తేజపరచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. బిజీగా ఉండే రోజులలో ప్రశాంతతను కోరుకునేవారికి ఇది బెస్ట్.
జ్ఞాపకాలను, భావోద్వేగాలను, మానసిక ప్రశాంతతను ఇచ్చే ఈ తరహా సువాసనలు ఇంట్లో రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజులో ఓసారైనా వీటిని ట్రై చేసి.. ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు.






















