అన్వేషించండి

World Let’s Stop Shouting Day : అరిచే అలవాటును వదిలేయండి.. ఇలా కమ్యూనికేట్ చేస్తేనే మంచిదట

Stop Yelling : కొంతమంది వివిధ కారణాలతో అరుస్తూ ఉంటారు. లేదా అరిచి తమ మాటను నెగ్గించుకోవాలనుకుంటారు. అలా అరవకుండా సున్నితంగా డీల్ చేయాలని చెప్తూ వరల్డ్ లెట్స్ స్టాప్ షౌటింగ్ డే నిర్వహిస్తున్నారు. 

World Let’s Stop Shouting Day 2025 : రోజువారీ జీవితంలో ఒత్తిడి, కోపం, ప్రెజర్ వంటివి అందరిలో చాలా కామన్​గా ఉంటున్నాయి. కొన్నిసార్లు బాధతో నిండి ఉంటే.. మరికొన్నిసార్లు కోపంతో ర్యాష్​గా మాట్లాడేస్తూ ఉంటాము. ఆ సమయంలో ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలనుకున్నా తెలియకుండానే అరిచేస్తూ ఉంటాము. టోన్ మారిపోతుంది. అగ్రెసివ్​గా మాట్లాడేస్తూ ఉంటాము. ఇలా మాట్లాడడం సరికాదని చెప్తూ.. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ లెట్స్ స్టాప్ షౌటింగ్ డే (World Let’s Stop Shouting Day) నిర్వహిస్తున్నారు. 

మీకు ఎవరైనా చెప్పారా? ఎందుకు అరుస్తున్నావు.. నార్మల్​గా చెప్పు అని. కచ్చితంగా చెప్పే ఉంటారు. అలాంటి సమస్య గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఎంత ప్రెజర్ ఉన్నా.. కోపం ఉన్నా ఎవరితోనూ అరుస్తూ మాట్లాడకూడదని.. అలా చేయడం వల్ల కమ్యూనికేషన్ దెబ్బతింటుందని చెప్పడమే ఈ స్టాప్ షౌటింగ్ డే ఉద్దేశం. దీనిని ప్రతి ఏడాది నవంబర్ 6వ తేదీన ప్రపంచం వ్యాప్తంగా నిర్వహిస్తునారు. అరవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? కమ్యూనికేషన్ ఎందుకు చెడిపోతుంది? రిలేషన్స్​లో జరిగే నష్టాలు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. 

ఈ మధ్యకాలంలో ఆఫీస్​లో ఒత్తిడి, ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది ఊరికే ఇరిటేట్ అవుతున్నారు. చిన్న విషయాలకే కోపం తెచ్చేసుకుంటున్నారు. దీనివల్ల అరవడం, కోపం చూపించడం అనేది నార్మలైజ్ అయిపోతుంది. అలా జరగకూడదని చెప్పతూ.. కోపాన్ని, చిరాకును తగ్గించుకోవాలని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తితో ఎలా కమ్యూనికేట్ చేయాలి? మైండ్​లో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? కోపాన్ని ఎలా తగ్గించుకోవాలనే అంశాలపై ప్రజలు దృష్టి పెట్టేలా చేయడమే దీని లక్ష్యం. 

అరిస్తే వచ్చే నష్టాలివే.. (Stress Anger Shouting Problem)

ఇంట్లో అరిస్తే రిలేషన్ షిప్స్​ పాడవుతాయి. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. పిల్లలపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. వర్క్ ప్లేస్​లో అరిస్తే మీ సహోద్యోగుల్లో మీపై ఇంప్రెషన్ మారుతుంది. అంతేకాకుండా మీకు సపోర్ట్ చేసేవాళ్లు తగ్గుతారు. మీకన్నా తక్కువ వాళ్ల మీద అరిచే అధికారం మీకు ఉన్నా.. చూసేవాళ్లకి అధికారంగా కాదు.. మీరు వాళ్లని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది. 

అరవకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Calm Communication Tips)

మీరు మాట్లాడేప్పుడు టోన్ తగ్గించి మాట్లాడండి. కోపంతో చెప్పే బదులు నిధానంగా కమ్యూనికేట్ చేయండి. ఫ్యామిలీతో మాట్లాడేప్పుడు కూడా మంచిగా కూర్చోబెట్టి మీ మైండ్​లో ఉన్న విషయాలు చెప్పండి. ఆఫీస్​లో టాక్సిక్​గా మాట్లాడకండి. ఒత్తిడిని తగ్గించే చిట్కాలు ఫాలో అవ్వండి. ఆర్గ్యూమెంట్స్ సమయంలో కూడా అరుస్తూ కాకుండా లాజిక్​, క్లారిటీతో పరిస్థితిని హ్యాండిల్ చేయండి. 

మన మాటలు, మన టోన్ ఇతరులపై ప్రభావం చూపిస్తుందని గుర్తించుకోవాలి. అది తెలియకపోతే మీరు తెలియకుండానే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మీ టోన్​ అంతే అని చెప్పే బదులు.. దానిని తగ్గించడానికి, శాంతపరచడానికి ప్రయత్నించాలి. ఆర్గ్యూమెంట్స్ సమయంలో 5 సెకన్లు ఆగి.. కోపాన్ని దిగమింగి.. మాట్లాడాలి. అలాగే పిల్లలకు కూడా అరుస్తూ కాకుండా నిదానంగా చెప్పాలి. అలాగే సోషల్ మీడియాలో కూడా కోపంగా కామెంట్లు పెట్టకూడదు. అలా ఎవరైనా పెడితే వాటిని డిలీట్ చేయడం లేదా అవాయిడ్ చేయడం చేయాలి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget